Gay marriages
-
స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశంలో స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గే మ్యారేజెస్‌కు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకే బదిలీ చేశారు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్. వీటిపై ఫిబ్రవరి 15లోగా స్పందన తెలపాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి మార్చిలో విచారించనున్నట్లు పేర్కొన్నారు. పిటిషనర్లు ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో వాదనలు విన్పించే పరిస్థితి లేకపోతే.. వారు ఉన్న చోటు నుంచే వర్చువల్‌గా అయినా వాదించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్వలింగ సంపర్క వివాహాలపై పిటిషనర్లు, కేంద్రం చర్చించి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని చెప్పింది. పిటిషన్లలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టకుండా అన్నింటీని పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. భారత్‌లో స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్దత లేదు. ఇద్దరు పురుషులు లేదా స్త్రీలు పెళ్లి చేసుకుంటే చట్టపరంగా చెల్లదు. అయినా చాలా మంది స్వలింగసంపర్కులు తమ భాగస్వాములను పెళ్లి చేసుకుంటున్నారు. భారీఎత్తున సెలబ్రేట్ చేసుకుని ఒక్కటైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గే మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పించాలని దేశంలోని వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వీటన్నింటిని కలపి సుప్రీంకోర్టే విచారిస్తానని చెప్పింది. చదవండి: 'నేను అమ్మనయ్యాను..' కూతుళ్ల కోసం లింగాన్ని మార్చుకున్న తండ్రి.. -
'గే' వివాహాలకు చట్టబద్దతపై పిల్.. కేంద్రం స్పందన కోరిన సుప్రీం..
న్యూఢిల్లీ: స్వలింప సంపర్క వివాహాలకు ప్రత్యేక వివాహం చట్టం వర్తింపజేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు గేలు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌పై నేడు (శుక్రవారం) విచారణ జరిపింది. దీనిపై విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు అటార్నీ జనరల్ కూడా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. దీనిపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ అప్పుడే చేపడతామని పేర్కొంది. హైదరాబాద్ జంట సుప్రియో, అభయ్‌లు గత పదేళ్ల నుంచి కలిసి ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఇద్దరు వైరస్ బారినపడ్డారు. కరోనా నుంచి కోలుకున్నాక ఇద్దరూ 2021 డిసెంబర్లో వేడుక నిర్వహించారు. ఆ సంబరాలకు పేరెంట్స్, ఫ్యామిలీతో పాటు మిత్రులు హాజరయ్యారు. పర్త్ పిరోజ్ మెహరోత్రా, ఉదయ్ రాజ్ అనే మరో జంట రెండో పిటిషన్ వేసింది. సేమ్ సెక్స్ మ్యారేజ్‌ను గుర్తించకపోతే అది సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొంది. చదవండి: గుజరాత్ ఎన్నికలు: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు.. -
‘ఇక మేము అందరితో సమానమే’
ఐర్లాండ్: యునైటైడ్ కింగ్డమ్లో స్వలింగ వివాహలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఇద్దరు యువతులు మంగళవారం పెళ్లికి సిద్ధమయ్యారు. యూకేలో ‘గే’ వివాహాలపై నిషేధం ఎత్తివేసిన అనంతరం స్వలింగ వివాహం చేసుకోబోతున్న మొదటి జంటగా వీరు నిలవబోతున్నారు. బహిరంగంగా వారు పెళ్లి ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. వివరాలు... నగరంలో హెల్త్ కేర్ వర్కర్‌గా పనిచేస్తున్న రాబిన్ (26) బ్రైటన్‌లో వెయిటర్‌గా పని చేస్తున్న షారిన్ ఎడ్వర్డ్ (27) 2005 నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. స్వలింగ వివాహాలు నేరమంటూ నార్త్ ఐర్లాండ్ ప్రావిన్స్ నిషేధం విధించడంతో గత కోన్నేళ్లుగా దూరంగా ఉంటున్నామని యువతులు తెలిపారు. బ్రిటన్ కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో చట్టపరంగా ఒక్కటి కాబోతున్నట్టు ఒక ఇంటర్య్యూలో ఆనందం వ్యక్తంచేశారు. ‘మేము గత కోన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అందుకే ఒకటిగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అంతే తప్ప చరిత్ర సృష్టించాలనుకోవడం లేదు’ అని ఈ సందర్భంగా రాబిన్, ఎడ్వర్డ్ వ్యాఖ్యానించారు. గే వివాహాలను నేరంగా పనిగణించిన ఉత్తర ఐర్లాండ్ ప్రభుత్వ నిర్ణయం బ్రిటన్ కేంద్ర ప్రభుత్వం చొరవతో రద్దయిందని, ఇది తమ అదృష్టమన్నారు. ‘ఇకపై మేము కూడా అందరితో సమానమే’ అని యువతులు మరోసారి సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తర ఐర్లాండ్ ప్రావిన్స్‌లో సిట్టింగ్ ప్రభుత్వం లేనందున ప్రజల కోరిక మేరకు బ్రిటీష్ కేంద్ర ప్రభుత్వం ‘గే’ వివాహాలపై నిషేదాన్ని ఎత్తివేసింది. -
వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..! ట్విస్ట్ ఏంటంటే?
సాక్షి, సూర్యాపేట: ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు..! అయితే అన్ని ప్రేమకథల్లాగే ఈ స్టోరీలో కూడా వారి పెళ్లికి ఆటంకాలు ఎదురయ్యాయి. చివరకు పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. ఇంతవరకూ స్టోరీ రొటినే. అయితే ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే..వాళ్లిద్దరూ అబ్బాయిలు. ఔను..ఇద్దరు యువకుల మధ్య చిగురించిన ప్రేమ..పెళ్లికి దారి తీసింది. అయితే లింగ మార్పిడి చేయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు షరతు పెట్టాడు. దీంతో రెండో యువకుడు.. లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. అయితే లాస్ట్‌మినిట్‌లో మొదటి యువకుడు పెళ్లికి నిరాకరించడంతో పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. సూర్యాపేట జిల్లా ఇమాంపేటకు చెందిన మునగాల జానయ్య అనే యువకుడు.. కొలువు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సూర్యాపేటకు చెందిన గుండ్లగాని సాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ పేరుతో దగ్గరైన వీరిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. మహిళగా మారితేనే పెళ్లి చేసుకుంటానని సాయి చెప్పడంతో.. జానయ్య లింగమార్పిడి చేయించుకున్నాడు. తీరా మహిళగా మారిన తర్వాత సాయి పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ పంచాయితీని ఎలా విప్పాలో తెలియక పోలీసులు తలల పట్టుకున్నారు. -
గే వివాహాలకు ఐర్లాండ్ ఓకే
లండన్: స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేసేందుకు ఐర్లాండ్ ప్రజలు ఓకే చెప్పారు. ‘గే’ల హక్కుల గ్రూప్ ఆధ్వర్యంలో ఈ అంశంపై నిర్వహించిన రిఫరెండంలో ఏకంగా 70 శాతం మంది దీనికి అనుకూలంగా ఓటేశారు. స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను వ్యతిరేకిస్తూ పలు సంస్థలు, సంఘాలు భారీ ఎత్తున ప్రచారం చేసినా.. ప్రజలు మాత్రం ‘గే, లెస్బియన్’ వివాహాలకు మద్దతు తెలిపారు. రిఫరెండంలో 32 లక్షల మందిని ప్రశ్నించి.. స్వలింగ సంపర్క వివాహాలకు అనుకూలమా, వ్యతిరేకమా అన్న వివరాలు సేకరించారు. శనివారం వాటిని లెక్కించగా.. 70 శాతానికిపైగా అనుకూలంగా ఓటేశారు. అన్ని పార్టీలూ ‘గే’ల వివాహాలకు మద్దతిచ్చాయి. రిఫరెండం ఆధారంగా ‘గే, లెస్బియన్’ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పిస్తే.. ఓటింగ్ ద్వారా ఈ తరహా చట్టం చేసిన తొలిదేశంగా ఐర్లాండ్ నిలుస్తుంది. మరోవైపు సాంప్రదాయ వాదులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల తీర్పు విచారకరమని కేథలిక్ సంస్థ అయోనా ఇన్స్టిట్యూట్ ప్రతినిధి జాన్ ముర్రే అన్నారు. పక్కా సంప్రదాయ కేథలిక్ రిపబ్లిక్ అయిన ఐర్లాండ్‌లో 1993 వరకు స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం, శిక్షార్హమైన నేరం కూడా. అంతేకాదు తల్లి ప్రాణాలకు ప్రమాదకరమైతే తప్ప అబార్షన్ చేయడంపై ఇప్పటికీ నిషేధం ఉంది. అలాంటి చోట ప్రజలంతా ‘గే, లెస్బియన్’ వివాహాలకు అనుకూలంగా ఓటేయడం విశేషం.గే వివాహాలను చట్టబద్ధం చేసిన దేశాల్లో ఐర్లాండ్ 22వది.