సాక్షి, కృష్ణా: గుడివాడ టీడీపీ నేతలు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఈ క్రమంలో.. ఆవేశంతో పోలీసుల మీదకు దూసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు.. సీఐపై బెదిరింపులకు దిగాడు.
శుక్రవారం అనుమతులు లేకుండా నెహ్రూ చౌక్ సెంటర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాలు నిర్వహించుకున్నారు టీడీపీ నేతలు. ఆ సమయంలో.. అనుమతులు తీసుకోవాలని సీఐ గోవిందరాజులు, వాళ్లకు సూచించారు. ఈ క్రమంలో సీఐ మాట్లాడుతుండగానే.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆవేశంతో ఆయన మీదకు దూసుకెళ్లాడు.
అంతేకాదు.. ఏం చేస్తారో చూస్తాం అంటూ పోలీసుల ముందే టపాసులు కాల్చారు వాళ్లంతా. ఇది పద్దతి కాదని సీఐ గోవిందరాజులు, రావిని ప్రశ్నించగా.. మీ సంగతి తేలుస్తామని, టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలీసుల గడ్డలూడదీసి కొడతానంటూ దర్భాషలాడాడు రావి వెంకటేశ్వరరావు.
Comments
Please login to add a commentAdd a comment