స్కూళ్లు తెరిచాక చూడాలి.. అసలు సంగతి! | real test for odd even formula will be after schools are opened, says kiran bedi | Sakshi
Sakshi News home page

స్కూళ్లు తెరిచాక చూడాలి.. అసలు సంగతి!

Published Fri, Jan 1 2016 2:55 PM | Last Updated on Sat, Sep 15 2018 5:49 PM

స్కూళ్లు తెరిచాక చూడాలి.. అసలు సంగతి! - Sakshi

స్కూళ్లు తెరిచాక చూడాలి.. అసలు సంగతి!

రాజధాని కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రారంభించిన సరి-బేసి కార్ల ఫార్ములా గురించి ఢిల్లీ తొలి మహిళా పోలీసు కమిషనర్ కిరణ్ బేడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు ఉన్నాయని, జనవరి ఒకటో తేదీ కూడా కావడంతో జనం ఇంకా సెలవు మూడ్‌లోనే ఉన్నారని ఆమె అన్నారు. దానివల్ల ట్రాఫిక్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చని, అయితే స్కూళ్లు తెరిచిన తర్వాత కూడా దీన్ని సమర్థంగా అమలు చేయగలిగితే మంచిదని అన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సరి-బేసి పద్ధతిలో కార్లను అనుమతిస్తున్న సందర్భంగా ఈ 15 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ సమయంలో స్కూలు బస్సులను డీటీసీ తన ఆధీనంలోకి తీసుకుని, సిటీబస్సులుగా నడిపిస్తుంది.

ప్రస్తుతం ఎవరూ సరి-బేసి వ్యవస్థను విజయవంతం అయ్యిందని గానీ, విఫలం అయ్యిందని గానీ చెప్పకూడదని, అందరూ దీనికి సహకరించాలనే చెప్పాలని అన్నారు. సరి బేసి ప్లాన్‌కు అసలైన పరీక్ష మాత్రం స్కూళ్లు తెరిచిన తర్వాతే ఎదురువుతుందని, అప్పుడే ఢిల్లీవాసులు అందరూ నిజంగా రోడ్లను ఉపయోగిస్తారని ఆమె అన్నారు. అలాగే, ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయని, వాటి గురించి కూడా ఆలోచించాలని  చెప్పారు. కిరణ్ బేడీ ఢిల్లీలో పనిచేసినప్పుడు రోడ్లమీద అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన కార్లు, ఇతర వాహనాలను క్రేన్లతో టోయింగ్ చేయించి, అక్కడినుంచి తరలించేవారు. అందుకే ఆమెను అప్పట్లో 'క్రేన్ బేడీ' అని కూడా పిలిచేవాళ్లు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement