Reviewing Sedition Law Centre Informs Supreme Court - Sakshi
Sakshi News home page

Sedition Law: రాజద్రోహం చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటులో బిల్లు..!

May 1 2023 3:29 PM | Updated on May 1 2023 4:00 PM

Reviewing Sedition Law Centre Informs Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజద్రోహం చట్టంపై పునర్ సమీక్ష చేస్తామని కేంద్రం చెప్పింది.   వచ్చే వర్షాకాల సమావేశాల్లో రాజ ద్రోహం చట్టం సవరణ బిల్లును పార్లమెంటు ముందుకు తెస్తామని సూచన ప్రాయంగా తెలిపింది. దీంతో రాజద్రోహం కింద నమోదైన కేసులను ఆగస్టు రెండో వారంలో విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

కాగా.. బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ చట్టం  చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్‌ సహా మొత్తం 16 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపాలని గతేడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజద్రోహం చట్టం, దీని కింద నమోదైన కేసులపై స్టే విధిందించి.

అయితే ఈ చట్టాన్ని పునర్‌ పరిశీలించేందుకు మరింత గడువు కావాలని కేంద్రం గతేడాది అక్టోబర్ 31న కోరింది. ఇప్పుడు మళ్లీ మరింత సమయం కావాలని అడిగింది. దీంతో తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం.
చదవండి: ఆర్నెళ్లు ఆగక్కర్లేదు.. విడాకులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement