Same Sex Marriages Sc Clubs Transfers To Itself All Pleas At Hcs - Sakshi
Sakshi News home page

Same Sex Marriages: 'గే' మ్యారేజెస్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Published Fri, Jan 6 2023 3:33 PM | Last Updated on Fri, Jan 6 2023 4:03 PM

Same Sex Marriages Sc Clubs Transfers To Itself All Pleas At Hcs - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గే మ్యారేజెస్‌కు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకే బదిలీ చేశారు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్. వీటిపై ఫిబ్రవరి 15లోగా స్పందన తెలపాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి మార్చిలో విచారించనున్నట్లు పేర్కొన్నారు.

పిటిషనర్లు ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో వాదనలు విన్పించే పరిస్థితి లేకపోతే.. వారు ఉన్న చోటు నుంచే వర్చువల్‌గా అయినా వాదించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్వలింగ సంపర్క వివాహాలపై పిటిషనర్లు, కేంద్రం చర్చించి లిఖితపూర్వక వివరణ ఇ‍వ్వాలని చెప్పింది. పిటిషన్లలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టకుండా అన్నింటీని పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది.

భారత్‌లో స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్దత లేదు. ఇద్దరు పురుషులు లేదా స్త్రీలు పెళ్లి చేసుకుంటే చట్టపరంగా చెల్లదు. అయినా చాలా మంది స్వలింగసంపర్కులు తమ భాగస్వాములను పెళ్లి చేసుకుంటున్నారు. భారీఎత్తున సెలబ్రేట్ చేసుకుని ఒక్కటైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గే మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పించాలని దేశంలోని వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వీటన్నింటిని కలపి సుప్రీంకోర్టే విచారిస్తానని చెప్పింది.
చదవండి: 'నేను అమ్మనయ్యాను..' కూతుళ్ల కోసం లింగాన్ని మార్చుకున్న తండ్రి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement