అమ్నెస్టీ పై దేశ ద్రోహ కేసు నమోదు | Sedition Case Against Amnesty India As Debate on Kashmir Turns Chaotic | Sakshi
Sakshi News home page

అమ్నెస్టీ పై దేశ ద్రోహ కేసు నమోదు

Published Mon, Aug 15 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

Sedition Case Against Amnesty India As Debate on Kashmir Turns Chaotic

బెంగళూరు: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పై దేశ ద్రోహం కేసు నమోదైంది. ఆసంస్థ ఏర్పాటు చేసిన చర్చాకార్యక్రమంలో కొందరు దేశ ద్రోహ నినాదాలు చేయడమే ఇందుకు కారణం. బెంగళూరులో శనివారం కశ్మీర్ అంశంపై ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమం అస్తవ్యస్థంగా మారింది. చర్చా కార్యక్రమంలో  కశ్మీర్ కు చెందిన విద్యార్థులు చొరబడి కశ్మీరీ  పండిడ్ నాయకునితో వాదనకు దిగారు. ఇందులో భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జరిగిన సంఘటనపై విచారణ జరుపుతున్నట్టు కర్నాటక హోం మంత్రి జి. పరమేశ్వర తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఏబీవీపీ కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను వారికి సమర్పించారు. జమ్ము కశ్మీర్లోని బాధితులకు న్యాయం చేసేందుకే తాము చర్చా కార్యక్రమం నిర్వహించామని అమ్నెస్టీ స్ఫష్టం చేసింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement