
మంత్రి గంటా శ్రీనివాస రావు (ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం 3 రోజులు సెలవు ప్రకటించింది. జూన్ 19 నుంచి 21 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సోమవారం మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్న వాతవరణ శాఖ సూచనల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలు కూడా తప్పని సరిగా సెలువుల ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.