scold
-
‘ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదు!’
బెంగళూరు: దేశ ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగని రాజ్యాంగబద్ధమైన పదవిని కించపరిచేలా మాట్లాడడమూ మంచిది కాదని తెలిపింది. ఈ మేరకు ఓ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన కేసును కొట్టేస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీదర్‌లోని షాహీన్ స్కూల్ మేనేజ్మెంట్పై ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారనే అభియోగాల మీద దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. చెప్పుతో కొడతామంటూ ఓ నాటకంలో పిల్లలతో చెప్పించారని న్యూటౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తద్వారా మత సమూహాల మధ్య గొడవలు కలిగించేందుకు యత్నించారనే ఆరోపణలపై.. ఐపీసీ సెక్షన్ 153(ఏ) ప్రకారం దేశద్రోహం కేసు నమోదు చేశారు. అయితే ఇది దేశ ద్రోహం కిందకు రాదని కర్ణాటక హైకోర్టు కల్బుర్గి బెంచ్ స్పష్టం చేసింది. ‘‘ప్రధానిని చెప్పుతో కొడతానని అనడం ఆ హోదాని అవమానించడం మాత్రమే కాదు.. బాధ్యతారాహిత్యం కూడా. ఒక పద్దతి ప్రకారం చేసే విమర్శలకు సహేతుకత ఉంటుంది. అంతేగానీ.. ఇలా ఇష్టానుసారం మాట్లాడడం సరికాదు. అలాగని ప్రధానిని కించపర్చడం దేశద్రోహం కిందకు రాదు అని జస్టిస్ హేమంత్ చందన్‌గౌడర్ తీర్పు సందర్భంగా స్పష్టం చేశారు.. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు.. 2020 నాటిది. ఆ సమయంల సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్(NRC)లకు వ్యతిరేకంగా స్కూల్లో 4,5,6వ తరగతి విద్యార్థులతో ఓ నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలోనే ప్రధాని మోదీని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ డైలాగులు రాసి పిల్లలతో ప్రదర్శించారు. దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నేత నీలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. కాలేజీ మేనేజ్మెంట్లోని నలుగురిపై భారత శిక్షాస్మృతి(IPC) సెక్షన్ 504, 505(2), 124A(దేశద్రోహం), 153ఏ రీడ్ విత్ సెక్షన్ 34ల ఆధారగా కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రధాని వంటి రాజ్యాంగాధికారులను అవమానించవద్దని తీర్పు సమయంలో అభిప్రాయపడ్డ కోర్టు.. పిల్లలచేత రాజకీయ విమర్శలు చేయించడం సరికాదని, బదులుగా వాళ్ల అకడమిక్ ఇయర్‌కు సంబంధించిన అంశాలపై నాటకాలు వేయించడం మంచిదని స్కూల్ యాజమాన్యాన్ని సూచిస్తూ దేశద్రోహం కేసును కొట్టేసింది. ఇదీ చదవండి: రాజకీయాల్లో రాహుల్‌తో పోలికా? సరిపోయింది -
గుడివాడ: పోలీసులను దర్భాషలాడిన రావి
సాక్షి, కృష్ణా: గుడివాడ టీడీపీ నేతలు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఈ క్రమంలో.. ఆవేశంతో పోలీసుల మీదకు దూసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు.. సీఐపై బెదిరింపులకు దిగాడు. శుక్రవారం అనుమతులు లేకుండా నెహ్రూ చౌక్ సెంటర్లో ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాలు నిర్వహించుకున్నారు టీడీపీ నేతలు. ఆ సమయంలో.. అనుమతులు తీసుకోవాలని సీఐ గోవిందరాజులు, వాళ్లకు సూచించారు. ఈ క్రమంలో సీఐ మాట్లాడుతుండగానే.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆవేశంతో ఆయన మీదకు దూసుకెళ్లాడు. అంతేకాదు.. ఏం చేస్తారో చూస్తాం అంటూ పోలీసుల ముందే టపాసులు కాల్చారు వాళ్లంతా. ఇది పద్దతి కాదని సీఐ గోవిందరాజులు, రావిని ప్రశ్నించగా.. మీ సంగతి తేలుస్తామని, టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలీసుల గడ్డలూడదీసి కొడతానంటూ దర్భాషలాడాడు రావి వెంకటేశ్వరరావు. -
తమ్ముడి నిర్వాకం... సొంత అక్కపైనే అఘాయిత్యం
18-year-old youth shoots sister: చెడు అలవాట్లకు బానిసైన వాళ్లను దారిలో పెట్టెందుకు కుటుంబ సభ్యులు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఒక్కసారి కౌన్సిలింగ్‌లకు పంపించి మరీ సరైన మార్గంలో పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. అయితే వాళ్లు సహకరిస్తేనే ఏదైన చేయగలం. మరికొంత మందికి అవి చెవికి ఎక్కవు, పైగా కక్ష పెంచుకుని ఎంతటి దుర్మార్గానికైన ఒడికట్టేందుకు ప్రయత్నిస్తారు. అచ్చం అలాంటి ఘటనే గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో హర్ధోయి ప్రాంతంలోని 32 ఏళ్ల వివాహిత సోదరుడు తాగుడికి బానిసై అందర్నీ దూషించడం వంటి పనులు చేస్తుంటాడు. దీంతో విసిగిపోయిన ఆమె తన తమ్ముడుని తాగడం మానేయమని హితవు చెప్పింది. ఇలా అందర్నీ దూషించడం సరికాదని చెప్పేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసలే తాగి ఉన్నాడమే ఆ మైకంలో ముందు వెనుక చూడకుండా పిస్టల్ తీసుకుని తన అక్కనే అతి దారుణంగా కాల్చి చంపి అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులకు సంఘటన స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్నారు. ఈ మేరకు నిందుతుడిని షహబెరి ప్రాంతంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ యోగేంద్ర సింగ్ పేర్కొన్నారు. -
చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు అరెస్ట్
సాక్షి, అనంతపురం: మహిళలపై దౌర్జన్యం చేసిన చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. పుట్లూరు మండలం ఏ.కొండాపురం లో సోమశేఖర్ నాయుడుపై ఇటీవల హత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై ప్రకాష్ నాయుడు, అతని సోదరులపై బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో తనపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ ప్రకాశ్ నాయుడు మహిళలపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పుట్లూరు పోలీసులు టీడీపీ నేత ప్రకాష్ నాయుడుపై హత్యాయత్నం, దౌర్జన్యం కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (టీడీపీ నేత ప్రకాశ్ నాయుడు దౌర్జన్యం..) -
అనంతపురం: చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడు దౌర్జన్యం
-
టీడీపీ నేత ప్రకాశ్ నాయుడు దౌర్జన్యం.. మహిళను పబ్లిగ్గా బూతులు తిడుతూ
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతున్నప్పటికి.. పచ్చ పార్టీ నేతలకు బుద్ది రావడం లేదు. తాజాగా టీడీపీ నేత ఒకరు మహిళపై బెదిరింపులకు దిగారు. ఆ వివరాలు.. చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు మహిళపై దౌర్జన్యానికి పాల్పడుతున్న వీడియో ఒకటి శనివారం వెలుగులోకి వచ్చింది. (చదవండి: సీఎంను పట్టుకుని ఆ బూతులేంటి?: కేటీఆర్) అనంతపురం జిల్లా, పుట్లూరు మండలం ఏ.కొండాపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల సోమశేఖర్ నాయుడును కారుతో గుద్ది చంపేందుకు యత్నించారంటూ ప్రకాశ్ నాయుడి సోదరులపై ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ క్రమంలో ప్రకాశ్ నాయుడు బాధితుల ఇంటికెళ్లి బెదిరించాడు. తనపైనే కేసు పెడతారా అంటూ ప్రకాశ్ నాయుడు ఓ మహిళలపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమెకు వార్నింగ్ ఇచ్చి పబ్లిగ్గా బూతులు తిట్టాడు ప్రకాశ్ నాయుడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కలకలం రేపుతోంది. చదవండి: ‘పట్టాభి ఓ గే’.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహిళ -
బోథ్ ఎమ్మెల్యే తిట్లపురాణం
సాక్షి, ఆదిలాబాద్: తన కారు వెళ్లే దారిలోనే ట్రాక్టర్ అడ్డుపెడుతారా? అంటూ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మావల మండలం బట్టిసావర్గాం గ్రామ పంచాయతీ కారోబార్‌పై తిట్ల పురాణం అందుకున్నారు. శనివారం ఆదిలాబాద్ నుంచి పొన్నారి శివారులోని తన వ్యవసాయ క్షేత్రానికి కారులో ఎమ్మెల్యే బయలుదేరారు. కాగా బట్టిసావర్గాం గ్రామంలో డీజిల్ అయిపోయిందని రోడ్డుపైనే పంచాయతీ ట్రాక్టర్‌ను నిలిపివేశారు. దీంతో తన కారుకే అడ్డుగా ట్రాక్టర్‌ను నిలుపుతారా..? అంటూ గ్రామ కారోబార్‌పై మండిపడ్డారు. ట్రాక్టర్ నిలపడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని కారోబార్ సమాధానం ఇచ్చినా శాంతించని ఎమ్మెల్యే ఉద్యోగంలో ఎలా కొనసాగుతావో, ఆదిలాబాద్‌కు ఎలా వస్తోవో చూస్తానని కారోబార్‌ను హెచ్చరించారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
తహసీల్దార్లపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
వరంగల్ రూరల్ : ఇద్దరు తహసీల్దార్లపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెస్సా) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరితకు ఫిర్యాదు చేశారు. ఒక ఫైల్ విషయంలో చర్చించడానికి వచ్చిన ఎమ్మెల్యే.. కలెక్టరేట్ ఈ-సెక్షన్ సూపరింటెండెంట్, తహసీల్దార్ జి.సదానందం, నర్సంపేట తహసీల్దారు ఫూల్‌సింగ్‌ను దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నర్సంపేట తహసీల్దారు ఈ మొత్తం సంఘటనను వీడియో తీసినందుకు అతడిపై పరకాల జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పానాదేవి భర్త పాడి ప్రతాపరెడ్డి, ఎమ్మెల్యే గన్‌మెన్ చేయి చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో కలెక్టరేట్ జీ-సెక్షన్ ఉద్యోగులు, సిబ్బంది సాక్షులుగా ఉన్నారని, సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో నెక్కొండ తహసీల్దార్ విశ్వనారాయణ, రాయపర్తి తహసీల్దార్, ట్రెస్సా ఉపాధ్యక్షుడు రాంమూర్తి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ పీఎస్.ఫణికుమార్ ఉన్నారు. కాగా, కలెక్టర్ హరితపై ఇటీవల నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
తాత అమ్మమ్మ మందలించారని..
యువకుడి ఆత్మహత్య మద్యానికి బానిసయ్యాడని మందలింపు పెదకూరపాడు: మద్యానికి బానిసైనందుకు తాత, అమ్మమ్మ మందలించారన్న కోపంతో వ్యవసాయ బావిలో పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెదకూరపాడు నుంచి లగడపాడులో చోటు చేసుకుంది. పెదకూరపాడు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అమరావతి మండలం ఆత్తలూరు గ్రామానికి చెందిన బుల్లా రామస్వామి, మరియమ్మ పెద్ద కుమారుడు బుల్లా సాగర్‌బాబు(20) అమ్మమ్మ ఊరు అయిన పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామంలో కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసై నిత్యం మద్యం తాగుతుండడంతో అమ్మమ్మ వేమవరపు మార్తమ్మ మందలించింది. దీంతో సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన సాగర్‌బాబు లగడపాడు నుంచి పెదకూరపాడు వెళ్లే మార్గమధ్యంలో పెదకూరపాడు చెందిన కర్ణం వీరయ్య పంట పొలంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పనులు నిమిత్తం బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో వీరయ్య పొలంలోకి పనులకు వచ్చిన కూలీలు బావిలో మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీఆర్వో నరసింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. -
ఎవరిని తాగుబోతులు అనలేదు
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్లను ఎవరిని తాగుబోతులు అని అనలేదని, ఏమైన ఉంటే విచారణ జరిపించుకోవాలని నల్లగొండ రీజినల్ సెక్యురిటీ సబ్ ఇన్స్పెక్టర్ దామోదర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున డ్రైవర్లను బీఏసీ (బీత్ ఎనలైజర్ మిషన్)తో ఆర్టీసీ కానిస్టేబుల్ గోపాలకృష్ణ పరిశీలన చేశారన్నారు. అయితే అనే వ్యక్తి డ్రైవర్లు కె.రామకృష్ణకు 13ఎంజీ/100ఎంఎల్, ఇతడికే రెండోసారి 7ఎంజీ రాగా, ఎం.ఎస్ నాయక్ 8ఎంజీ/100ఎంఎల్, రెండోసారి జీరో వచ్చిందని, ఎన్.రాములు 10ఎంజీ/100ఎంఎల్ రాగా రెండోసారి జీరో వచ్చిందన్నారు. రామకృష్ణకు మూడో సారి బ్రితింగ్ పెట్టాలని కార్మికులు డీఎం సుధాకర్‌పై వత్తిడి చేశారని, ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటే మూడో సారికి అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. అంతే తప్ప ఎవరినీ తాగుబోతులు అనలేదన్నారు. డ్రైవర్లు చేసిన బంద్‌కు తాను బాధ్యుడిని కాదన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు ఈ చెకింగ్ తప్పని సరిగా జరుగుతుందన్నారు. తాను కేవలం సూపర్వైజింగ్ మాత్రమే చేస్తానని అన్నారు. -
డీఎస్పీపై విచారణ చేపట్టాల్సిందే!
* రాజకీయ పార్టీ నేతలు, ప్రజా, కులసంఘాల సమావేశం డిమాండ్ * మాజీ ఎమ్మెల్యే జంగాపై దాడికి ఖండన * చర్యలు తీసుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక గుంటూరు (పట్నంబజారు) : మాజీ ఎమ్మెల్యే, బడుగు, బలహీన వర్గాల నేత జంగా కృష్ణమూర్తి యాదవ్‌పై గురజాల డీఎస్పీ కె.నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేసి, చేయి చేసుకోవడంపై శాఖాపరమైన విచారణ జరిపించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మద్దుల కోటయ్యయాదవ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని ప్రజా, కుల సంఘాలను కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బ్రాడీపేటలోని సింధూరి హోటల్లో రాజకీయ పార్టీల నేతలు, ప్రజా, కుల సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం మంగళవారం నిర్వహించారు. గురజాల డీఎస్పీ కె.నాగేశ్వరరావును సస్పెండ్ చేయాలని, జంగాకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోటయ్య యాదవ్ మాట్లాడుతూ వారంలో రోజుల్లో తమ డిమాండ్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు చొరవ తీసుకొని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామన్నారు. సామాజిక న్యాయం రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది వైకే, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, మాలమహానాడు జిల్లా అ«ధ్యక్షుడు కొర్రపాటి చెన్నకేశవులు, శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు రాజవరపు ఏడుకొండలు, నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకుడు తాటికొండ నరసింహారావు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పీవీ రమణయ్య మాట్లాడుతూ అధికార మదంతో బడుగు, బలహీన వర్గాలపై అహంకారపూరితంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపై దాడులు చేస్తే రాబోవు రోజుల్లో తమ సత్తా చాటుతామని స్పష్టం చేశారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పోలీసులను పచ్చచొక్కా కార్యకర్తల్లా మార్చుకొని దాడులు చే యిస్తున్నారని ధ్వజమెత్తారు. -
విద్యార్ధులను వాతలు రేగేలా కొట్టిన టీచర్
-
మద్యం తాగి ఎస్సైని దూషించిన కానిస్టేబుల్
-
అమ్మ తిట్టిందని విద్యార్థి ఆత్మహత్య
కాన్పూర్ : స్కూల్‌కు వెళ్లనందుకు అమ్మ తిట్టిందని నాలుగో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని పంకీ ఏరియాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సుందర్ నగర్‌కు చెందిన సత్యం రాజ్‌పుత్ (12) కొద్దిరోజులుగా స్కూల్‌కు వెళ్లటం లేదు. ఈ విషయమై నిన్న సాయంత్రం అతడిని తల్లి కోప్పడింది. దాంతో మనస్తాపం చెందిన సత్యం గతరాత్రి ఇంటి నుండి వెళ్లిపోయాడు. పంకీ ఏరియా సమీపంలో ఎదురుగా వస్తున్న రైలు కింద దూకి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సత్యం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించి, విచారణ చేపట్టారు.