అమ్నెస్టీ పై దేశ ద్రోహ కేసు నమోదు
బెంగళూరు: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పై దేశ ద్రోహం కేసు నమోదైంది. ఆసంస్థ ఏర్పాటు చేసిన చర్చాకార్యక్రమంలో కొందరు దేశ ద్రోహ నినాదాలు చేయడమే ఇందుకు కారణం. బెంగళూరులో శనివారం కశ్మీర్ అంశంపై ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమం అస్తవ్యస్థంగా మారింది. చర్చా కార్యక్రమంలో కశ్మీర్ కు చెందిన విద్యార్థులు చొరబడి కశ్మీరీ పండిడ్ నాయకునితో వాదనకు దిగారు. ఇందులో భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జరిగిన సంఘటనపై విచారణ జరుపుతున్నట్టు కర్నాటక హోం మంత్రి జి. పరమేశ్వర తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఏబీవీపీ కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను వారికి సమర్పించారు. జమ్ము కశ్మీర్లోని బాధితులకు న్యాయం చేసేందుకే తాము చర్చా కార్యక్రమం నిర్వహించామని అమ్నెస్టీ స్ఫష్టం చేసింది.