ఖమ్మం: ఐదో తరగతి చదివే విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేసిన ఘటన ఖమ్మంలోని గట్టయ్య సెంటర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో బుధవారం చేటుచేసుకుంది. పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినితో అదే పాఠశాలలో ఆరేళ్లుగా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
ద్వందంద్ధంలో మాట్లాడాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తన రోజురోజుకూ మితిమీరుతుండడంతో సదరు విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బంధవులు, కుటుంబసభ్యులు బుధవారం పాఠశాలకు వచ్చి.. ఆ ఉపాధ్యాయుడిని ప్రశ్నించడంతో పాటు దేహశుద్ది చేశారు. పాఠశాల యాజమాన్యం అతడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
Published Wed, Feb 25 2015 11:02 PM | Last Updated on Thu, Sep 27 2018 5:29 PM
Advertisement
Advertisement