ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు విలవిలల్లాడుతున్నారు. ఉక్కపోత ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. ఉడికించేలా వేడిగాలులు ఊపిరాడకుండా చేస్తున్నాయి.మూడు రోజులుగా అనూహ్యంగా వాతావరణంలో మార్పులతో బెంబేలెత్తిపోతున్నారు. రోడ్ల మీదకు రావాలంటే భయపడుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి.