లండన్: బ్రిటన్ ప్రభుత్వం ఈ నెల 18 నుంచి దాదాపు అన్ని రకాల వీసా ఫీజులు పెంచనుంది. షార్ట్‌టైమ్ విజిటర్స్, వర్క్, స్టడీ వీసాల ఫీజు రెండు శాతం.. నేషనాలిటీ, సెటిల్‌మెంట్, రెసిడెంట్ వీసా దరఖాస్తులకు 25 శాతం ఫీజు పెంచాలని జనవరిలో ప్రతిపాదించారు. ప్రతిపాదనల ప్రకారం బ్రిటన్‌లో సెటిల్‌మెంట్ లేదా ఐఎల్‌ఆర్ దరఖాస్తుదారుల ఫీజు 1,500 పౌండ్ల (సుమారు రూ. 1,42,450) నుంచి 1,875 పౌండ్ల (సుమారు రూ. 1,78,062)కు పెరగనుంది.
ఇకపై ఫ్యామిలీ, స్పౌస్ వీసాలకు 1,195 పౌండ్లు (సుమారు రూ. 1,13,580) అడల్ట్ డిపెండెంట్ రిలేటివ్స్‌కు 2,676 పౌండ్లు(సుమారు రూ.2,54,462) చెల్లించాలి. కిందటేడాది బ్రిటన్‌లో నివసించేందుకు, పనిచేసేందుకు వీసాలు మంజూరైన వేలాది భారతీయులపై పెంపు ప్రభావం పడనుంది. ప్రతి ఏడాది బ్రిటన్ వీసాలు పొందేవారిలో భారతీయులే అధికంగా ఉంటారు. ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటస్టిక్స్ ప్రకారం కిందటేడాది 92,062 మందికి రెసిడెంట్, వర్క్ వీసాలు మంజూరు చేస్తే.. అందులో 57 శాతం మంది భారతీయులే. అత్యుత్తమ సేవల కోసం ఫీజులు పెంచుతున్నట్లు బ్రిటన్ వెల్లడించింది.
బ్రిటన్ వీసా ఫీజుల పెంపు
Published Tue, Mar 8 2016 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM
Advertisement
Advertisement