
18-year-old youth shoots sister: చెడు అలవాట్లకు బానిసైన వాళ్లను దారిలో పెట్టెందుకు కుటుంబ సభ్యులు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఒక్కసారి కౌన్సిలింగ్‌లకు పంపించి మరీ సరైన మార్గంలో పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. అయితే వాళ్లు సహకరిస్తేనే ఏదైన చేయగలం. మరికొంత మందికి అవి చెవికి ఎక్కవు, పైగా కక్ష పెంచుకుని ఎంతటి దుర్మార్గానికైన ఒడికట్టేందుకు ప్రయత్నిస్తారు. అచ్చం అలాంటి ఘటనే గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది.
అసలు విషయంలోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో హర్ధోయి ప్రాంతంలోని 32 ఏళ్ల వివాహిత సోదరుడు తాగుడికి బానిసై అందర్నీ దూషించడం వంటి పనులు చేస్తుంటాడు. దీంతో విసిగిపోయిన ఆమె తన తమ్ముడుని తాగడం మానేయమని హితవు చెప్పింది. ఇలా అందర్నీ దూషించడం సరికాదని చెప్పేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అసలే తాగి ఉన్నాడమే ఆ మైకంలో ముందు వెనుక చూడకుండా పిస్టల్ తీసుకుని తన అక్కనే అతి దారుణంగా కాల్చి చంపి అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులకు సంఘటన స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు‍్నారు. ఈ మేరకు నిందుతుడిని షహబెరి ప్రాంతంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ యోగేంద్ర సింగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment