UK Government
-
Oscars 2025: యూకే ఓకే చెప్పిన ఈక్వాలిటీ కథ..
మన దేశంలో అందరికీ సమాన న్యాయం జరగడం సులభమేనా?న్యాయానికి కులం, మతం,ప్రాంతం ఉంటాయా?కంటికి కనిపించేది, చెవికి వినిపించేదంతా న్యాయమేనా?సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’ సంధించే ప్రశ్నలివి. యు.కె. ప్రభుత్వ నిర్మాణ భాగస్వామ్యంతో నిర్మితమైన ఈ సినిమాను ఇప్పుడు ఆ దేశం తన అఫిషియల్ ఎంట్రీగా ఆస్కార్‌కు పంపింది. ‘లాపతా లేడీస్’తో పాటు ఆస్కార్‌లో ‘సంతోష్’ కూడా భారతీయ మహిళల కథను పోటీకి నిలపనుంది.ఈ వ్యవస్థ ఎలా నడుస్తోందో వ్యవస్థతో తలపడినప్పుడే సగటు మనిషికి తెలుస్తుంది. సామాజిక వ్యవస్థలో తన కంటే పై వర్గం ఎలా వ్యవహరిస్తుందో తెలిసొస్తే పాలనా వ్యవస్థలో తన కంటే పై అధికారి ఆ పై అధికారి ఎలా వ్యవహరిస్తారో తెలిసొస్తుంది. ప్రతి వ్యవస్థకు వర్షించే కళ్లు, కాటేసే కోరలు ఉంటాయి.ఎవరి మీద వర్షించాలో, ఎప్పుడు కాటేయాలో దానికి తెలుసు. అది మారాలని అందరికీ ఉంటుంది. వ్యవస్థ కూడా తాను మారాలని అనుకోవచ్చు. కాని మారదు. మారాలనుకున్నా మనుషులు మారనివ్వరు. ఏదో కొద్ది వెసులుబాటులో కాసింతో కూసింతో గాలి ఆడి పనులు అవుతుంటాయి అంతే.డాక్యుమెంటరీ మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ సినిమా మన భారతీయ వ్యవస్థ– అది కుల వ్యవస్థ కాని పాలనా వ్యవస్థ గాని ఎలా వ్యవహరిస్తుందో ఒక బాలిక చావు ఆధారంగా చర్చిస్తుంది. ఒక మహిళా కానిస్టేబుల్ కళ్లతో సామాజిక వ్యవస్థను, న్యాయ వ్యవస్థను చూసి ప్రేక్షకుల మనసుల్లో ప్రశ్నలు నాటుతుంది.కథ ఏమిటి?‘సంతోష్’ సినిమాలో ప్రధాన పాత్రధారి సంతోష్ సైని అనే మహిళా పోలీస్ కానిస్టేబుల్. ఈ పాత్రను చాలా ప్రతిభావంతమైన నటిగా పేరు పొందిన షహానా గోస్వామి పోషించింది. ఉత్తరప్రదేశ్‌లాంటి ఒక కల్పిత రాష్ట్రంలో సంతోష్‌కు ఒక కానిస్టేబుల్‌కు పెళ్లవుతుంది. కానీ డ్యూటీలో ఉండగా భర్త హఠాత్తుగా మరణిస్తాడు. ‘నా కొడుకును మింగింది’ అని అత్తగారు సూటి పోటి మాటలంటే అమ్మ గారింట్లోని వారు తిరిగొచ్చిన కూతురిని రకరకాలుగా బాధలు పెడతారు. దాంతో గత్యంతరం లేక భర్త మరణం వల్ల వచ్చే కారుణ్య నియామకంలో ఆమె కానిస్టేబుల్ అవుతుంది. కాని పోలీసులంటే బయట ఉండే మనుషుల్లాంటి వారేనని అక్కడ దారుణమైన పురుషస్వామ్యం, కుల పెత్తనం, అవినీతి, మత ద్వేషం ఉంటాయని తెలుసుకుంటుంది. ఆ సమయంలోనే ఒక అట్టడుగు వర్గం బాలిక శవం ఊరి బావిలో దొరుకుతుంది. అగ్ర కులాల వారే ఆమెను చంపి బావిలో వేశారని గ్రామస్తులు విచారణకు వెళ్లిన సంతోష్‌కు చెబుతారు. అక్కడి నుంచి ఆమె ఎలాంటి ప్రయాణం చేసిందనేదే కథ.మహిళలపై హింసకు వ్యతిరేకంగాలండన్లో పుట్టి పెరిగిన బ్రిటిష్ ఇండియన్ సంధ్యా సూరి గతంలో ‘ఐ ఫర్ ఇండియా’ డాక్యుమెంటరీలో ‘ఫీల్డ్’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో చాలా అవార్డులు పొందింది. భారతదేశంలో స్త్రీలపై సాగే హింస మీద ఒక డాక్యుమెంటరీ తీయాలని ఇండియాలోని ఎన్జిఓలతో పని చేస్తున్నప్పుడు ‘నిర్భయ’ ఘటన ఆమెను హతాశురాలిని చేసింది. ఆ సమయంలో నిరసనలు చేస్తున్న స్త్రీలను అదుపు చేసే మహిళా కానిస్టేబుళ్ల కళ్లలోని బాధ, ఆవేదన చూసినప్పుడు ఆమెకు ‘సంతోష్’ సినిమా తీయాలని అనిపించింది. అయితే దీని నిర్మాణం కోసం ఆమె యు.కె/జర్మన్/ఫ్రెంచ్ దేశాల ఫిల్మ్ ఫండింగ్ ఏజెన్సీల భాగస్వామ్యం కోరింది. సునీతా రాజ్వర్ (పంచాయత్ ఫేమ్), సంజయ్ బిష్ణోయ్ తదితరులు ఇందులో నటించారు.ఆస్కార్ ఎంట్రీమేలో జరిగిన 77వ కాన్స్‌లో బహు ప్రశంసలు పొందిన ‘సంతోష్’ను 97వ ఆస్కార్ అవార్డుల పోటీలో తన దేశ అఫిషియల్ ఎంట్రీగా పంపాలని యూకే భావించడం ఈ కథకు, దర్శకురాలికి దక్కిన గౌరవంగా భావించాలి. ఇప్పటికే మన దేశం నుంచి వెళుతున్న లాపతా లేడీస్ స్త్రీల కథకాగా ‘సంతోష్’ కూడా స్త్రీల కథే కావడం విశేషం.ఇవి చదవండి: మునుపటి కాలం కాదు ఇది, కానీ.. -
కేర్ వర్కర్లు కుటుంబీకుల్ని తీసుకురావద్దు
లండన్: ఇంటి పనుల్లో సాయపడే కేర్ వర్కర్లు ఇకపై తమ వెంట కుటుంబసభ్యులను బ్రిటన్‌కు తీసుకురావడానికి వీల్లేదంటూ బ్రిటన్ ప్రభుత్వం తేలి్చచెప్పింది. ఈ నూతన వలస విధానాన్ని ఈ వారం నుంచే అమలుచేసే అవకాశముంది. ఈ విషయమై బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవెర్లీ మాట్లాడారు. ‘‘ కేర్ వీసా విధానం ద్వారా గత ఏడాది 1,00,000 మంది కేర్ వర్కర్లను బ్రిటన్‌లోకి అనుమతిచ్చాం. అయితే వారి వెంట 1,20,000 మంది డిపెండెంట్లు వచ్చారు. ఇది వీసా దుర్వినియోగాలపై మేం తీసుకుంటున్న చర్యలకు విఘాతం కల్గిస్తోంది. ఇలాంటి పరిస్థితిని అనుమతించబోం’ అని అన్నారు. దీనికి సంబంధించిన నూతన వలస విధానాన్ని గురువారమే ప్రభుత్వం పార్లమెంట్ ముందుంచనుంది. -
అతివాద బోధకులకు బ్రిటన్‌లోకి నో ఎంట్రీ
లండన్: పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్, ఇండోనేసియా వంటి దేశాల నుంచి అతివాద ఇస్లామిస్ట్ విద్వేష ప్రబో ధకులను దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసిందని ‘డైలీ టెలీగ్రాఫ్’ తెలిపింది. తీవ్రవాద కార్యకలాపాలు ఊహించని రీతిలో పెరుగుతుండటం పట్ల బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. విదేశాల నుంచి వచ్చే అతివాద మత ప్రబోధకులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారి పేర్లను వీసా హెచ్చరిక జాబితాలో చేరుస్తారు. వీరికి దేశంలోకి ప్రవేశించే దారులు మూసుకుపోతాయని ‘డైలీ టెలీగ్రాఫ్’ పేర్కొంది. -
యూకేకు ప్రయాణం మరింత కఠినం
లండన్: కోవిడ్ వేరియంట్ల వ్యాప్తిని నివారించేందుకు యూకే ప్రభుత్వం కఠినమైన ప్రయాణ ఆంక్షలను ప్రకటించింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన తాజా ఆంక్షలతో హైరిస్క్ రెడ్ లిస్ట్‌లో ఉన్న 33 దేశాల నుంచి ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చిన యూకే, ఐర్లాండ్‌కు చెందిన ప్రయాణీకులు హోటల్లో క్వారంటైన్లో గడపాలి. ఈ జాబితాలో భారత్ లేదు. ఇంగ్లండ్‌కు రావాలనుకునే వారు 10 రోజులపాటు ప్రభుత్వం నిర్దేశించిన హోటళ్లలో క్వారంటైన్లో గడిపేందుకు, రవాణా చార్జీలు, వైద్య పరీక్షలకు అవసరమైన 1,750 పౌండ్లు(రూ.1,76,581)ను ముందుగా చెల్లించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు 10వేల పౌండ్ల వరకు జరిమానా ఉంటుంది. రెడ్ లిస్ట్‌లో లేని భారత్ వంటి దేశాలకు వెళ్లని యూకే, ఐర్లాండ్ నివాసితులు 10 రోజులపాటు తమ ఇళ్లలో క్వారంటైన్లో గడపాలి. ఇంగ్లండ్‌కు చేరుకున్న 2వ, 8వ రోజున తప్పనిసరిగా కరోనా టెస్ట్ చేయించుకోవాలి. ‘కరోనా వైరస్ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో తాజా చర్యలు తీసుకున్నాం. కొత్త వేరియంట్లను సరిహద్దులు దాటి లోపలికి రానివ్వరాదన్నదే మా లక్ష్యం’అని యూకే ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో కోటిన్నర మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని వెల్లడించింది. యూకే రెడ్‌లిస్ట్‌లో చేర్చిన 33 దేశాల్లో వివిధ కోవిడ్–19 వేరియంట్లు వ్యాప్తిలో ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు యూకేలోకి ప్రవేశించిన ఏ ప్రాంతం వారైనా ప్రయాణానికి మూడు రోజులు ముందుగా చేయించుకున్న కోవిడ్–19 నెగెటివ్ పరీక్ష రిపోర్టు తప్పనిసరిగా కలిగి ఉండాలనే నిబంధన ఉంది. అదేవిధంగా, రెడ్ లిస్ట్‌లోని 33 దేశాలకు చెందిన యూకే నాన్ రెసిడెంట్లపై బ్రిటన్‌లో ప్రవేశించరాదనే నిబంధన కూడా ఉంది. యూకేలో ప్రస్తుతం అమల్లో ఉన్న కఠిన లాక్డౌన్ నిబంధనలతో అత్యవసరం కాని ప్రయాణాలపై నిషేధం ఉంది. యూకే నుంచి బయటకు వెళ్లాలనుకునే వారిని సైతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు మరిన్ని అధికారాలు తాజా నిబంధనల ప్రకారం సరిహద్దు భద్రతా బలగాలకు, పోలీసులకు మరిన్ని అధికారాలు దఖలుపడ్డాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడం, అనుమానిత ప్రయాణీకులను గుర్తించి మూడు గంటలపాటు నిర్బంధంలో ఉంచేందుకు వారికి అధికారాలిచ్చారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉండే వారు నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూసేందుకు ప్రత్యేకంగా బలగాలను రంగంలోకి దించారు. క్వారంటైన్ కోసం ప్రభుత్వం 4,963 గదులున్న 16 హోటళ్లను గుర్తించింది. మరో 58 వేల రూంలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణీకులు ఇంగ్లండ్‌కు చేరుకోవడానికి ముందుగానే తమ క్వారంటైన్ రూంలను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునేందుకు ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటైంది. హీత్రూ ఎయిర్‌పోర్టు, గాట్విక్, లండన్ సిటీ, బర్మింగ్‌హామ్, ఫార్న్బరోల్లో హోటళ్లను క్వారంటైన్ కోసం సిద్ధంగా ఉంచారు. -
లండన్‌లో నేటి నుంచి కఠిన ఆంక్షలు
లండన్: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో లండన్‌లో బుధవారం నుంచి అత్యంత కఠిన స్థాయి ఆంక్షలను(టయర్ 3) విధించాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. అకస్మాత్తుగా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరగడానికి తాజాగా గుర్తించిన కొత్త తరహా కరోనా వైరసే కారణమని భావిస్తున్నారు. లండన్‌తో పాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వేగవంతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రతినిధుల సభలో ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హాన్కాక్ వివరించారు. ‘టయర్ 3’లో దాదాపు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌తో సమానమైన ఆంక్షలుంటాయి. ‘ఇక్కడ కొత్త తరహా కరోనా వైరస్‌ను గుర్తించారు. ఆగ్నేయ ఇంగ్లండ్ ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య అకస్మాత్తుగా, వేగంగా పెరగడానికి ఈ కొత్త తరహా వైరస్ కారణం కావచ్చని భావిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు వేగంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని హాన్కాక్ పార్లమెంట్‌కు తెలిపారు. దాదాపు వెయ్యికి పైగా కేసుల్లో కొత్త వైరస్ వేరియంట్‌ను గుర్తించారని, అందులో అధికభాగం దక్షిణ ఇంగ్లండ్ ప్రాంతంలోనే నమోదయ్యాయని వివరించారు. ఇప్పటికే బర్మింగ్‌హాం, మాంచెస్టర్ సహా పలు ప్రధాన నగరాల్లో టయర్ 3 ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా, క్రిస్టమస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఆంక్షల్లో స్వల్ప సడలింపు ఇవ్వాలని గత నెలలో యూకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఐదు రోజుల పాటు స్థానికంగా ఉండే మూడు కుటుంబాల వరకు కలుసుకుని పండుగ జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే, కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ప్రభుత్వానికి అభ్యర్థనలు వస్తున్నాయి. -
‘ఇక మేము అందరితో సమానమే’
ఐర్లాండ్: యునైటైడ్ కింగ్డమ్లో స్వలింగ వివాహలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఇద్దరు యువతులు మంగళవారం పెళ్లికి సిద్ధమయ్యారు. యూకేలో ‘గే’ వివాహాలపై నిషేధం ఎత్తివేసిన అనంతరం స్వలింగ వివాహం చేసుకోబోతున్న మొదటి జంటగా వీరు నిలవబోతున్నారు. బహిరంగంగా వారు పెళ్లి ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. వివరాలు... నగరంలో హెల్త్ కేర్ వర్కర్‌గా పనిచేస్తున్న రాబిన్ (26) బ్రైటన్‌లో వెయిటర్‌గా పని చేస్తున్న షారిన్ ఎడ్వర్డ్ (27) 2005 నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. స్వలింగ వివాహాలు నేరమంటూ నార్త్ ఐర్లాండ్ ప్రావిన్స్ నిషేధం విధించడంతో గత కోన్నేళ్లుగా దూరంగా ఉంటున్నామని యువతులు తెలిపారు. బ్రిటన్ కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో చట్టపరంగా ఒక్కటి కాబోతున్నట్టు ఒక ఇంటర్య్యూలో ఆనందం వ్యక్తంచేశారు. ‘మేము గత కోన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అందుకే ఒకటిగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అంతే తప్ప చరిత్ర సృష్టించాలనుకోవడం లేదు’ అని ఈ సందర్భంగా రాబిన్, ఎడ్వర్డ్ వ్యాఖ్యానించారు. గే వివాహాలను నేరంగా పనిగణించిన ఉత్తర ఐర్లాండ్ ప్రభుత్వ నిర్ణయం బ్రిటన్ కేంద్ర ప్రభుత్వం చొరవతో రద్దయిందని, ఇది తమ అదృష్టమన్నారు. ‘ఇకపై మేము కూడా అందరితో సమానమే’ అని యువతులు మరోసారి సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తర ఐర్లాండ్ ప్రావిన్స్‌లో సిట్టింగ్ ప్రభుత్వం లేనందున ప్రజల కోరిక మేరకు బ్రిటీష్ కేంద్ర ప్రభుత్వం ‘గే’ వివాహాలపై నిషేదాన్ని ఎత్తివేసింది. -
పరిశోధకులకు బ్రిటన్ ప్రత్యేక వీసాలు
లండన్: పరిశోధన రంగానికి ఊతమిచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో భారతీయ పరిశోధకులు లాభపడనున్నారు. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, పరిశోధకుల కోసం ప్రత్యేక వీసాల జారీని బ్రిటన్ ప్రారంభించింది. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభించిన యూకే సైన్స్, రీసెర్చ్, అకాడెమియా కార్యక్రమం(యూకేఆర్ఐ) ప్రస్తుతమున్న టయర్–5(ప్రభుత్వ ఆమోదిత తాత్కాలిక సిబ్బంది మార్పిడి) పథకంతోపాటు అమల్లో ఉంటుంది. కొత్త వీసాతో యూరోపియన్ యూనియన్(ఈయూ)యేతర దేశాల సైంటిస్టులు, పరిశోధకులు బ్రిటన్‌లో రెండేళ్లపాటు ఉండొచ్చు. బ్రిటన్‌లోని 7 పరిశోధన విభాగాలు,ఇన్నోవేటివ్ యూకే, రీసెర్చ్ ఇంగ్ల్లండ్లలో పనిచేసేందుకు చాన్స్ ఉంటుంది.ఈ పరిణామాలు భారత్ వృత్తి నిపుణులు, వ్యాపార వేత్తలకు అనుకూలం. -
క్రిస్మస్ గిఫ్ట్ : కొత్త రంగుల్లో పాస్‌పోర్టు
లండన్ : బ్రిటన్ ప్రభుత్వం తన దేశీయులకు క్రిస్మస్ గిఫ్ట్ అందించింది. కొత్త రంగుల్లో పాస్‌పోర్టును అందించనున్నట్టు ప్రకటించింది. 2019లో యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత నీలం, బంగారపు రంగుల డిజైన్‌లో పాస్‌పోర్టు అందించనున్నామని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. తమ జాతీయ గుర్తింపును పునరుద్ధరించనున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న బుర్గండి రంగు ట్రావెల్ డాక్యుమెంట్‌ను తీసివేయనున్నామని చెప్పింది. యూరోపియన్ యూనియన్ వ్యాప్తంగా వాడే ఈ ట్రావెల్ డాక్యుమెంట్‌ను బ్రెగ్జిట్ నేపథ్యంలో తొలగించనున్నట్టు తెలిసింది. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవడం... తమ జాతీయ గుర్తింపును పునరుద్ధరించుకోవడానికి ఓ ప్రత్యేక అవకాశమని ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ బ్రాండన్ లెవిస్ చెప్పారు. ప్రపంచంలో తమకోసం ఓ కొత్త మార్గాన్ని నియమించకుంటున్నామన్నారు. ఈ కొత్త పాస్‌పోర్టులు దేశంలోనే అత్యంత భద్రతాపరమైన డాక్యుమెంట్లని అభివర్ణించారు. మోసం, ఫోర్జరీల నుంచి కాపాడేందుకు సెక్యురిటీ చర్యలను అప్డేట్ చేస్తూ ఈ పాస్‌పోర్టులను విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం వాడుతున్న పిక్చర్ పేజ్ ఆధారిత పేపర్‌ను, కొత్తదానితో రీప్లేస్ చేయనున్నామని, మంత్రిత్వశాఖ చెప్పింది. కొత్త నీలం, బంగారం డిజైన్ పాస్‌పోర్టు, కొన్ని దశాబ్దాల కింద బ్రిటన్ వాడింది. ప్రస్తుతం 2019 అక్టోబర్ నుంచి వీటిని బ్రిటన్ ప్రభుత్వం జారీచేయనుంది. ఇప్పుడున్న పాస్‌పోర్టును 1988 నుంచి వాడుతున్నారు. -
బ్రిటన్ విద్యార్థి వీసాల్లో కోత!
లండన్: బ్రిటన్ ప్రభుత్వం విద్యార్థి వీసాల సంఖ్యను భారీగా తగ్గించనున్నట్లు తెలుస్తోంది. భారత్ సహా ఐరోపా బయటి దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే విద్యార్థుల సంఖ్య నానా టికీ తగ్గుతోంది. ప్రస్తుతం 3 లక్షల విద్యార్థి వీసాలను బ్రిటన్ మంజూరు చేస్తుండగా విశ్వసనీయ సమాచారం ప్రకారం వీటి సంఖ్యను దాదాపు సగానికి అంటే 1.7 లక్షలకు తగ్గించనుంది. బ్రిటన్‌లోకి వలసలను తగ్గించే లక్ష్యంతో ఇప్పటికే అనేక మంది భారతీయ విద్యార్థులకు బ్రిటన్ చిన్న చిన్న కారణాలతో వీసాలను నిరాకరిస్తోంది. ప్రభుత్వ గణాంకాల కార్యాలయం సర్వే ప్రకారం గతేడాది 1.34 లక్షల మందికి విద్యార్థి వీసాలను మంజూరు చేయగా ఈ ఏడాది 1.11 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. బ్రిటన్ విద్యార్థి వీసాలను అత్యధికంగా దక్కించకుంటున్న తొలి మూడు దేశాలు అమెరికా, చైనా, భారత్. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థుల పాత్ర ఎంతో ఉందనీ, వారి వల్ల ఏడాదికి 14 బిలియన్ పౌండ్లు సమకూరుతున్నాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి వలసలను తగ్గించడానికి ఇతర వీసాల సంఖ్యలో కోత పెట్టినా విద్యార్థి వీసాలను మాత్రం ఎక్కువగా ఇవ్వాలని సూచిస్తున్నారు. -
మాల్యాకు బిగుసుకుంటున్న ఉచ్చు!
న్యూఢిల్లీ : బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగొట్టి, విదేశాలకు వెళ్లిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు బిగుసుకున్న ఉచ్చు మరింత బలపడేలా కనిపిస్తోంది. లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వానికి కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ... బ్రిటన్ హై కమిషనర్‌కు లేఖ రాసింది. ఇదిలా ఉంటే బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన మాల్యా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్నారు. విచారణకు రావాలంటూ ఈడీ మూడు సార్లు నోటీసులు పంపినా... డొంకతిరుగుడు సమాధానాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాను భారత్‌కు తీసుకువచ్చేదిశగా బ్రిటన్ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. గత మార్చి 2వ తేదీన విజయ్ మాల్యా లండన్ కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. మాల్యా భారత్ కు తిరిగిరాకపోవడం, ఆయనపై దాఖలయిన పిటిషన్లు, కేసులపై విచారణ నిమిత్తం స్వదేశానికి తిరిగి రావాలన్న ఆదేశాలను పాటించకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా తనని అరెస్టు చేస్తారనే భయంతోనే భారత్ కు రావడం లేదంటూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను ఇచ్చిన గడువులోగా వెల్లడించాలని జస్టిస్ కురియన్ జోసెఫ్, ఆర్ఎఫ్ నారీమన్ లతోకూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బ్యాంకులకు రూ.9,400 కోట్ల రుణాల ఎగవేతను క్షుణ్ణంగా పరిశీలించిన 10మంది సభ్యుల కమిటీ ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దుచేయడానికి అంగీకరించారు. -
బ్రిటన్ వీసా ఫీజుల పెంపు
లండన్: బ్రిటన్ ప్రభుత్వం ఈ నెల 18 నుంచి దాదాపు అన్ని రకాల వీసా ఫీజులు పెంచనుంది. షార్ట్‌టైమ్ విజిటర్స్, వర్క్, స్టడీ వీసాల ఫీజు రెండు శాతం.. నేషనాలిటీ, సెటిల్మెంట్, రెసిడెంట్ వీసా దరఖాస్తులకు 25 శాతం ఫీజు పెంచాలని జనవరిలో ప్రతిపాదించారు. ప్రతిపాదనల ప్రకారం బ్రిటన్‌లో సెటిల్మెంట్ లేదా ఐఎల్ఆర్ దరఖాస్తుదారుల ఫీజు 1,500 పౌండ్ల (సుమారు రూ. 1,42,450) నుంచి 1,875 పౌండ్ల (సుమారు రూ. 1,78,062)కు పెరగనుంది. ఇకపై ఫ్యామిలీ, స్పౌస్ వీసాలకు 1,195 పౌండ్లు (సుమారు రూ. 1,13,580) అడల్ట్ డిపెండెంట్ రిలేటివ్స్‌కు 2,676 పౌండ్లు(సుమారు రూ.2,54,462) చెల్లించాలి. కిందటేడాది బ్రిటన్‌లో నివసించేందుకు, పనిచేసేందుకు వీసాలు మంజూరైన వేలాది భారతీయులపై పెంపు ప్రభావం పడనుంది. ప్రతి ఏడాది బ్రిటన్ వీసాలు పొందేవారిలో భారతీయులే అధికంగా ఉంటారు. ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటస్టిక్స్ ప్రకారం కిందటేడాది 92,062 మందికి రెసిడెంట్, వర్క్ వీసాలు మంజూరు చేస్తే.. అందులో 57 శాతం మంది భారతీయులే. అత్యుత్తమ సేవల కోసం ఫీజులు పెంచుతున్నట్లు బ్రిటన్ వెల్లడించింది. -
యూరప్‌యేతర ఉద్యోగులపై వెయ్యిపౌండ్ల సర్‌చార్జ్
యూకే సర్కారు పన్ను ♦ భారత ఐటీ నిపుణులకు మంచి అవకాశం లండన్: యూకేలో యూరప్యేతరులను ఉద్యోగులుగా నియమించుకునే కంపెనీలు ఇకపై ఏడాదికి అదనంగా వెయ్యి పౌండ్ల (దాదాపు రూ.95 వేలు) సర్చార్జ్ను చెల్లించాల్సి ఉంటుంది. టైర్2 వీసా విధానంలో భాగంగా.. కంపెనీల ‘ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్’ను సమీక్షించాక యూకే మైగ్రేషన్ అడ్వయిజరీ కమిటీ(మ్యాక్) ఈ సిఫార్సు చేసింది. దీంతో యూకేలో ఉద్యోగానికి వచ్చే వారికి శిక్షణనిచ్చి ఉద్యోగంలో చేర్చుకోవటం కంపెనీలకు భారమవుతుంది. నేరుగా నైపుణ్యమున్న వారికే ఉద్యోగాలివ్వాల్సి ఉంటుంది. కొత్త విధానంతో కనీసం మూడేళ్ల వీసాపై వచ్చే యూరప్యేతరులపై కంపెనీలు 3 వేల పౌండ్లు చెల్లించాలి. దీనివల్ల అవి స్థానికులకే శిక్షణనిచ్చి వారికే ఉద్యోగాలిచ్చేందుకు అవకాశం ఉంటుందని మ్యాక్ తన నివేదికలో పేర్కొంది. నివేదికను యూకే ప్రభుత్వం త్వరగానే ఆమోదించనున్నట్లు సమాచారం. 2015 సెప్టెంబర్ వరకున్న లెక్కల ప్రకారం.. టైర్ 2 వీసా కింద అనుమతి పొందిన వారిలో 90శాతం మంది భారతీయ స్కిల్డ్ వర్కర్లే ఉన్నారని మ్యాక్ తెలిపింది. భారత్‌లోని మల్టీనేషనల్ కంపెనీలు పోటీ వాతావరణం వల్ల యూకేలో ఐటీ ప్రాజెక్టులకోసం భారతీయ ఉద్యోగులను తీసుకొస్తున్నాయంది. యూకేతో పోలిస్తే.. భారత్‌లో వేతనాలు చాలా తక్కువగా ఉండట కారణమంది. భారత్‌లోనూ శిక్షణ సంస్థల మధ్యతో నిపుణులైన ఉద్యోగులు బయటకు వస్తున్నారని.. వారికి యూకే కంపెనీలు మంచి వేతనంతో ఉద్యోగాలిస్తున్నాయ పేర్కొంది. కాగా, 2016 నుంచి 2020 వరకు వెయ్యిమంది యూకే గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇచ్చేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముందుకొచ్చినట్లు తెలిసింది. -
అక్రమ వలస కార్మికులపై బ్రిటన్ ఉక్కుపాదం
లండన్: బ్రిటన్‌లో అక్రమంగా పనిచేస్తున్న వలస కార్మికులపై ఆ దేశ ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. చట్టవిరుద్ధంగా పనిచేసే కార్మికులు ఇకపై ప్రభుత్వానికి పట్టుబడితే 6 నెలల జైలు శిక్షతో పాటు వారి వేతనాలను స్వాధీనం చేసుకొనే కొత్త ప్రతిపాదనను బ్రిటన్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. కొత్తగా రూపొందించిన ఇమ్మిగ్రేషన్ బిల్లులో ఈ ప్రతిపాదనను చేర్చి వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ సమావేశంలో ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. ఈ తాజా ప్రతిపాదనపై బ్రిటన్ ఇమిగ్రేషన్ మంత్రి జేమ్స్ బ్రోకెన్‌షైర్ మాట్లాడుతూ.. అక్రమ వలసదారులు, కార్మికులకు జైలు శిక్ష విధించడంతో పాటు వారికి భారీ అపరాధ రుసుం కూడా విధిస్తామని తెలిపారు. వలసదారులకు బ్రిటన్ అనువైన ప్రదేశం అని ఇకపై అనుకునే పరిస్థితి ఉండబోదని స్పష్టం చేశారు. ఇక్కడ అక్రమంగా ఉంటున్న వలసదారుల ఉద్యోగాలను తొలగించడంతో పాటు, వారు నివసించే ఇళ్లు, బ్యాంక్ అకౌంట్లను కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు.