అమ్మ తిట్టిందని విద్యార్థి ఆత్మహత్య | 12-years-old boy commits suicide after being scolded by mother | Sakshi
Sakshi News home page

అమ్మ తిట్టిందని విద్యార్థి ఆత్మహత్య

Published Wed, Nov 5 2014 1:52 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

12-years-old boy commits suicide after being scolded by mother

కాన్పూర్ : స్కూల్కు వెళ్లనందుకు అమ్మ తిట్టిందని నాలుగో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని పంకీ ఏరియాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సుందర్ నగర్కు చెందిన సత్యం రాజ్పుత్ (12)  కొద్దిరోజులుగా స్కూల్కు వెళ్లటం లేదు. ఈ విషయమై నిన్న సాయంత్రం అతడిని తల్లి కోప్పడింది.

దాంతో మనస్తాపం చెందిన సత్యం గతరాత్రి ఇంటి నుండి వెళ్లిపోయాడు. పంకీ ఏరియా సమీపంలో ఎదురుగా వస్తున్న రైలు కింద దూకి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సత్యం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించి, విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement