
సినీనటి, దర్శకురాలు ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు నమోదైంది. కరోనా వైరస్ గురించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమె మీద ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మలయాళ టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయేషా.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19ను ఒక జీవాయుధంగా ప్రయోగించిందని సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకోసం అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ ఖోడా పటేల్‌ను బయోవెపన్‌గా వాడిందని పేర్కొంది.
ఆమె మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ఇది కేంద్ర ప్రతిష్టను దిగజార్చడమేనని అభిప్రాయపడ్డాడు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆయేషాపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment