ఒడిస్సా: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్కూలు యాజమాన్యం పంచిన మిఠాయిలు తినడం విద్యార్థుల పాలిట శాపమైంది. కలుషితమైన స్వీట్లు తినడంతో 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. ఈ ఘటన ఒరిస్సాలోని సోరో పోలీస్ స్టేషన్ పరిధిలో 40కిలోమీటర్ల దూరంలో ఉన్న బనాభిషన్పూర్ స్కూల్లో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని జాతీయా పతకాన్ని ఎగురవేసినా అనంతరం విద్యార్థులకు ఆ స్కూలు యాజమాన్యం మిఠాయిలను పంచింది. మిఠాయిలు తిన్న కొద్దిసేపటికే విద్యార్థులకు వాంతులు, వికారం కలిగి తీవ్ర అస్వస్థకు గురైయ్యారు. కొందరి విద్యార్థుల పరిస్థితి విషమించడంతో వారి తల్లిదండ్రులు బాలసోర్ ఆస్పత్రికి తరలించారు. స్కూలు యాజమాన్యం పంచిన స్వీట్లు తినడంవల్లే పిల్లల పరిస్థితి ఇలా అయిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఆస్పత్రిలో చేరిన విద్యార్థులను పరిశీలించిన అక్కడి వైద్యులు అనూప్ ఘోష్ విషపూరితమైన మిఠాయిలు తినడంవల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు చెప్పారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు చెప్పారు. నలుగురు విద్యార్థుల పరిస్థితి పూర్తిగా విషమించడంతో వారిని ప్రథమ చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్యబృందాన్ని స్కూలుకు పంపినట్టు అనూప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
విషాహారం తిని 150 విద్యార్థులకు అస్వస్థత
Published Fri, Aug 15 2014 10:58 PM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM
Advertisement
Advertisement