![school management burns many phones in dhaka - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/6/phones-burn.jpg.webp?itok=FlNFxrQl)
ఢాకా: ఫోన్ల వినియోగం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. అవి లేకుండా రోజు గడిచే పరిస్థితి లేదు. అయితే రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులకు మాత్రం ఫోన్ వినియోగించడంపై నిషేధం ఉంటుందనే విషయం తెలిసిందే. ఇలాగే బంగ్లాదేశ్‌లోని ఢాకాలోగల హథాజారీ బర్హా మదర్సాలో రెసిడెంట్ విద్యార్థులుగా చదువుతున్నవారు కూడా ఫోన్ వాడొద్దనే నిబంధన ఉంది.
అయితే కొందరు విద్యార్థులు దొంగచాటుగా ఫోన్లు వాడుతున్నారని, మ్యూజిక్ వింటున్నారని, వీడియోలు చూస్తున్నారని తెలుసుకున్నారు. దీనిపై స్పందించిన యాజమాన్యం వారి నుంచి వందలాది ఫోన్లను స్వాధీనం చేసుకుంది. వాటన్నింటిని ఒకచోట వేసి తగులబెట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment