
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. ఈ మధ్య ఇండియా-పాక్ మ్యాచ్ చూసి వచ్చారు. అంతకు తప్పితే పెద్దగా వార్తల్లో లేరు. అలాంటి ఈయనపై ఇప్పుడు ఓ రూమర్ వైరల్ అవుతోంది. గౌరవాన్ని వద్దనుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏమైంది?
(ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'సంక్రాంతి వస్తున్నాం'.. స్ట్రీమింగ్ అందులోనే)
ఎన్నో అద్భుతమైన సినిమాలతో అలరించిన చిరంజీవి.. ఇప్పటికే పద్మ పురస్కారాల్ని కూడా అందుకుంది. అలాంటి ఈయనకు యూకే ప్రభుత్వం.. ఆ దేశ పౌరసత్వాన్ని గౌరవారర్ధంగా ఇచ్చిందని మాట వినిపించింది. అయితే ఇవన్నీ నిజం కాదని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది.
ఇదంతా పక్కనబెడితే యూకేలో చిరుని సన్మానించేందుకు మాత్రం ఓ కార్యక్రమం ప్లాన్ చేశారట. బహుశా అందువల్లే ఈ రూమర్స్ వచ్చినట్లున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం 'విశ్వంభర' పూర్తి చేసే బిజీలా ఉన్న చిరు.. తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' ఫేమ్ అనిల్ రావిపూడితో కలిసి పనిచేస్తారు.
(ఇదీ చదవండి: నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్ రావిపూడి)
Comments
Please login to add a commentAdd a comment