ఐర్లాండ్: యునైటైడ్ కింగ్‌డమ్‌లో స్వలింగ వివాహలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఇద్దరు యువతులు మంగళవారం పెళ్లికి సిద్ధమయ్యారు. యూకేలో ‘గే’ వివాహాలపై నిషేధం ఎత్తివేసిన అనంతరం స్వలింగ వివాహం చేసుకోబోతున్న మొదటి జంటగా వీరు నిలవబోతున్నారు. బహిరంగంగా వారు పెళ్లి ప్రమాణం చేయనున్నట్లు సమాచారం.
వివరాలు... నగరంలో హెల్త్ కేర్ వర్కర్‌గా పనిచేస్తున్న రాబిన్ (26) బ్రైటన్‌లో వెయిటర్‌గా పని చేస్తున్న షారిన్ ఎడ్వర్డ్ (27) 2005 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. స్వలింగ వివాహాలు నేరమంటూ నార్త్ ఐర్లాండ్ ప్రావిన్స్ నిషేధం విధించడంతో గత కోన్నేళ్లుగా దూరంగా ఉంటున్నామని యువతులు తెలిపారు. బ్రిటన్ కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో చట్టపరంగా ఒక్కటి కాబోతున్నట్టు ఒక ఇంటర్య్యూలో ఆనందం వ్యక్తంచేశారు.
‘మేము గత కోన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అందుకే ఒకటిగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అంతే తప్ప చరిత్ర సృష్టించాలనుకోవడం లేదు’ అని ఈ సందర్భంగా రాబిన్, ఎడ్వర్డ్ వ్యాఖ్యానించారు. గే వివాహాలను నేరంగా పనిగణించిన ఉత్తర ఐర్లాండ్ ప్రభుత్వ నిర్ణయం బ్రిటన్ కేంద్ర ప్రభుత్వం చొరవతో రద్దయిందని, ఇది తమ అదృష్టమన్నారు. ‘ఇకపై మేము కూడా అందరితో సమానమే’ అని యువతులు మరోసారి సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తర ఐర్లాండ్ ప్రావిన్స్‌లో సిట్టింగ్ ప్రభుత్వం లేనందున ప్రజల కోరిక మేరకు బ్రిటీష్ కేంద్ర ప్రభుత్వం ‘గే’ వివాహాలపై నిషేదాన్ని ఎత్తివేసింది.
Comments
Please login to add a commentAdd a comment