sedition case
-
‘ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదు!’
బెంగళూరు: దేశ ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగని రాజ్యాంగబద్ధమైన పదవిని కించపరిచేలా మాట్లాడడమూ మంచిది కాదని తెలిపింది. ఈ మేరకు ఓ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన కేసును కొట్టేస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీదర్‌లోని షాహీన్ స్కూల్ మేనేజ్మెంట్పై ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారనే అభియోగాల మీద దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. చెప్పుతో కొడతామంటూ ఓ నాటకంలో పిల్లలతో చెప్పించారని న్యూటౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తద్వారా మత సమూహాల మధ్య గొడవలు కలిగించేందుకు యత్నించారనే ఆరోపణలపై.. ఐపీసీ సెక్షన్ 153(ఏ) ప్రకారం దేశద్రోహం కేసు నమోదు చేశారు. అయితే ఇది దేశ ద్రోహం కిందకు రాదని కర్ణాటక హైకోర్టు కల్బుర్గి బెంచ్ స్పష్టం చేసింది. ‘‘ప్రధానిని చెప్పుతో కొడతానని అనడం ఆ హోదాని అవమానించడం మాత్రమే కాదు.. బాధ్యతారాహిత్యం కూడా. ఒక పద్దతి ప్రకారం చేసే విమర్శలకు సహేతుకత ఉంటుంది. అంతేగానీ.. ఇలా ఇష్టానుసారం మాట్లాడడం సరికాదు. అలాగని ప్రధానిని కించపర్చడం దేశద్రోహం కిందకు రాదు అని జస్టిస్ హేమంత్ చందన్‌గౌడర్ తీర్పు సందర్భంగా స్పష్టం చేశారు.. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు.. 2020 నాటిది. ఆ సమయంల సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్(NRC)లకు వ్యతిరేకంగా స్కూల్లో 4,5,6వ తరగతి విద్యార్థులతో ఓ నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలోనే ప్రధాని మోదీని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ డైలాగులు రాసి పిల్లలతో ప్రదర్శించారు. దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నేత నీలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. కాలేజీ మేనేజ్మెంట్లోని నలుగురిపై భారత శిక్షాస్మృతి(IPC) సెక్షన్ 504, 505(2), 124A(దేశద్రోహం), 153ఏ రీడ్ విత్ సెక్షన్ 34ల ఆధారగా కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రధాని వంటి రాజ్యాంగాధికారులను అవమానించవద్దని తీర్పు సమయంలో అభిప్రాయపడ్డ కోర్టు.. పిల్లలచేత రాజకీయ విమర్శలు చేయించడం సరికాదని, బదులుగా వాళ్ల అకడమిక్ ఇయర్‌కు సంబంధించిన అంశాలపై నాటకాలు వేయించడం మంచిదని స్కూల్ యాజమాన్యాన్ని సూచిస్తూ దేశద్రోహం కేసును కొట్టేసింది. ఇదీ చదవండి: రాజకీయాల్లో రాహుల్‌తో పోలికా? సరిపోయింది -
ప్రశ్నించే గొంతులకు సంకెళ్లా?
‘దేశద్రోహ’ నేరారోపణ అన్నది వలస పాలకుల దౌర్జన్య పాలనావసరాల కోసం ఏర్పరచుకున్న ప్రత్యేక నిబంధన. వలస పాలనానంతరం ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఈ నిబంధన చేటు కలిగిస్తోంది. 2010 నుంచీ ఇప్పటివరకూ 800కు పైగా దేశద్రోహ కేసులు నమోదయ్యాయని ‘ఎ డికేడ్ ఆఫ్ డార్క్నెస్’ డేటాబేస్ చెబుతోంది. ఈ ప్రజా వ్యతిరేక చట్టాల కొనసాగింపు కేంద్రం వరకే పరిమితం కాలేదు. కొన్ని రాష్ట్రాల పాలకులు కూడా అదే ‘అలవాటు’లో ఉన్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం 150 మందికిపైగా పౌర హక్కుల ఉద్యమ నాయక, కార్యకర్తలపైన సాధికారత లేని ‘ఉపా’ కేసుల్ని మోపింది. భూస్వామ్య, ధనికవర్గ ప్రయోజనాల రక్షణే పాలకుల ప్రాధాన్యమా? ‘‘దేశంలో వలస పాలన అంతరించిన తరువాత కూడా, వలస పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం భారతదేశంలో పౌరులపైన, పౌర హక్కులపైన విధించిన ‘దేశద్రోహ’ చట్టంలోని ‘124–ఎ’ నిబంధన అమలు జరుగు తూండటం దారుణం. వలస పాలనానంతరం ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఈ నిబంధన చేటు కలిగిస్తోంది. ఈ తప్పుడు నిబంధన సృష్టించిన సమస్యను ఏ భాషా మార్పు వల్లా, నిబంధనల సరళింపు వల్లా పరిష్కరించలేము. ఎందుకంటే ‘దేశద్రోహ’ నేరారోపణ అన్నది వలస పాలకుల దౌర్జన్య పాలనావసరాల కోసం ఏర్పరచుకున్న ప్రత్యేక నిబంధన. కనుకనే స్వతంత్ర భారత సుప్రీంకోర్టు ‘124–ఎ’ దేశద్రోహ నేరా రోపణ నిబంధన స్వతంత్ర భారతంలో చెల్లదని కేదార్నాథ్ వర్సెస్ బిహార్ (1962) కేసు విచారణ సందర్భంగా కొట్టివేసింది. ఈ అత్యు న్నత న్యాయస్థానం నిర్ణయాన్ని పాలకులు అమలు జరిపి ఉంటే – ప్రభుత్వాన్ని విమర్శించిన నేరానికి లేదా అలాంటి విమర్శను ప్రసారం చేసే వీడియోలు విన్న నేరానికి లేదా అలాంటి పాటలు విన్న నేరానికి దేశ పౌరులపైన దేశద్రోహ కేసులను పాలకులు మోపి ఉండేవారు కాదు. ఇప్పటిదాకా రాజ్యాంగంలోని 14వ అధికరణ కింద 2010 నుంచీ ఇప్పటి వరకూ 800కు పైగా దేశద్రోహ కేసులు నమోదయ్యాయి.’’ – లభ్యతి రంగరాజన్ (ఇప్పటివరకూ దేశంలో నమోదైన ‘దేశద్రోహ’ కేసులను పరిశీలించి, వాటిని ‘ఓ దశాబ్దపు చిమ్మ చీకటి’ (ఎ డికేడ్ ఆఫ్ డార్క్నెస్) పేరిట ఏర్పాటుచేసిన డేటాబేస్ సాధికారికంగా నమోదు చేసింది. దీనికి లభ్యతి రంగరాజన్ ఎడిటర్‌గా ఉన్నారు.) దేశ పాలకులూ, వారి ఇష్టానుసారం మెలగుతున్న పాలనా యంత్రాంగమూ పుర్రెకు పుట్టిన బుద్ధి ప్రకారం పౌర సమాజాన్ని ఇబ్బంది పెట్టవచ్చా? అనుకూలమైన వలస చట్టాల చాటున అనేక రకాల నిర్బంధాలకు గురి చేయవచ్చునని ‘పెగసస్’ విదేశీ స్పైవేర్ కొనుగోలు చేసినప్పుడే ఇది నిరూపితమైంది. ఈ ప్రజా వ్యతిరేక చట్టాల కొనసాగింపు కేంద్రం వరకే పరిమితం కాలేదు. అలాంటి చట్టా లపై ఆధారపడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు కూడా అదే ‘అల వాటు’లో ఉన్నారు. ఉండబట్టే తాజా పరిణామాలలో భాగంగా దేశవ్యాప్తంగానూ, విదేశాల్లోనూ ఖ్యాతి పొందిన సుప్రసిద్ధ విద్యావేత్త, సంస్కర్త, పౌరహక్కుల ఉద్యమ నాయకులలో ఒకరు అయిన ప్రొఫె సర్ హరగోపాల్ సహా దాదాపు 150 మందికిపైగా పౌర హక్కుల ఉద్యమ నాయక, కార్యకర్తలపైన సాధికారత లేని ‘ఉపా’ కేసుల్ని మోపి పాలకులు తమ ‘చెవి దురద’ తీర్చుకున్నారు. ఆ ‘దురద’ను అంత త్వరగానూ తొలగ గొట్టుకోవడానికి తంటాలు పడ్డారు. ఏ ‘నేరం’పైన ఈ కుట్ర కేసు బనాయించవలసి వచ్చిందో స్పష్టత లేదు. కాగా, ఫక్తు తెలంగాణ వాసి, భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినా ఆ వాసనకు దూరంగా ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి, తాను పుట్టి పెరిగిన ఫ్యూడల్ సంప్రదాయాల్ని కాలదన్నిన వారు బి.నరసింగరావు. తెలంగాణలో తన ప్రజలు అనుభవించిన భూస్వామ్య దాష్టీకాలను కళ్లారా చూసి మనసు చెలించి, ‘దాసి’ చలన చిత్రం ద్వారా ధనిక వర్గ దుర్మార్గాన్ని ఎండగట్టి దేశంలోనే గాక అంతర్జాతీయంగానూ ఆయన ఖ్యాతి గడించారు. అలాంటి నేలతల్లి బిడ్డకు కూడా పాలకులు ‘ఇంటర్వ్యూ’ ఇవ్వడానికే జంకారు, కాదు భయపడ్డారు, లేదా బిడియపడ్డారు! ఎందుకు? నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనే తెలంగాణకు నిజమైన రక్షణ ఉందని ఆయన ప్రకటించినందుకు! పేరుకు తగ్గట్టే ఆయనది తెలంగాణలోని ‘ప్రజ్ఞాపురం’. వాస్తవం ప్రకటించినందుకు తనకు ఇంటర్వ్యూను నిరాకరించిన నేటి తెలంగాణ పాలకులను ప్రశ్నిస్తూ నరసింగరావు ఎక్కడ పుట్టిన ‘కమలం’ ఇది అని ప్రశ్నించడం కొంత బాధాకరమైనదైనా అది తనకు జరిగిన అవమానాన్ని వ్యక్తం చేయడానికి ఉద్దేశించింది మాత్రమేనని భావించాలి. భారత లౌకిక రాజ్యాంగం నిర్దేశించి నెలకొల్పిన సుసంప్ర దాయాలు ఎన్నో ఉన్నా వాటిని తృణీకరించి ప్రజా వ్యతిరేక పాలనను డొల్లించుకుపోతున్న పాలకులకు ‘ముగుదాడు’ వేయగల ప్రజా స్వామిక న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఉన్నందున, పాలకులు, పాలనా వ్యవస్థ కొంతమేర అదుపులో ఉన్నట్టు కన్పిస్తోంది. కానీ లోపాయికారీ పద్ధతుల్లో దేశంలోని ఫెడరల్ వ్యవస్థ ప్రయోజనాల్ని దెబ్బతీయడానికి మరోవైపు నుంచి మతవాద, మితవాద శక్తులు చీలుబాటలవైపే ప్రయాణిస్తూ వ్యవస్థను అస్థిరం చేస్తున్నాయని మరచిపోరాదు. అంత కన్నా ఎన్నటికీ మరవరాని అంశం – రాజ్యాంగంలో పొందుపరచు కున్న ప్రజాహిత సూత్రాలను అమలు చేయించుకోగల హక్కును దేశ పౌరులకు లేకుండా చేశారు. కారణం స్పష్టమే. భూస్వామ్య, ధనికవర్గ ప్రయోజనాల రక్షణకే పాలకుల ప్రాధాన్యం. నేడు రాజ్యాంగమూ, దాని ప్రయోజనాలనూ కేవలం కొద్దిమంది కార్పొరేట్ అధిపతులు, వారికి కొమ్ముకాస్తూన్న పాలక వర్గమే అనుభవిస్తోందని ప్రజలు భావిస్తున్నారు. తొల్లింటి అరకొర ప్రజానుకూల ప్రణాళికా వ్యవస్థ కూడా ఈ రోజున కూలిపోయింది. అందుకే కూలిపోయే వ్యవస్థను కాపాడ్డానికే దాని రక్షకులైన పాలక వర్గాలు ‘కంకణం’ కట్టుకుంటారు. మహాకవి శ్రీశ్రీ దశాబ్దాల క్రితమే రానున్న పరిణామాల్ని గురించి ముందస్తు హెచ్చరిక చేశారు: ‘‘విభజన రేఖను రక్షించడానికే న్యాయస్థానాలు, రక్షక భట వర్గాలు చెరసాలలు, ఉరి కొయ్యలు’’ అని చెబుతూనే – ‘‘అభిప్రాయాల కోసం బాధలు లక్ష్యపెట్టనివాళ్లు మాలోకి వస్తారు అభిప్రాయాలు మార్చుకొని సుఖాలు కామించేవాళ్లు మీలోకి పోతారు’’ అనీ ప్రకటించారు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
హరగోపాల్ పై ఉపా కేసు ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం
-
ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు
సాక్షి, హైదరాబాద్: విద్యావేత్త, చర్చా మేధావి.. ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. ములుగు జిల్లా తాడ్వాయి మండల పీఎస్‌లో ఈ మేరకు ఆయనపై అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు సహయసహకారాలు అందిస్తున్నారని, బీరెల్లి కుట్రలో ఆయన భాగం అయ్యారని, పైగా నిషేధిత మావోయిస్టుల పుస్తకాల్లో ఆయన పేరు ఉందనే అభియోగాలు నమోదు అయ్యాయి. చట్ట వ్యతిరేకత కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా(UAPA యూఏపీఏ)తోపాటు ఆర్మ్ యాక్ట్, ఇంకా పలురాకల 10 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. బీరెల్లి కుట్ర కేసుకు సంబంధించి కిందటి ఏడాది ఆగస్టు 19వ తేదీనే తాడ్వాయి పీఎస్‌లో హరగోపాల్‌తో పాటు మరో 152 మందిపై కేసు నమోదు అయ్యింది. ప్రజాప్రతినిధులను చంపడానికి కుట్ర పన్నారన్నది ప్రధాన ఆరోపణ కాగా.. నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుల పుస్తకాల్లో పేర్లు ఉన్నాయంటూ వాళ్లకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది కూడా. అయితే.. పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండునెలల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా.. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా అతడిపై మరిన్ని కేసులు ఉన్నట్లు బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు తెలిపారు పోలీసులు. అన్ని కేసుల వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ను ప్రస్తావించడంతో హరగోపాల్ పై దేశద్రోహం కేసు వెలుగులోకి వచ్చింది. స్పందించిన ప్రొఫెసర్ రాజద్రోహం, దేశద్రోహం లాంటి కేసులు పెట్టొద్దని సుప్రీం కోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. కాబట్టి, ప్రభుత్వం పెట్టిన ఈ కేసు నిలబడదు. మావోయిస్టులకు మా మద్దతు ఎందుకు? వాళ్లు మాలాంటి వాళ్ల మీద ఆధారపడరు.. అసలు వాళ్ల ఉద్యమం వేరు. 152 మందిపైనా ఏదో ఒక కేసు పెట్టడం విషాద పరిణామం. బాధ్యతరాహిత్యంగా కేసులు పెడుతున్నారు. నిజాయితీపరులపైనా.. ఆఖరికి చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల తరుణంలో ఇలాంటి కేసులు పెట్టడం దురదృష్టకరం. పేర్లు రాసుకోవడం కాదు.. సరైన ఆధారాలు ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చట్టాన్ని దురుపయోగం చేస్తున్నారు. ఇది ఈ వ్యవస్థలో ఉండాల్సింది కాదు. ఉపా చట్టాన్ని ఎత్తివేయాలి. ఇది ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధం. ఉపా చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ వాళ్లు. ఇప్పటికైనా తప్పైందని ఒప్పుకోవాలి. అందరిపై కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూనే.. ఉపా చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం జరగాలి. అందరం కలిసి మాట్లాడుకుని ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని అని ఆకాంక్షించారాయన. అలాగే.. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ అక్రమ కేసు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యా సంఘాల ఖండన ప్రొఫెసర్ హరగోపాల్, పద్మజాషా లాంటి మేధావులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి డిమాండ్ చేశారు. మరోవైపు విద్యా మేధావులను ఇరికించడం వెనుక లోతైన కుట్ర ఉందని, కేసు వివరాలను బహిర్గత పర్చాలని విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
దేశద్రోహానికి ఏడేళ్ల జైలు శిక్ష
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసుల్లో దోషులకు విధించే జైలుశిక్షను కనిష్టంగా మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ పెంచాలని భారత న్యాయ కమిషన్ సిఫార్సు చేసింది. దీనివల్ల నేర తీవ్రతను బట్టి శిక్ష విధించే అవకాశం న్యాయస్థానాలకు లభిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఈ నివేదికను న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ రితూరాజ్ అవస్థీ (రిటైర్డ్) ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్కు సమర్పించారు. దేశద్రోహానికి జైలు శిక్షను ఏడేళ్లకు పెంచాలంటూ న్యాయ కమిషన్ సిఫార్సు చేయడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తప్పుబట్టారు. దేశద్రోహ చట్టాన్ని మరింత క్రూరంగా మార్చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మెక్సికోలో కలకలం.. -
రాజద్రోహం చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటులో బిల్లు..!
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజద్రోహం చట్టంపై పునర్ సమీక్ష చేస్తామని కేంద్రం చెప్పింది. వచ్చే వర్షాకాల సమావేశాల్లో రాజ ద్రోహం చట్టం సవరణ బిల్లును పార్లమెంటు ముందుకు తెస్తామని సూచన ప్రాయంగా తెలిపింది. దీంతో రాజద్రోహం కింద నమోదైన కేసులను ఆగస్టు రెండో వారంలో విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కాగా.. బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ చట్టం చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ సహా మొత్తం 16 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపాలని గతేడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజద్రోహం చట్టం, దీని కింద నమోదైన కేసులపై స్టే విధిందించి. అయితే ఈ చట్టాన్ని పునర్ పరిశీలించేందుకు మరింత గడువు కావాలని కేంద్రం గతేడాది అక్టోబర్ 31న కోరింది. ఇప్పుడు మళ్లీ మరింత సమయం కావాలని అడిగింది. దీంతో తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. చదవండి: ఆర్నెళ్లు ఆగక్కర్లేదు.. విడాకులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు -
100 మంది రైతులపై దేశ ద్రోహం కేసు
న్యూఢిల్లీ: దేశద్రోహం చట్టంపై భారతదేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బ్రిటీష్ పాలన కాలం నాటి ఈ చట్టం స్వతంత్ర భారతదేశంలో అవసరమా అని సుప్రీంకోర్టు గురువారం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఓ వైపు దేశద్రోహం చట్టంపై నేడు సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయగా.. నాలుగు రోజుల క్రితం దాదాపు 100 మందిపై దేశద్రోహం కేసు నమోదయ్యింది. రైతులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ సంఘటన హరియాణాలో చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడి వాహనంపై దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు అన్నదాతల మీద దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆ వివరాలు.. కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దీర్ఘకాలంగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూలై 11న హరియాణా రైతులు సిర్సాలో అధికార బీజేపీ-జేజేపీ కూటమి నేతలకు, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకి దిగారు. ఈ క్రమంలో ఆ మార్గంలో వచ్చిన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, బీజేపీ నాయకుడు రణ్‌బీర్ గంగ్వా వాహనాన్ని అడ్డుకున్నారు. దాంతో పోలీసులు రణబీర్ గంగ్వా అధికార వాహనాన్ని రైతులు అడ్డుకుని దాడికి ప్రయత్నించారని.. కారుని డ్యామేజ్ చేశారని ఆరోపిస్తూ అదే రోజున రైతు నేతలు హరిచరణ్ సింగ్, ప్రహ్లాద్ సింగ్‌తో పాటు 100 మంది అన్నదాతలపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. హర్యానా రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వ సూచనల మేరకు.. రైతులు, రైతు నాయకులపై పోలీసులు చేసిన తప్పుడు, దేశద్రోహ ఆరోపణలను సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. రైతులపై నమోదయిన కేసును కోర్టులో సవాల్ చేయడానికి రైతులు, రైతు నాయకులందరికీ సంయుక్త కిసాన్ మోర్చా సహాయం చేస్తుందని పేర్కొంది. -
సెక్షన్ 124ఏ అవసరమా..?
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహం చట్టాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తుండటాన్ని, చాలా సందర్భాల్లో దీనిని దుర్వినియోగపర్చడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మహాత్మాగాంధీ, గోఖలే వంటి స్వాతంత్య్ర సమరయోధుల గొంతు నొక్కేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశద్రోహం చట్టాన్ని ఉపయోగించిందని గుర్తు చేసింది. దీనికి సంబంధించిన ఐపీసీలోని 124ఏ సెక్షన్‌ను ఇంకా ఎందుకు రద్దు చేయలేదని, ఈ సెక్షన్ ప్రస్తుత కాలంలో అవసరమా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ సెక్షన్ రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ చేస్తామని స్పష్టం చేసింది. సెక్షన్ 124ఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, విశ్రాంత సైనికాధికారి మేజర్ జనరల్ ఎన్జీ వోంబట్కెరే దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్‌రాయ్‌ల ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. విచారణ సమయంలో ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ఈ దేశద్రోహం చట్టం బ్రిటిష్ వారి నుంచి వలస తెచ్చుకున్న చట్టంగా అభివర్ణించింది. ప్రభుత్వాలపై విద్వేషం పెరిగేలా చేసే ప్రసంగాలు లేదా భావ ప్రకటనలను బెయిల్‌కు వీల్లేని నేరంగా పరిగణిస్తూ, ఈ సెక్షన్ కింద జీవితకాల జైలుశిక్ష విధించే అవకాశముంది. ‘ఈ చట్టం వలసరాజ్యం నాటి చట్టం. స్వేచ్ఛను అణచివేయడానికి, గాంధీ, తిలక్ వంటి వారి గొంతు నొక్కేందుకు ఈ చట్టాన్ని బ్రిటిష్‌వారు ప్రయోగించే వారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఈ చట్టం అవసరమా?’ అని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ తరహా కేసులు సుప్రీంకోర్టులో వేర్వేరు ధర్మాసనాల వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కేకే వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎడిటర్స్ గిల్డ్ తరఫు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ.. 124ఏ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో పిటిషన్లో వివరించామన్నారు. ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేసిన కేసులే ఎక్కువని, కొయ్య మలచడానికి వడ్రంగికి రంపం ఇస్తే మొత్తం అడవినే నరికినట్లుగా ఉందంటూ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ రద్దు చేసినప్పటికీ ఇప్పటికీ కేసులు నమోదు చేస్తున్న అంశాన్ని సీజేఐ ఉదహరించారు. చట్టం దుర్వినియోగం అవడంతో పాటు కార్యనిర్వాహక వ్యవస్థకు జవాబుదారీతనం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఈ తరహా ఇతర కేసులు కూడా పరిశీలిస్తామన్న సీజేఐ.. అన్ని కేసులను ఒకే చోట విచారిస్తామన్నారు. కాలం చెల్లిన చట్టాలను చాలా వరకూ రద్దు చేస్తున్న కేంద్రం ఈ విషయాన్ని ఎందుకు పరిశీలించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సెక్షన్‌ను కొట్టివేయాల్సిన అవసరం లేదని, చట్టపరమైన ప్రయోజనాల నిమిత్తం మార్గదర్శకాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. పిటిషనర్ ఆర్మీ మేజర్ జనరల్‌గా పనిచేశారని, ఆయన దేశం కోసం త్యాగం చేశారని, ఈ పిటిషన్‌ను ప్రేరేపిత పిటిషన్‌గా భావించలేమని ధర్మాసనం పేర్కొంది. ‘సెక్షన్ 124ఏ ను పేకాట ఆడేవారిపైనా ప్రయోగిస్తున్నారు. ప్రత్యర్థుల అణచివేతకు రాజకీయ నేతలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రత్యర్థులపై సెక్షన్ 124ఏ ప్రయోగించేలా ఫ్యాక్షనిస్టులు ప్రవర్తిస్తున్నారు. బెయిల్ రానివ్వకుండా ఈ సెక్షన్‌తో బెదిరిస్తున్నారు’ అని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. సెక్షన్ 124ఏ రద్దుపై వైఖరి తెలపాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. విపక్ష నేతల హర్షం దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను పలువురు విపక్ష నేతలు, పౌర సమాజ కార్యకర్తలు స్వాగతించారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఒకవైపు, ఈ చట్టం దుర్వినియోగమవుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు బుధవారం హరియాణాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న 100 మంది రైతులపై దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. -
అయేషా సుల్తానాను ప్రశ్నించి వదిలేసిన లక్షద్వీప్ పోలీసులు
కోచి: దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొం టున్న సినీ దర్శకురాలు అయేషా సుల్తానాను లక్షద్వీప్ పోలీసులు ప్రశ్నించి వదిలేశారు. బీజేపీ నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కవరట్టి పోలీసులు ఆది, బుధ, గురు వారాల్లో ఆమెను ప్రశ్నించారు. గురువారం దాదాపు మూడు గంటలపాటు జరిగిన విచారణ అనంతరం అయేషా సుల్తానా మీడియాతో మాట్లాడుతూ..‘ఈ విషయం ముగిసింది. కోచి తిరిగి వెళ్తానని పోలీసులకు చెప్పాను. రేపు లేదా ఎల్లుండి కోచికి చేరుకుంటాను’అని అన్నారు. బుధవారం దాదాపు 8 గంటలపాటు జరిగిన విచారణలో తనకు విదేశాలతో ఏవైనా సంబంధాలున్నాయా అంటూ పోలీసులు ప్రశ్నించారని అంతకుముందు అయేషా చెప్పారు. తన వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ అకౌంట్లను పోలీసులు పరిశీలించారన్నారు. ఆదివారం పోలీసులు అయేషాను మూడు గంటలపాటు విచారించారు. ‘మలయాళం వార్తా చానెల్ జూన్ 7వ తేదీన నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం జీవాయుధాలను ప్రయోగించిందని ఆరోపించారంటూ బీజేపీ నేత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చదవండి: కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురు! -
దేశద్రోహం కేసులో ఆయేషాకు బెయిల్
కొచ్చి: లక్షద్వీప్ పోలీసులు నమోదు చేసిన దేశద్రోహం కేసులో సినీనటి, దర్శకురాలు ఆయేషా సుల్తానాకు ఊరట లభించింది. ఈ కేసులో ఒకవేళ అమెను అరెస్టు చేస్తే వారంరోజులపాటు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని లక్షద్వీప్‌లోని కవరత్తి పోలీసులను కేరళ హైకోర్టు ఆదేశించింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయేషా సుల్తానా దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం జూన్ 20న తమ ఎదుట హాజరు కావాలంటూ లక్షద్వీప్‌లోని కవరత్తి పోలీసులు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయేషా సుల్తానాకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ మీనన్ సూచించారు. రూ.50 వేల పూచీకత్తు, ఇద్దరి హామీతో ఆయేషా సుల్తానాకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చని తెలిపారు. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం జీవాయుధాలను ప్రయోగిస్తోందని జూన్ 7న ఆరోపించిన ఆయేషా సుల్తానాపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ అరెస్టు -
దేశద్రోహం కేసు, అయినా భయపడేది లేదు :నటి
తిరువనంతపురం: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌ను జీవాయుధంతో పోల్చినందుకు గాను నటి, మోడల్, దర్శకురాలు ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు నమోదైంది. ప్రశాంతంగా ఉండే దీవిలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, కరోనా కేసుల్ని అరికట్టడంలో విఫలమైనందుకు ప్రఫుల్‌ని కేంద్రం ప్రయోగించిన బయోవెపన్‌గా ఆమె అభివర్ణించారు. మలయాళం న్యూస్ చానల్ మీడియా వన్ టీవీ చర్చలో పాల్గొన్న ఆయేషా సుల్తానా లక్షద్వీప్‌పై కేంద్రం జీవాయుధాన్ని ప్రయోగించిందంటూ ఆరోపించారు. ‘‘లక్షద్వీప్‌లో గతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పుడు రోజుకి 100 కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం లక్షద్వీప్‌కి జీవాయుధాన్ని పంపింది. అందుకే కేసుల సంఖ్య పెరిగిపోతోంది’’అని సుల్తానా టీవీ చర్చలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లక్షద్వీప్ బీజేపీ చీఫ్ సి.అబ్దుల్ ఖదేర్ హాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవరట్టి పోలీసులు ఆమెపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 124 (ఏ) రాజద్రోహం, 153 బి (రెచ్చగొట్టే ప్రసంగాలు) కింద కేసు పెట్టారు. ఇప్పటికే ప్రఫుల్ తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. వెనక్కి తగ్గేది లేదు: ఆయేషా టీవీ చర్చల్లో తాను చేసిన వ్యాఖ్యల్ని ఆయేషా సుల్తానా సమర్థించుకున్నారు. రాజద్రోహం కేసు నమోదైనా భయపడేది లేదన్నారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్న ఆమె తన జన్మ భూమి కోసం ఎంత పోరాటమైనా చేస్తానని చెప్పారు. తన గళం ఇంకా పెంచుతానంటూ ఫేస్బుక్లో ఒక పోస్టు ఉంచారు. -
Aisha Sultana: అయిషాపై దేశద్రోహం కేసు.. అదిరిపోయే ట్విస్ట్
లక్షద్వీప్ ఫిల్మ్ మేకర్ అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. బీజేపీ అధ్యక్షుడి తీరును ఎండగడుతూ.. ఆమెకు మద్ధతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. న్యూఢిల్లీ: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందన్న ఆరోపణలపై కేరళ ఫిల్మ్ మేకర్. నటి అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదైంది. లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీ ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమెకు మద్దతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామా చేశారు. అయిషాకు మద్దతుగా లక్షద్వీప్ బీజేపీ ప్రధాన కార్యదర్శితో పాటు కీలక నేతలు, కార్యకర్తలు మొత్తం 15 మంది రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖల్ని అబ్దుల్ ఖాదర్ హాజీకి పంపించారు. ‘‘లక్షద్వీప్‌లో ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ చేపడుతున్న చర్యలు బీజేపీకి కూడా తెలుసు. ఆయన విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రఫుల్ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేసిన వాళ్లలో మీరూ(హాజీ) కూడా ఉన్నారు. ప్రఫుల్, జిల్లా కలెక్టర్ తప్పులను ఎండగట్టిన బీజేపీ నేతలు చాలామందే ఉన్నారు. ఇదే తరహాలో చెట్లాట్ నివాసి అయిన అయిషా.. తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకుంద’ని ఆ నేతలంతా అయిషాకు మద్దతుగా లేఖలో వ్యాఖ్యలు చేశారు. ఆమెపై(అయిషా) ఫిర్యాదు చేయడం తప్పు. ఒక సోదరి భవిష్యత్తును, ఆమె కుటుంబాన్ని నాశనం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు.ఈ తీరును మేం తట్టుకోలేకపోతున్నాం. అందుకే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం అని బీజేపీ కార్యదర్శి అబ్దుల్ హమీద్ తదితరులు ఆ లేఖలపై సంతకాలు చేశారు. కాగా, ఓ మలయాళ టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయిషా.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19ను ఒక జీవాయుధంగా ప్రయోగించిందని, ఇందుకోసం అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌ను వాడిందని పేర్కొంది. ప్రఫుల్ పటేల్ రాకముందు లక్షద్వీప్‌లో కరోనా కేసులు లేవని, ఆయన నిర్లక్క్ష్యం వల్లే కేసులు పుట్టుకొచ్చాయని ఆమె ఆ డిబెట్లో మాట్లాడింది. అయితే ఇవి కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలంటూ లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అయిషాపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. చదవండి: నీటి అడుగున నిరసన చదవండి: హీరో పృథ్వీకి భారీ మద్ధతు -
డిబేట్లో సంచలన వ్యాఖ్యలు, నటిపై దేశద్రోహం కేసు
సినీనటి, దర్శకురాలు ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు నమోదైంది. కరోనా వైరస్ గురించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమె మీద ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మలయాళ టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయేషా.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19ను ఒక జీవాయుధంగా ప్రయోగించిందని సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకోసం అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ ఖోడా పటేల్‌ను బయోవెపన్‌గా వాడిందని పేర్కొంది. ఆమె మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ఇది కేంద్ర ప్రతిష్టను దిగజార్చడమేనని అభిప్రాయపడ్డాడు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆయేషాపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. చదవండి: ప్రభాస్ సినిమాలో మెరవనున్న రాశీఖన్నా! -
గుజరాతీ ఎడిటర్‌పై దేశద్రోహం కేసు
అహ్మదాబాద్ : గుజరాత్‌లోని ఓ న్యూస్ పోర్టల్ ఎడిటర్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. బీజేపీ అధిష్టానం గుజరాత్లో నాయకత్వ మార్పు చేసే అవకాశం ఉందనే వార్తకు సంబంధించి పోలీసులు ఈ కేసు నమోదుచేశారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన ఫేస్ ఆఫ్ నేషన్ అనే న్యూస్ పోర్టల్‌కు ధావల్ పటేల్ అనే వ్యక్తి ఎడిటర్‌గా ఉన్నారు. మే 7వ తేదీన ఆ న్యూస్ పోర్టల్‌లో ప్రచురితమైన ఓ ఆర్టికల్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని తొలగించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాను నియమించే ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం ఉందని పేర్కొన్నారు. కరోనాను అదుపు చేయడంలో విజయ్ రూపానీ విఫలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిపారు. అయితే ఈ వార్తలను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ఖండించారు. (చదవండి : సుప్రీంకోర్టు సెలవుల రద్దు!) ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 124(ఏ) కింద ధావల్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ మేరకు సోమవారం ధావల్‌ను అహ్మదాబాద్‌లోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ‘ధావల్ తన వెబ్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో, సమాజంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేశారు. ఆ తర్వాత ధావల్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు’ అని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ బీవీ గోహిల్ తెలిపారు. అయితే ధావల్‌పై పోలీసు చర్యను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. దేశంలోని పలుచోట్ల జర్నలిస్టులను ఇబ్బంది పెట్టేలా క్రిమినల్ చట్టాలను దుర్వినియోగపరచడం పెరుగుతోందని ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది. (చదవండి : మొదటి రైలు: నిబంధనల ఉల్లంఘన) -
షార్జీల్ ఇమామ్‌పై కేసు.. చార్జిషీట్ దాఖలు
న్యూఢిల్లీ: రెచ్చగొట్టే ప్రసంగాలతో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో అల్లర్లకు కారణమయ్యారనే ఆరోపణలతో జేఎన్‌యూ పూర్వ విద్యార్థి షార్జీల్ ఇమామ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. డిసెంబరు 15న తన విద్వేషపూరిత వ్యాఖ్యలతో విద్యార్థులను రెచ్చగొట్టినందున ఆయనపై చార్జిషీట్ వేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబరులో పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు గళమెత్తడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. యూనివర్సిటీకి సమీపంలో ఉన్న న్యూ ఫ్రెండ్స్ కాలనీ, జామియా నగర్ ప్రాంతాల్లో అలజడి సృష్టించిన అల్లరి మూకలు అనంతరం యూనివర్సిటీలో ప్రవేశించారని పోలీసులు పేర్కొన్నారు. (‘వీడియోతో.. వాళ్లకు వాళ్లుగా దొరికిపోయారు!’) ‘‘రాళ్లు రువ్వుతూ.. ఆయుధాలు చేపట్టి కొంత మంది అల్లర్లకు తెరతీశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను భారీగా ధ్వంసం చేశారు. ఎంతో మంది పోలీసులు, సామాన్య పౌరులకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో డిసెంబరు 13, 2019లో విద్వేషపూరిత ప్రసంగాలు ఇచ్చి అల్లర్లకు కారణమైన షార్జీల్‌ను అరెస్టు చేశాం. మా దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాల ఆధారంగా 124 ఏ ఐపీసీ, 153 ఏ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఈ మేరకు సాకేత్ జిల్లా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశాం’’ అని వెల్లడించారు. కాగా సీఏఏను వ్యతిరేకిస్తూ షాహిన్‌బాగ్‌లో చేపట్టిన నిరసనలో పాల్గొన్న షార్జీల్... అలీగడ్ ముస్లిం యూనివర్సిటీలో ఇచ్చిన ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక గతంలోనూ అస్సాం, ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి వేరుచేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు గానూ మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. -
‘పాకిస్తాన్ పాట పాడితే కాల్చి పారెయ్యండి’
బెంగుళూరు : పౌరసత్వ నిరసనకారులపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అప్పచ్చు రంజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఏఏ నిరసనల పేరుతో పాకిస్తాన్ జిందాబాద్ అంటున్న వారిని కాల్చి చంపేందుకు చట్టం తేవాలని పేర్కొన్నారు. లేదంటే అలాంటి వారిని పాకిస్తాన్‌కు పంపించాలని అన్నారు. ‘భారత్‌లో ఉంటూ.. ఇక్కడి తిండి తింటూ.. పాకిస్తాన్ పాట పాడేవాళ్లను కాల్చి చంపాలి. లేదంటే వారిని పాకిస్తాన్‌కు తరిమేయాలి. అలాంటి వారిపట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. వారిపై నమోదైన కేసుల విషయంలో కూడా ఉదారత అవసం లేదు’అని కొడగులో సోమవారం ఆయన పేర్కొన్నారు. (చదవండి : అమూల్యకు 14 రోజుల కస్టడీ) కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్ కూడా ఆదివారం ఇదేరకమైన కామెంట్లు చేశారు. పౌర నిరసనకారులు, పాకిస్తాన్ జిందాబాద్ కామెంట్లు చేసేవారిని కనిపిస్తే కాల్చండి (షూట్ ఎట్ సైట్) ఆర్డర్స్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తేవాలని పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తానని అన్నారు. కాగా, ‘సేవ్ కాన్సిస్టిట్యూషన్’ పేరుతో గురువారం బెంగుళూరులో జరిగిన సీఏఏ నిరసన సభలో అమూల్య లియోన్ అనే యువతి ‘పాకిస్తాన్ జిందాబాద్’ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మరికొందరు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమూల్యపై దేశద్రోహం కేసు నమోదైంది. ఆమెను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. (చదవండి : నిరసనలో నిరసన.. అదుపులోకి మరో యువతి!) -
‘పాక్ జిందాబాద్’ నినాదాలు.. 14 రోజుల కస్టడీ
-
‘పాక్ జిందాబాద్’.. తగిన శిక్ష పడుతుంది!
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిరసన కార్యక్రమంలో.. ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అంటూ నినాదాలు చేసిన అమూల్య అనే యువతిపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ క్రమంలో 14 రోజుల పాటు ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. కాగా సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం బెంగళూరు ఫ్రీడంపార్క్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు ఈ ర్యాలీకి హాజరయ్యారు. ఈ క్రమంలో అమూల్య లియోన్ అనే యువతి వేదికపై పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది. దీంతో కంగుతిన్న నిర్వాహకులు ఆమె నుంచి మైక్ లాక్కుందామని ప్రయత్నించినా.. అమూల్య నినాదాలు కొనసాగించింది. ఈ నేపథ్యంలో అమూల్య తీరుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఈ విషయం గురించి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మాట్లాడుతూ.. అమూల్యకు బెయిలు ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఆమె తండ్రి సైతం తనను రక్షించేందుకు సిద్ధంగా లేనని చెప్పారన్నారు. ఆయన మాటల ద్వారా అమూల్యకు నక్సల్స్‌తో సంబంధం ఉందన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. తనకు తప్పకుండా తగిన శిక్ష పడుతుందని తెలిపారు. ఇక అమూల్య వ్యాఖ్యలకు నిరసనగా.. శ్రీరామ్ సేన, హిందూ జాగృతి సమితిసభ్యులు ఆందోళన చేపట్టారు. అమూల్య క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.(సీఏఏ నిరసనల్లో ‘పాక్ జిందాబాద్’ నినాదాలు) ఇదిలా ఉండగా.. అమూల్య ఇంటిపై కొంతమంది వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా అమూల్య వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఇక అమూల్యను చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూకా శివపుర గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు. అలాగే అమూల్యను ఆ కార్యక్రమానికి ఎవరు ఆహ్వానించారు.. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాల వెనుక కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. -
మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీదర్ మహిళలపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని నిరసిస్తూ శనివారం ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఆందోళన చేసేందుకు ర్యాలీగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రేస్‌కోర్స్ రోడ్ సమీపంలో సిద్ధరామయ్యతో పాటు దినేశ్ గుండురావు, రిజ్వాన్ అర్షద్, కె. సురేశ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ వ్యవస్థను యడియూరప్ప సర్కారు దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా విమర్శించారు. కర్ణాటకను పోలీస్ రాష్ట్రంగా మార్చిందని దుయ్యబట్టారు. బీదర్‌లోని షహీన్ పాఠశాలలో వేసిన నాటకంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయన్న కారణంతో తొమ్మిది నుంచి పన్నేండేళ్ల పిల్లలను ఐదు రోజులపాటు పోలీసులు ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రధానోపాధ్యాయురాలు, ఓ విద్యార్థి తల్లిపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేశారు. కర్ణాటక పోలీసుల చర్యను ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు తీవ్రంగా ఖండించారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలను అదుపు చేస్తున్న పోలీసులు యెడ్డీని క్షమించరు ఇద్దరు మహిళలను దేశద్రోహం కేసు కింద బలవంతంగా అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సిద్ధరామయ్య అంతకుముందు పేర్కొన్నారు. కుమార్తె నుంచి తల్లిని వేరు చేసినందుకు రాష్ట్ర మహిళలు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను క్షమించరని వ్యాఖ్యానించారు. సీఎం యడియూరప్ప విచక్షణ కోల్పోయినట్టుగా కన్పిస్తున్నారని సిద్ధరామయ్య తన ట్విటర్లో విమర్శించారు. వందేళ్ల క్రితం చేసిన అరాచక ఐపీసీ చట్టాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరముందని ట్వీట్ చేశారు. (చదవండి: ఈ స్క్రిప్ట్ రాసిందెవరు..?) -
రాజ ద్రోహమా? రాజ్యాంగ ద్రోహమా?
మాకు జీతాలు పెంచండి అని అడిగారు ఇద్దరు కర్ణాటక పోలీసులు. కర్నాటక రాష్ట్రంలో అఖిల కర్ణాటక పోలీసు మహాసంఘ నాయకుడు శశిధర్ గోపాల్ పైన, కోలార్ కానిస్టేబుల్ బసవరాజ్ పైన 124ఎ కింద జూన్ 4, 2016న రాజద్రోహం కేసులను నమోదు చేశారు. ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేసింది. ఇటువంటి పాలకులుంటే భారత్ ముక్కలవుతుంది అని నినాదాలు చేసినందుకు కన్హయ్యా కుమార్ మీద రాజద్రోహం కేసు పెట్టారు. క్రికెట్ మ్యాచ్ నడుస్తూ ఉంటే పాకి స్తాన్ జట్టుకు మద్దతుగా మాట్లాడినందుకు రాజద్రోహం కేసును వాడారు. పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడిని పెళ్లాడిన భారతీయ మహిళపై రాజద్రోహం కేసు పెట్టనందుకు సంతోషించాలి. 2020 ఫిబ్రవరి 6న ఉత్తరప్రదేశ్‌లోని అజం ఘర్‌లో పౌరసత్వ చట్టం సవరణ సీఏఏను విమర్శించినందుకు 135 మంది మీద రాజద్రోహం కేసులుపెట్టారు. 20 మందిని అరెస్టు చేశారు. ఫిర్యా దులో పేర్కొన్న 35 మంది మీద, ఎవరో తెలియని 100 మంది మీద ఈ క్రిమినల్ కేసులుపెట్టడం విచిత్రం. రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు అనుసరించడం, భారత రాజ్యాంగ విలువలను తిలోదకాలిచ్చే చట్టాలు చేయడం, భారత ప్రజాస్వామ్య మౌలిక లక్షణాలను భంగపరిచే చట్టాలు తేవడాన్ని విమ ర్శిస్తే రాజ్య ద్రోహమంటున్నారు. రాజ్యాంగానికి ద్రోహం చేయడం రాజ ద్రోహం అవుతుంది కాని పాలకులను విమర్శిస్తే రాజ ద్రోహమా? వేలాది మందిపై కుప్పలుతెప్పలుగా కేసులు పెట్టేస్తున్నారు. ఈ చట్టంలో లోపాలను, అన్యాయాలను ఎండగట్టే వారిని జాతి వ్యతిరేకులంటున్నారు. దేశ ద్రోహులంటున్నారు. ఆర్టికల్ 19(1)(ఎ)లో చెప్పిన వాక్ స్వాతంత్య్రం కీలకమైనది. అది దేశద్రోహమా? రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను నిరసించకపోవడమే దేశద్రోహం. అసలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేసేవారే రాజ్యాంగ ద్రోహులు. అదీ రాజకీయం కోసం, ఓట్ల కోసం చేసేవారు స్వచ్ఛమైన రాజకీయాలకు కూడా ద్రోహం చేసినట్టే. జార్ఖండ్‌లో పదివేలమంది మీద ఒకసారి, మరో సారి 3వేల మందిపై రాజ ద్రోహం కేసులు పెట్టారు. ప్రభుత్వం మారడం మంచిదైంది. లేకపోతే వేలమంది ప్రజలు దేశ ద్రోహనేర నిందితులుగా కోర్టుల చుట్టూతిరుగుతూ అన్యాయమైపోయేవారు. బీదర్ పాఠశాలలో సీఏఏకు వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించారు. ఏబీవీపీ కార్యకర్త పోలీసు స్టేషన్లో రాజ ద్రోహం కేసు పెట్టారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలుపె ట్టారు. హెడ్ మిసెస్‌ను అరెస్టు చేశారు. చిన్న పిల్ల లను గంటలకొద్దీ విచారించారు. తొమ్మిదేళ్ల అమ్మాయి తల్లిని అరెస్టు చేశారు. ఆ కూతురు పక్కింటి వారి దగ్గర తలదాచుకుంటున్నది. కోర్టు బెయిల్ ఇవ్వలేదు. పదిహేనురోజుల పైబడి వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పౌరసత్వం వివరాలు అడిగితే చెప్పు చూపండి, అని ఆ నాటకంలో ఒక డైలాగ్ ఉందట. ప్రధాని చిత్రాన్ని చెప్పుతో కొట్టారనీ ఆరోపించారు. ఒకవేళ ఆవిధంగా జరిగితే ఖండించవలసిందే. కానీ మూడేళ్ల జైలు నుంచి యావజ్జీవ కారాగార శిక్ష విధించేంత ఘోరమైన రాజ ద్రోహ నేరమా? బాలలను అయిదారుగంటలపాటు పోలీసులు తమ ఖాకీ యూనిఫాంలో విచా రించడం, బాలల విషయంలో బాలల సంక్షేమ కమిటీని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం తీవ్ర మైన ఉల్లంఘనలని కర్ణాటక బాలల హక్కుల కమిషన్ విమర్శించింది. రెండు వందల ఏళ్ల కిందట దిష్టి బొమ్మను తగులబెట్టడం పెద్ద పరువునష్టంగా భావించి క్రిమినల్ కేసు పెట్టేవారు. ముర్దాబాద్ డౌన్ డౌన్ నినాదాలు చేస్తే క్రిమినల్ డిఫమేషన్ కేసులు పెట్టి జైలుకు పంపేవారు. ఆ కాలం మారింది. తీవ్రమైన అబద్ధపు విమర్శలు చేసినప్పుడే క్రిమినల్ కేసులు పెట్టాలని తరువాత తీర్పులు వివరిస్తున్నాయి. చీటికీమాటికీ వ్యతిరేకుల మీద, ఉద్యమకా రుల మీద రాజ ద్రోహం కేసులు పెట్టడం అన్యాయ మనీ, ఈ దుర్వినియోగాన్ని నిరోధించాలని ఎన్జీవో కామన్ కాజ్ పిల్ దాఖలు చేసింది. దీనిపై తీర్పు చెబుతూ ‘భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతిపదం ఇప్పటికీ చెల్లుతుంది, ఏదీ మారలేదు, మారకూడద’ని ఆనాటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పేర్కొన్నారు. విమర్శకులమీద రాజకీయ వ్యతిరేకుల మీద ప్రభుత్వాలు రాజ ద్రోహం కేసు పెట్టకూడదని దీపక్ మిశ్రా 2016లో తీర్పుచెప్పారు. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
పౌర నిరసనలు: ‘ఈ స్క్రిప్ట్ రాసిందెవరు..?’
బెంగుళూరు : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనకారుల అరెస్టులు మనం చూస్తూనే ఉన్నాం..! అయితే, కర్ణాటకలోని బీదర్‌లో వెలుగుచూసిన ఓ ఘటన మాత్రం పోలీసుల అత్యుత్సాహానికి నిదర్శనంగా నిలిచింది. విద్యార్థులతో నాటక ప్రదర్శన పేరుతో పౌర చట్టంపై అనుచిత వ్యాఖ్యలు చేయించారని పేర్కొంటూ ఇద్దరు మహిళలపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. అరెస్టైన వారిలో ఒకరు సదరు విద్యార్థి తల్లి కాగా, మరొకరు పాఠశాల ప్రిన్సిపల్. "వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం" అనే ఆరోపణల నేపథ్యంలో షాహీన్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. బూటుతో కొట్టు..! బీదర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో జవనరి 21న విద్యార్థుల నాటక ప్రదర్శన పోటీలు జరిగాయి. అయితే, నాటక ప్రదర్శనలో 9వ తరగతి విద్యార్థి ఒకరు.. సీఏఏపై అనుచితంగా ఓ వ్యాఖ్య చేశాడు. ‘జూతే మారేంగే’ (బూటుతో కొడతా) అన్నాడు. ఈ వీడియో బయటపడటంతో సామాజిక కార్యకర్త నీలేష్ రక్షాల్ జనవరి 26న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. స్కూల్ యాజమాన్యంపై, ప్రిన్సిపల్, విద్యార్థి తల్లిపై కేసులు నమోదు చేశారు. ప్రతి రోజు 4 గంటల విచారణ..! డీఎస్పీ రోజూ మధ్యాహ్న 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులను ప్రశ్నలతో వేధిస్తున్నారని స్కూల్ సీఈవో తౌసిఫ్ మేదికేరి వాపోయారు. విద్యార్థి పొరపాటు మాటలపై దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారో అర్థకావడం లేదని అన్నారు. ఈ మాటలు చెప్పుమన్నదెవరు..? ఈ స్క్రిప్ట్ రాసిందెవరు..? అని పదేపదే ప్రశ్నించి పోలీసులు పిల్లల్ని హింస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే విద్యార్థి వ్యాఖ్యలపై క్షమాపణలు కోరామని చెప్పారు. ఇక బీదర్ పోలీసుల చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో.. భావ ప్రకటనా స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారని నెటిజన్లు, పేరెంట్స్ గ్రూపులు మండిపడుతున్నాయి.‘బీదర్ పోలీసులు చట్టవిరుద్ధ, అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు’అని పేరెంట్స్ ఫర్ పీస్, జస్టిస్ అండ్ ప్లులారిటీ గ్రూప్ విమర్శించింది. ప్రిన్సిపల్, విద్యార్థి తల్లిని విడుదల చేయాలని, వారిపై కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
పాఠశాలపై దేశద్రోహం కేసు
సాక్షి, బీదర్: కర్నాటకలోని బీదర్‌లో ఒక విచిత్రమైన కేసు నమోదైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఒక పాఠశాలపై దేశద్రోహం కేసునమోదైంది. భారతీయ శిక్షాస్మృతిలోని 124 (ఎ), 153 (ఎ) సెక్షన్ల క్రింద "వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం" అనే ఆరోపణల నేపథ్యంలో కోసం షాహీన్ పాఠశాల యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. జనవరి 26 న సామాజిక కార్యకర్త నీలేష్ రక్షాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. జనవరి 21న పాఠశాల అధికారులు విద్యార్థులను నాటకం ప్రదర్శించడానికి 'ఉపయోగించారని' ఫిర్యాదుదారుడు ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), పౌరుల జాతీయ రిజిస్టర్ (ఎన్ఆర్సీ)ని తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్రీ మోదీని స్కూలు యాజమాన్యం అవమానించిందనేది ప్రధాన ఆరోపణ. విద్యార్థులను అడ్డం పెట్టుకుని, వారు ప్రదర్శించిన నాటకం ద్వారా ప్రధాని మోదీని దుర్భాషలాడారని నీలేష్ ఆరోపించారు. అయితే ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. దీంతో నరేంద్రమోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలనే విద్యార్థులను నాటకం ప్రదర్శించడానికి అనుమతించారనే ఆరోపణలతో దేశద్రోహ కేసు నమోదైంది. బీదర్ నగరంలోని షాహీన్ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా, పాఠశాల విద్యార్థులు సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా చిన్న నాటకాన్ని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎవరైనా మీ వద్దకు వచ్చి పత్రాల గురించి అడిగితే చెప్పులతో కొట్టండన్న డైలాగులు వివాదాన్ని సృష్టించాయి Recently on d anniversary of Shaheen's school in Bidar city, children played a short skid against CAA & NRC. & made a controversy by saying our beloved PM as a cheap teaseller, further in d play children said if the PM comes to u & ask about documents then beat him with chappals pic.twitter.com/LH9qjBpMoM — Enchanted_Virgo 🇮🇳 🚩 (@Snowflake_3925) January 27, 2020 -
సెలబ్రిటీలపై దేశద్రోహం కేసు; ట్విస్ట్
ముజఫర్‌పూర్: దేశంలో పెరుగుతున్న మూక దాడులను నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన 50 మంది ప్రముఖులపై నమోదైన దేశద్రోహం కేసు ఉపసంహరణకు ఆదేశాలు జారీ అయ్యాయి. వారిపై బిహార్‌లోని సర్దార్ పోలీస్ స్టేషన్లో నమోదైన దేశద్రోహం కేసును మూసివేయాలని ముజఫర్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్‌కుమార్ సిన్హా బుధవారం ఆదేశాలిచ్చారు. నిరాధార ఆరోపణలు చేసిన ఈ ఫిర్యాదుదారుపై విచారణ సాగుతుందని ఓ పోలీసు అధికారి తెలిపారు. వేర్పాటు ధోరణులను బలపరిచేలా బహిరంగ లేఖ రాశారంటూ ముజఫర్‌పూర్‌కు చెందిన సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది 50 మంది ప్రముఖులపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో మూక దాడులు పెరుగుతుండటాన్ని నిరసిస్తూ మణిరత్నం, అపర్ణాసేన్, కొంకణాసేన్, ఆదూర్ గోపాలకృష్ణన్, రామచంద్ర గుహ, రేవతి, అనురాగ్ కశ్యప్, శ్యామ్‌బెనగల్ వంటి 50 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మోదీకి జూలైలో లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా, మోదీకి బహిరంగ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు పెట్టడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కేసును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ సహా పలు పార్టీలు డిమాండ్ చేశాయి. దీంతో బిహార్ పోలీసులు వెనక్కుతగ్గారు. అయితే, ఈ కేసుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. (చదవండి: ప్రముఖులపై రాజద్రోహం కేసు) -
రేపే నామినేషన్; ఏడాది జైలు, జరిమానా!
చెన్నై : రాజద్రోహం కేసులో మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం(ఎండీఎంకే) చీఫ్ వైగోనకు చెన్నై కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అదే విధంగా 10 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ప్రత్యేక న్యాయస్థానం జడ్జి జె. శాంతి ఈ మేరకు తీర్పు వెలువరించారు. కాగా శనివారం రాజ్యసభ సభ్యత్వానికై నామినేషన్ వేసేందుకు వైగో సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు తీర్పు ఆయనను ఇరకాటంలో పడేసింది. అయితే ప్రజాప్రతినిధి చట్టం- 1951లో రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే సెక్షన్లు లేవు కాబట్టి వైగో నామినేషన్ వేయవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా 2009లో ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా వైగో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈలంకు ఏమైంది’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. శ్రీలంకలో ఎల్టీటీఈ పోరాటం ఆపకపోయినట్లైతే భారత్ ఒక్కటిగా కలిసి ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వైగోపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో 2017లో అరెస్టైన ఆయన నెలరోజుల పాటు జైలులో ఉన్న తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. ఇక 1978 నుంచి 1996 మధ్య కాలంలో వైగో రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. తమ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ.. దాదాపు 23 ఏళ్ల తర్వాత డీఎంకే మద్దతుతో పెద్దల సభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జూలై 18న తమిళనాడులో ఇందుకు సంబంధించిన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కోర్టు తీర్పు వెలువడటం గమనార్హం. -
రాజద్రోహం కేసు ; ఆయనవల్లే బయటపడ్డా..!
రాయ్‌పూర్ : ఇన్వర్టర్ల తయారీ సంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కైందంటూ ప్రభుత్వంపై విమర్శలకు దిగిన ఓ వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేవిధంగా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేశాడంటూ రాజనంద్‌గాం జిల్లాకు చెందిన మంగీలాల్ అగర్వాల్‌పై రాజద్రోహం కేసు నమోదు చేశారు. అయితే, ఈఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మంగీలాల్‌పై పెట్టిన రాజద్రోహం కేసును ఉపసంహరించుకొన్న పోలీసులు శనివారం ఆయనను విడుదల చేశారు. తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవడంలో ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ పాత్ర ప్రధానమైందని మంగీలాల్ చెప్పుకొచ్చారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి : ప్రభుత్వంపై విమర్శలు; రాజద్రోహం కేసు, అరెస్టు)