పరిశోధకులకు బ్రిటన్‌ ప్రత్యేక వీసాలు | UK launches new visas open to Indian scientists, academics | Sakshi
Sakshi News home page

పరిశోధకులకు బ్రిటన్‌ ప్రత్యేక వీసాలు

Published Sun, Jul 8 2018 3:11 AM | Last Updated on Tue, Aug 7 2018 4:17 PM

UK launches new visas open to Indian scientists, academics - Sakshi

లండన్‌: పరిశోధన రంగానికి ఊతమిచ్చేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో భారతీయ పరిశోధకులు లాభపడనున్నారు. భారత్‌ సహా వివిధ దేశాలకు చెందిన ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, పరిశోధకుల కోసం ప్రత్యేక వీసాల జారీని బ్రిటన్‌ ప్రారంభించింది. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభించిన యూకే సైన్స్, రీసెర్చ్, అకాడెమియా కార్యక్రమం(యూకేఆర్‌ఐ) ప్రస్తుతమున్న టయర్‌–5(ప్రభుత్వ ఆమోదిత తాత్కాలిక సిబ్బంది మార్పిడి) పథకంతోపాటు అమల్లో ఉంటుంది. కొత్త వీసాతో యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)యేతర దేశాల సైంటిస్టులు, పరిశోధకులు బ్రిటన్‌లో రెండేళ్లపాటు ఉండొచ్చు. బ్రిటన్‌లోని 7 పరిశోధన విభాగాలు,ఇన్నోవేటివ్‌ యూకే, రీసెర్చ్‌ ఇంగ్ల్లండ్‌లలో పనిచేసేందుకు చాన్స్‌ ఉంటుంది.ఈ పరిణామాలు భారత్‌ వృత్తి నిపుణులు, వ్యాపార వేత్తలకు అనుకూలం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement