బెంగళూరు: దేశ ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగని రాజ్యాంగబద్ధమైన పదవిని కించపరిచేలా మాట్లాడడమూ మంచిది కాదని తెలిపింది. ఈ మేరకు ఓ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన కేసును కొట్టేస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బీదర్‌లోని షాహీన్ స్కూల్ మేనేజ్‌మెంట్‌పై ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారనే అభియోగాల మీద దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. చెప్పుతో కొడతామంటూ ఓ నాటకంలో పిల్లలతో చెప్పించారని న్యూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. తద్వారా మత సమూహాల మధ్య గొడవలు కలిగించేందుకు యత్నించారనే ఆరోపణలపై.. ఐపీసీ సెక్షన్ 153(ఏ) ప్రకారం దేశద్రోహం కేసు నమోదు చేశారు.
అయితే ఇది దేశ ద్రోహం కిందకు రాదని కర్ణాటక హైకోర్టు కల్బుర్గి బెంచ్ స్పష్టం చేసింది. ‘‘ప్రధానిని చెప్పుతో కొడతానని అనడం ఆ హోదాని అవమానించడం మాత్రమే కాదు.. బాధ్యతారాహిత్యం కూడా. ఒక పద్దతి ప్రకారం చేసే విమర్శలకు సహేతుకత ఉంటుంది. అంతేగానీ.. ఇలా ఇష్టానుసారం మాట్లాడడం సరికాదు. అలాగని ప్రధానిని కించపర్చడం దేశద్రోహం కిందకు రాదు అని జస్టిస్ హేమంత్ చందన్‌గౌడర్ తీర్పు సందర్భంగా స్పష్టం చేశారు..
అయితే ఈ కేసు ఇప్పటిది కాదు.. 2020 నాటిది. ఆ సమయంల సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్(NRC)లకు వ్యతిరేకంగా స్కూల్‌లో 4,5,6వ తరగతి విద్యార్థులతో ఓ నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలోనే ప్రధాని మోదీని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ డైలాగులు రాసి పిల్లలతో ప్రదర్శించారు.
దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నేత నీలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. కాలేజీ మేనేజ్‌మెంట్‌లోని నలుగురిపై భారత శిక్షాస్మృతి(IPC) సెక్షన్ 504, 505(2), 124A(దేశద్రోహం), 153ఏ రీడ్ విత్ సెక్షన్ 34ల ఆధారగా కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రధాని వంటి రాజ్యాంగాధికారులను అవమానించవద్దని తీర్పు సమయంలో అభిప్రాయపడ్డ కోర్టు.. పిల్లలచేత రాజకీయ విమర్శలు చేయించడం సరికాదని, బదులుగా వాళ్ల అకడమిక్ ఇయర్‌కు సంబంధించిన అంశాలపై నాటకాలు వేయించడం మంచిదని స్కూల్ యాజమాన్యాన్ని సూచిస్తూ దేశద్రోహం కేసును కొట్టేసింది.
ఇదీ చదవండి: రాజకీయాల్లో రాహుల్‌తో పోలికా? సరిపోయింది
Comments
Please login to add a commentAdd a comment