విద్యార్థినిపై స్కూల్‌లో గ్యాంగ్‌రేప్‌ | Rajasthan school director, teacher booked for student gangrape | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై స్కూల్‌లో గ్యాంగ్‌రేప్‌

Published Mon, Sep 18 2017 5:12 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

విద్యార్థినిపై స్కూల్‌లో గ్యాంగ్‌రేప్‌ - Sakshi

విద్యార్థినిపై స్కూల్‌లో గ్యాంగ్‌రేప్‌

జైపూర్‌(రాజాస్థాన్‌): విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాద్యాయులే ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని శికార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. షాపురా పట్టణంలోని ఓ ప్రైవేట్‌ స్కూలులో చదువుతున్న బాలికపై అదే స్కూలు డైరెక్టర్‌ జగదీస్‌ యాదవ్‌, ఉపాద్యాయుడు జగత్‌ సింగ్‌ గుర్జార్‌ కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.  అదనపు క్లాసులు ఉన్నాయంటూ సాయంత్ర సమయంలో బాలికను పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చింది. 

దీంతో వారు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్‌ చేయించారు. అది వికటించటంతో బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. విషయం తెలుసుకున్న బాధితురాలి  తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. బాలికకు తెలియకుండానే గర్భస్రావం చేయటంతోపాటు సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించిన వైద్యులు రజినీష్‌ శర్మ, ఆయన భార్య కానన్‌లపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నింధితుల కోసం పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరగా వారిని పట్టుకుంటామని అజీత్‌ఘడ్‌ ఎస్‌హెచ్‌వో మంగళ్‌రాం ఓలా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement