visa fees
-
అమెరికా బాటలో ఆస్ట్రేలియా.. భారమవుతున్న విదేశీ విద్య
విదేశీ విద్యార్థులు వలసలను తగ్గించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ విద్యార్థుల వీసా ఫీజును భారీగా పెంచుతూ ప్రకటించింది. 710 ఆస్ట్రేలియా డాలర్లుగా ఉండే వీసా ఫీజు.. ఇప్పుడు ఇది 1600 ఆస్ట్రేలియన్ డాలర్లకు పెరిగింది. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 40వేలు నుంచి రూ. 89వేలుకు పెరిగిందన్నమాట.వీసా ఫీజులను పెంచడమే కాకుండా విజిటర్ వీసా హోల్డర్లు, తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాలు కలిగిన విద్యార్థులు ఇప్పుడు దేశంలో ఉన్నప్పుడు స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేయడం కూడా నిషేదించారు. రికార్డు స్థాయిలో విదేశీ విద్యార్థులు రాకను నియంత్రించడంలో భాగంగానే ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.ఆస్ట్రేలియా కొత్త వీసా ఫీజుల పెంపు ఈ రోజు (జూలై 1) నుంచి అమల్లోకి వస్తుంది. ఈరోజు అమల్లోకి వస్తున్న మార్పులు మన అంతర్జాతీయ విద్యా వ్యవస్థ సమగ్రతను పునరుద్ధరించడంలో సహాయపడతాయి. స్వేచ్ఛగా.. ఆస్ట్రేలియాకు మెరుగైన సేవలందించేలా ఉండేలా మైగ్రేషన్ వ్యవస్థను సృష్టిస్తామని.. హోం వ్యవహారాల మంత్రి క్లేర్ ఓ నీల్ పేర్కొన్నారు.విదేశీ విద్యకోసం వెళ్లే విద్యార్థులు ప్రారంభంలో అమెరికా, కెనడా దేశాలకు వెళ్లేవారు. ఆ రెండు దేశాలు వీసా ఫీజులను దాదాపు 185 డాలర్లు, 110 డాలర్లు పెంచడంతో.. విద్యార్థులు ఈ రెండు దేశాలకు ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియాను ఎంచుకున్నారు. దీంతో సుమారు 30 శాతం మంది విద్యార్థులు ఆస్ట్రేలియా బాట పట్టారు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా వీసా ఫీజులను భారీగా పెంచేసింది.కొన్ని గణాంకాల ప్రకారం, విదేశీ విద్యకోసం 2022-23లో ఏకంగా 1.50 లక్షలమంది ఆస్ట్రేలియాకు వెళ్లారు. విదేశీ విద్యార్థులు రాకను నియంత్రించడానికి 2022 చివరలో విదేశీ విద్యార్థులు వీసా ఫీజుల పాలసీలలో మార్పులు వచ్చాయి. దీంతో నియమాలు మరింత కఠినతరమయ్యాయి. ప్రారంభంలో ఇంగ్లీష్ భాష అవసరాన్ని మరింత కఠినతరం చేశారు. ఆ తరువాత వీసా ఫీజులను పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నారు. -
అమెరికా వెళ్లేవారికి అలర్ట్: కొత్త ఫీజులు రేపటి నుంచే..
అమెరికా వెళ్లాలనుకుని వీసా ప్రయత్నాల్లో ఉన్నవారికి షాకింగ్ వార్త ఇది. ఏప్రిల్ 1 నుంచి వలసేతర అమెరికన్ వీసా కోసం వసూలు చేసే ఫీజులో భారీ పెరుగుదల ఉండబోతోంది. వీసా ఫీజు ఒకేసారి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ఈ పెంపు హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1), ఈబీ-5 (EB-5) వీసాలకు వర్తిస్తుంది. 8 ఏళ్ల తర్వాత పెంపు అమెరికాలో నివసించడానికి వచ్చే భారతీయులు ఎక్కువగా హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసాలు తీసుకుంటారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఫీజుల పెంపుదల జరుగుతోంది. గతంలో 2016లో ఫీజులు పెంచారు. వీసాల పెంపుదల తర్వాత ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు వర్తిస్తాయని ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లో యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. వీసా కొత్త ఫీజులు ఇలా.. కొత్త హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, దీని కోసం ఫారమ్ I-129 ఉంటుంది. దీని రుసుము 460 డాలర్లు నుండి 780 డాలర్లకు పెరగనుంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ.38,000 నుంచి రూ.64,000కు పైగా పెరుగుతుంది. ఇది కాకుండా హెచ్1బీ రిజిస్ట్రేషన్ ఫీజు 10 డాలర్లు(రూ. 829) నుంచి 215 డాలర్లు (సుమారు రూ. 17,000) పెరుగుతుంది. ఇక ఎల్-1 వీసా రుసుము ఏప్రిల్ 1 నుంచి మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతానికి ఇది 460 డాలర్లు (సుమారు రూ. 38,000) ఉంది. ఇది ఏప్రిల్ 1 నుండి 1385 డాలర్లకు (రూ. 1,10,000) పెరుగుతుందని అంచనా. ఎల్-1 అమెరికాలో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీ కింద వస్తుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల బదిలీ కోసం దీన్ని రూపొందించారు. అలాగే ఈబీ-5 వీసా ఫీజులు కూడా మూడు రెట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం 3675 డాలర్లు (దాదాపు రూ. 3 లక్షలు) ఉండగా 11160 డాలర్లకు (దాదాపు రూ.9 లక్షలు) పెరగవచ్చని అంచనా. ఈబీ-5 వీసాను 1990లో యూఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. దీని కింద అధిక ఆదాయ విదేశీ పెట్టుబడిదారులు అమెరికన్ వ్యాపారాలలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా వారి కుటుంబాలకు వీసాలు పొందవచ్చు. కనీసం 10 మంది అమెరికన్లు ఉద్యోగాలు పొందగలిగేలా ఈ వ్యాపారం ఉండాలి. -
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌కు ఇజ్రాయెల్ కౌంటర్
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దళాలు జరిపిన మారణకాండకు ప్రతికారంగా ఆ దేశం.. గాజాపై దాడులు చేస్తోంది. కాల్పుల విరమణ చేసి.. పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం అందిచాలని ఆమెరికాతో పాటు పలు దేశాలు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాలు ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తున్నాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ కలిగిన ప్రజలను ఈ జాబితాలోని దేశాలు.. తమ దేశంలోకి అనుమతించవని వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. ఆ జాబితాలో అల్జేరియా, బంగ్లాదేశ్, బ్రూనై, ఇరాన్, ఇరాక్, కువైట్, లెబనాన్, లిబియా, పాకిస్తాన్ దేశాలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం.. లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్, ఇరాన్ దేశాలు శత్రు దేశాలు జాబితాలో ఉన్నాయి. ఈ అయితే ఈ దేశాలకు ఇజ్రాయెల్ పౌరులు.. వెళ్లాలంటే ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందే. అయితే మధ్యప్రాచ్య దేశాల్లో ఇజ్రాయెల్‌కు వీసా ఫ్రీ దేశంగా కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఉండటం గమనార్హం. We’re good pic.twitter.com/GmiwEzZGck — Israel ישראל 🇮🇱 (@Israel) March 14, 2024 అయితే దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ పౌరులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశంలో ఓ రాష్ట్ర అధికారిక ట్విటర్ హ్యాండిల్ కౌంటర్ ఇచ్చింది. ‘మేం బాగున్నాం’ అని ‘ఎక్స్’లో రీట్వీట్ చేసింది. ఇక..2024 నాటికి ప్ఇజ్రాయెల్ దేశం రపంచంలో 171 దేశాల్లో వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్‌ను కలిగి ఉంది. అదేవిధంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇజ్రాయెల్ పాస్‌పోర్టు 20వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ కలిగిన పౌరులు చాలా యురోపీయన్ దేశాలుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళ్తారు. అదేవిధంగా లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు కూడా ఇజ్రాయెల్ ప్రజలు తమ పాస్‌పోర్టు ద్వారా సందర్శిస్తారు. ఇదీ చదవండి: స్వలింగ వివాహం చేసుకున్న విదేశాంగ మంత్రి! -
యూకే విజిటింగ్, స్టూడెంట్ వీసా ఫీజుల మోత
లండన్: బ్రిటన్ ప్రభుత్వం విద్యార్థి, సందర్శక వీసా ఫీజులను త్వరలో భారీగా పెంచనుంది. విజిటింగ్ వీసాపై 15 పౌండ్లు, విద్యార్థి వీసాపై అదనంగా 127 పౌండ్లు పెంచుతున్నట్లు తెలిపింది. భారతీయులు సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారికి ఇవి వర్తిస్తాయని పేర్కొంది. ఈ పెంపుదల అక్టోబర్ నాలుగో తేదీ నుంచి అమల్లోకి రానుందని స్పష్టం చేసింది. శుక్రవారం పార్లమెంట్లో హోంశాఖ ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టింది. దీని బిల్లు ప్రకారం ఆరు నెలల విజిటింగ్ వీసా ఫీజు ప్రస్తుతమున్న 100 పౌండ్ల నుంచి 115 పౌండ్ల(సుమారు రూ.12 వేలు)కు, విద్యార్థి వీసాకు ఫీజు 363 పౌండ్ల నుంచి 490 పౌండ్ల(సుమారు రూ.50 వేలు)కు పెరగనుంది. ఫీజుల పెంపు ఆరోగ్యం, సంరక్షణ వీసాతో సహా దాదాపు అన్ని రకాల వీసాలకు వర్తిస్తుంది; బ్రిటిష్ పౌరుడిగా నమోదు దరఖాస్తుకు, ఆరు నెలలు, రెండు, ఐదు, 10 సంవత్సరాల సందర్శన వీసాల ఫీజులు కూడా పెరగనున్నాయి. ఉద్యోగం, చదువుకు సంబంధించిన కొన్ని దరఖాస్తులకు సైతం ఈ పెంపు వర్తిస్తుంది. అక్టోబర్ నాలుగో తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని హోం శాఖ తెలిపింది. -
భారతీయ విద్యార్థులకు షాక్: వీసా ఫీజు భారీగా పెంపు
UK Student Visa యునైటెడ్ కింగ్డమ్ సర్కార్ భారతీయ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది. విద్యార్థి , పర్యాటక వీసాల ధరలను ఏకంగా 200 శాతం పెంచేసింది. ఈమేరకు బ్రిటన్‌ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. పార్లమెంటరీ ఆమోదం తరువాత పెంచిన ఫీజులు అక్టోబర్ 4వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ పెంపుతో ప్రభుత్వ పథకాలకు ఎక్కువ నిధుల ప్రాధాన్యతకు అవకాశం లభిస్తుందని యూఏ హోం ఆఫీస్ పేర్కొంది. దీంతో లక్షలాదిమంది భారతీయ విద్యార్థులపై భారం పడనుంది. UK హోమ్ ఆఫీస్ ప్రకటన ప్రకారం, ఆరు నెలల కంటే తక్కువ కాలానికి విజిట్ వీసా ధర 15 నుండి 115 పౌండ్లకు చేరింది. విదేశీ విద్యార్థుల నుంచి వసూల్ చేసే స్టడీ వీసా(Study Visa) ఫీజు దాదాపు 127 పౌండ్లనుంచి 490 చేరింది. అలాగే పర్యాటకులకు ఇచ్చే విజిట్ వీసా ఫీజు కూడాపెరగనుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ డేటా ప్రకారం, 2021-2022లో 120,000 కంటే ఎక్కువ మందే భారతీయ విద్యార్థులు యూకేలో చదువుతున్నారు. కాగా జూలైలో అక్కడి ప్రభుత్వం వర్క్, విజిట్ వీసాల ధరలో 15 శాతం పెరుగుదలను ప్రకటించింది. ప్రయార్టీ, స్టడీ వీసాలు, స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ల ఫీజును 20 శాతం పెంచింది. -
వినియోగదారులకు అమెజాన్ భారీ షాక్, క్రెడిట్ కార్డ్‌పై బ్యాన్
Amazon Ban Visa Credit Card.ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి 'యూకే'లో వీసా క్రెడిట్ కార్డ్‌ల వినియోగంపై నిషేదం విధించనుంది. అప్పటి వరకు ఆ క్రెడిట్ కార్డ్‌పై షాపింగ్ చేసుకోవచ్చని తెలిపింది. పర్సంటేజ్ పెరిగింది 'ఇంటర్చేంజ్'(ట్రాన్సాక్షన్‌పై చెల్లించే పర్సంటేజ్) రుసుములపై కొనసాగుతున్న యుద్ధంలో భాగంగా అమెజాన్ యూకేలోని 'వీసా' క్రెడిట్ కార్డ్‌లను బ్లాక్ చేస్తోంది. యురేపియన్ యూనియన్ చట్టాల ప్రకారం..వీసా క్రెడిట్ కార్డ్, లేదంటే డెబిట్ కార్డ్ వినియోగిస్తే.. సంబంధిత సంస్థ ఒక్కో ట్రాన్సాక్షన్‌కు 0.3 శాతం పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు యుకే ఇంటర్ చేంజ్ ఫీజ్ అని పిలిచే 0.3 శాతాన్ని 1.5శాతానికి పెంచడంపై అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంటర్ చేంజ్ ఫీజ్ ఎవరు చెల్లిస్తారు ఇంటర్ చేంజ్ ఫీజ్ అంటే ఏంటో ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఉదాహరణకు యుకేలో నివసించే సుబ్బారావ్ అమెజాన్ వెబ్సైట్లో చలికోటును వీసా క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే.. ఆ కొనుగోలుపై అమెజాన్ వీసా సంస్థకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ చేంజ్ అని పిలిచే ఈ ఫీజు వల్ల సంస్థకు నష్టం కలుగుతుందని అమెజాన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే వచ్చే ఏడాది జనవరి 19 నుంచి వీసా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లపై బ్యాన్ విధించింది. దీంతో అమెజాన్ వెబ్ సైట్లో వీసా కార్డ్‌ల ద్వారా షాపింగ్ చేసే సదుపాయం లేదని స్పష్టం చేసింది. చదవండి: భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసం పోటా పోటీ పడుతున్నారు -
బ్రిటన్ వీసా ఫీజుల పెంపు
లండన్: బ్రిటన్‌కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇది చేదువార్తే. ఎందుకంటే వీసా ఫీజులతోపాటు తప్పనిసరిగా చెల్లించాల్సిన ఆరోగ్య సేవల సర్‌చార్జి భారీగా పెరగనుంది. ఈ మేరకు బ్రిటన్ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ తన బడ్జెట్లో ప్రకటించారు. ఇప్పటివరకూ ఈ ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జి (ఐహెచ్ఎస్) ఏడాదికి 400 పౌండ్లు (రూ.38 వేలు) మాత్రమే ఉండగా.. తాజా బడ్జెట్ ప్రకారం ఇది 624 పౌండ్లు (సుమారు రూ.60 వేలు)కు చేరుకోనుంది. వలసదారులందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకే రుసుము పెంచుతున్నట్లు రిషి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బుధవారం బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం 18 ఏళ్లలోపు వారికి ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్ 470 (రూ.45 వేలు) పౌండ్లుగా ఉండనుంది. -
షెంగన్ వీసా రుసుం పెంచిన ఈయూ
న్యూఢిల్లీ: యూరప్‌లోని 26 దేశాల్లో పర్యటించడానికి అవసరమయ్యే షెంగన్ వీసా ఫీజును యూరోపియన్ యూనియన్ (ఈయూ) పెంచింది. ఇన్నాళ్లూ 60 యూరోలుగా (సుమారు రూ.4,750) ఉన్న ఫీజును 80 యూరోలకు (రూ.6,350) పెంచినట్టు ఈయూ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి ఈ కొత్త ఫీజులు అమల్లోకి వచ్చాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, స్విట్జర్లాండ్, స్పెయిన్ వంటి దేశాల పర్యటనకు షెంగన్ వీసా అవసరం. ఆర్థిక మాంద్యం కారణంగానే వీసా ఫీజుల్ని పెంచాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. వీసా ఫీజు పెంపుతో ఆయా దేశాలు వీసా ప్రక్రియను మరింత వేగవంతంగా, సులభంగా జారీ చేయడానికి అవసరమయ్యే సదుపాయాలు కల్పిస్తాయని వెల్లడించారు. యూరప్ పర్యాటకులు ఇప్పుడు ఆరు నెలల ముందుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2018లో షెంగన్ వీసా కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలింది. -
హెచ్1బీ వీసా దరఖాస్తు రుసుం పెంపు
వాషింగ్టన్: ఎంపిక ప్రక్రియ సమీక్షలో భాగం గా అమెరికా హెచ్1బీ వీసా దరఖాస్తు రుసుంను రూ. 700 (10 డాలర్లు) పెంచుతున్నట్లు అమెరికా తాజాగా ప్రకటించింది. అమెరికాలో విదేశీ నిపుణులకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ఈ వీసా ఉపయోగపడుతుంది. పెంపు ద్వారా వచ్చే నిధులను ఎంపిక ప్రక్రియను ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ చేసేందుకు వినియోగిస్తామంది. దీనివల్ల ఇమిగ్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ తెలిపారు. -
బ్రిటన్ వీసా రుసుము రెట్టింపు!
లండన్: యూరోపియన్ యూనియన్ బయటి దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే వలసదారులపై విధించే హెల్త్ సర్‌చార్జీని ఆ దేశం డిసెంబరు నుంచి రెండింతలు చేయనుంది. దీంతో భారత్ సహా పలు దేశాల నుంచి బ్రిటన్‌కు వెళ్లే పౌరులు, విద్యార్థులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వీసా ఫీజు కింద మరింత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వలస వీసాదారులు ఏడాదికి 200 (దాదాపు రూ. 19,400) పౌండ్లు, విద్యార్థి వీసా కలిగినవారు ఏడాదికి 150 (దాదాపు రూ. 14,540) పౌండ్లు సర్‌చార్జీ కింద చెల్లిస్తున్నారు. ఈ రుసుము వీసా ఫీజులో కలిపి ఉంటుంది. తాజాగా ఈ మొత్తాన్ని బ్రిటన్ రెండింతలు చేయాలని నిర్ణయించింది. దీంతో వలస వీసాదారులు 400 (దాదాపు రూ. 38,800) పౌండ్లు, విద్యార్థి వీసాదారులు 300 (దాదాపు రూ. 29,080) పౌండ్లను చెల్లించాల్సి ఉంటుంది. బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవల పథకం (ఎన్హెచ్ఎస్)కు నిధుల సమీకరణ కోసం హెల్త్ సర్‌చార్జీని 2015లో ప్రవేశపెట్టారు. తాజా పెంపు కారణంగా ఎన్హెచ్ఎస్కు ఏడాదికి 22 కోట్ల పౌండ్ల అదనపు నిధులు అందుతాయి. బ్రిటన్ పౌరులతోపాటు 6 నెలలకు పైగా ఆ దేశంలో ఉండేందుకు వీసా మంజూరైన వారంతా ఈ రుసుము చెల్లించాలి. అయితే తాజా పెంపు నుంచి యూరోపియన్ యూనియన్ దేశాల పౌరులను మినహాయించారు. వారూ చెల్లించడం సమంజసమే: మంత్రి ఆరోగ్య పథకాన్ని వలసదారులకూ వర్తింపజేస్తున్నందున వారి నుంచి ఈ పథకానికి నిధులను సేకరించడం సమంజసమేనని బ్రిటన్ వలసల శాఖ మంత్రి కరోలిన్ నోక్స్ చెప్పారు. ‘అవసరమైనప్పుడు మా ఆరోగ్యసేవల పథకం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీర్ఘకాలం బ్రిటన్‌లో ఉండే వలసదారులు ఈ సేవలను వాడుకోవడాన్ని మేం స్వాగతిస్తాం. కానీ ఇది మా దేశానికి సంబంధించినది, అంతర్జాతీయ ఆరోగ్య పథకం కాదు. వలసదారులకూ మేం ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నందున వారు కూడా ఇందుకు కొంత మొత్తం చెల్లించడం సమంజసంగా ఉంటుంది.’ అని ఆమె వివరించారు. బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తర్వాత డిసెంబరులో సర్‌చార్జీ పంపు అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన బిల్లును గురువారమే హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టారు. బ్రిటన్‌లో ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం ఉండాలనుకునే వలసదారులు.. స్వదేశానికి తిరిగొచ్చే వరకూ ఈ హెల్త్ సర్‌చార్జీని ప్రతి ఏటా చెల్లించాలి. -
బ్రిటన్ వీసా ఫీజుల పెంపు
లండన్: బ్రిటన్ ప్రభుత్వం ఈ నెల 18 నుంచి దాదాపు అన్ని రకాల వీసా ఫీజులు పెంచనుంది. షార్ట్‌టైమ్ విజిటర్స్, వర్క్, స్టడీ వీసాల ఫీజు రెండు శాతం.. నేషనాలిటీ, సెటిల్మెంట్, రెసిడెంట్ వీసా దరఖాస్తులకు 25 శాతం ఫీజు పెంచాలని జనవరిలో ప్రతిపాదించారు. ప్రతిపాదనల ప్రకారం బ్రిటన్‌లో సెటిల్మెంట్ లేదా ఐఎల్ఆర్ దరఖాస్తుదారుల ఫీజు 1,500 పౌండ్ల (సుమారు రూ. 1,42,450) నుంచి 1,875 పౌండ్ల (సుమారు రూ. 1,78,062)కు పెరగనుంది. ఇకపై ఫ్యామిలీ, స్పౌస్ వీసాలకు 1,195 పౌండ్లు (సుమారు రూ. 1,13,580) అడల్ట్ డిపెండెంట్ రిలేటివ్స్‌కు 2,676 పౌండ్లు(సుమారు రూ.2,54,462) చెల్లించాలి. కిందటేడాది బ్రిటన్‌లో నివసించేందుకు, పనిచేసేందుకు వీసాలు మంజూరైన వేలాది భారతీయులపై పెంపు ప్రభావం పడనుంది. ప్రతి ఏడాది బ్రిటన్ వీసాలు పొందేవారిలో భారతీయులే అధికంగా ఉంటారు. ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటస్టిక్స్ ప్రకారం కిందటేడాది 92,062 మందికి రెసిడెంట్, వర్క్ వీసాలు మంజూరు చేస్తే.. అందులో 57 శాతం మంది భారతీయులే. అత్యుత్తమ సేవల కోసం ఫీజులు పెంచుతున్నట్లు బ్రిటన్ వెల్లడించింది. -
భారతీయ ఉద్యోగులే లక్ష్యం?
వీసా ఫీజుల పెంపులో ఉద్దేశమేంటి? భారతీయ ఐటీ కంపెనీలేనా టార్గెట్! వాషింగ్టన్: భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఎటువైపు దారి తీస్తున్నాయి?. ఇటీవల ఇమ్మిగ్రేషన్ పేరుతో భారత విద్యార్థులను తిరిగి పంపించేశారు. అమెరికాలోని కంపెనీల్లో పనిచేసే విదేశీయులకు జారీ చేసే హెచ్1బీ, ఎల్1 వీసా ఫీజులను భారీగా పెంచారు. దీంతో అక్కడి భారత ఐటీ కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడనుంది. అమెరికా ఎందుకిలా చేస్తోంది? ఆదాయం పెంచుకోవడానినా..! భారతీయ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకా..! ఈ సాకుతో అక్కడికి వెళ్లే భారతీయుల సంఖ్యను తగ్గించేందుకేనా..? పెంచిన ఫీజు చెల్లించాల్సిందేనా.. హెచ్1బీ, ఎల్1 వీసాల జారీకి పెంచిన ఫీజులు 2015 డిసెంబర్ 18 నుంచి అమల్లోకి వస్తాయని అమెరికా పేర్కొంది. దీంతో డిసెంబర్ 18 తర్వాత ఈ వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారంతా పెంచిన ఫీజు చెల్లించాల్సి వస్తుంది. పెంచిన ఫీజులను నోటిఫై చేస్తూ అమెరికా మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. పెంచిన ఫీజు ప్రకారం హెచ్1బీ వీసాల కోసం రూ.2.7 లక్షలు, ఎల్1ఏ, ఎల్1బీ వీసాల కోసం దాదాపు రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 50 శాతం కన్నా ఎక్కువ మంది విదేశీయులు ఉన్న కంపెనీలకు ఈ ఫీజు పెంపు వర్తిస్తుంది. దీంతో అక్కడికి వెళ్లే ఉద్యోగుల నుంచి కంపెనీలు ఈ మొత్తాన్ని వసూలు చేసే అవకాశం ఉంది. పైగా ఈ ఫీజు ప్రాసెసింగ్, ఫ్రాడ్ ప్రివెన్షన్ తదితర ఫీజులకు అధికం. కాగా, తాజాగా పెంచిన ఫీజులు 2025 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. సవరించిన చట్టం ప్రకారం కనుక ఫిబ్రవరి 11 తర్వాత వచ్చిన దరఖాస్తులు లేకపోతే తిరస్కరిస్తామని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా దరఖాస్తు పత్రాలను సీఐఎస్ సవరించింది. ఇప్పటి వరకు ఏటా రూ.467 కోట్లు ఐటీ కంపెనీలు ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయని, తాజా నిర్ణయంతో దాదాపు రూ.9350 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని నాస్కాం అనే భారత్‌కు చెందిన ఐటీ కంపెనీ పేర్కొంది. -
ఏప్రిల్ నుంచి వీసా ఫీజుల మోత
ఫైలుపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు ఒబామా వాషింగ్టన్: అమెరికాలోని భారత ఐటీ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని భారీగా వడ్డించిన వీసా ఫీజులు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ బిల్లును అమెరికా చట్టసభలు ఇప్పటికే ఆమోదించగా... ఈ ఫైలుపై అధ్యక్షుడు ఒబామా శుక్రవారం సంతకం చేశారు. దీంతో హెచ్1బీ వీసాకోసం సుమారు రూ. 2.7 లక్షలు, ఎల్1 వీసా కోసం రూ. 3.2 లక్షలు చెల్లించాల్సి రానుంది. పెంచుకుంటూ పోతున్న అమెరికా..: అమెరికాలోని ఐటీ సంస్థల్లో పనిచేసేందుకు వచ్చే విదేశీ నిపుణుల కోసం హెచ్1బీ వీసాలను జారీ చేస్తారు. అసలు హెచ్1బీ దరఖాస్తు ఫీజు సుమారు రూ. 20 వేలు (325 డాలర్లు). 2005లో ‘ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ ఫీజు’ పేరుతో రూ. 33,000 (500 డాలర్లు) వడ్డించారు. ఆ తర్వాత ‘ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ ఫీజు’ పేరిట 25 మందికంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలకు హెచ్1బీ వీసాపై సుమారు రూ. లక్ష (1,500 డాలర్లు) ఫీజు విధించారు. తాజాగా ప్రత్యేక ఫీజును సుమారు రూ. 3 లక్షలకు పెంచింది. ఇక వీటన్నింటికీ తోడు హెచ్1బీ వీసాల దరఖాస్తులను 15 రోజుల్లోపే పరిశీలించేందుకు రూ. 80 వేలు (1,225 డాలర్లు) వసూలు చేస్తుంది. వీటన్నింటికి తోడు వీసా దరఖాస్తులను ఫైలింగ్ చేసేందుకూ రూ. 60 వేల నుంచి రూ. లక్ష దాకా చెల్లించాల్సిందే. అంటే మొత్తంగా భారత కంపెనీలు ఒక్కో హెచ్1బీ వీసా కోసం రూ. 6 లక్షలు కట్టాలి. -
ఐటీ కంపెనీలపై వీసా ఫీజుల మోత
హెచ్1బీ, ఎల్1 వీసాలపై రూ. 3 లక్షల ప్రత్యేక ఫీజు విధించిన అమెరికా పదేళ్ల పాటు అమలు! * భారత కంపెనీలపై ఏటా రూ. 10 వేల కోట్ల భారం వాషింగ్టన్: అమెరికాకు ఉద్యోగులను తీసుకెళ్లే భారత ఐటీ సంస్థలే లక్ష్యంగా ఆ దేశం హెచ్1బీ, ఎల్1 వీసాలపై స్పెషల్ ఫీజును భారీగా పెంచింది. హెచ్1బీ వీసాపై సుమారు రూ. 2.6 లక్షలు(4,000 డాలర్లు), ఎల్1 వీసాపై దాదాపు రూ. 3.2 లక్షలు(4,500 వేల డాలర్లు) ప్రత్యేక ఫీజు విధిస్తూ అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. పదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ ఫీజు.. 50 మందికిపైగా ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో సగం మందికిపైగా హెచ్1బీ, ఎల్1 వీసాలు ఉన్న ఉద్యోగులు ఉంటే వర్తిస్తుంది. ఈ లెక్కన అమెరికాలోని భారత ఐటీ కంపెనీలన్నీ ఈ నిబంధన కిందకు వస్తాయి. 2010 నుంచి 2015 వరకు ఒక్కో వీసాపై వసూలు చేసిన ఈ ప్రత్యేక ఫీజు దాదాపు రూ. 1.3 లక్షలే కావడం గమనార్హం. నాస్కామ్ అంచనా ప్రకారం భారత ఐటీ కంపెనీలు ఇప్పటివరకు అమెరికాకు ఏటా సుమారు రూ. 5వేల కోట్లు చెల్లిస్తున్నాయి. తాజా పెంపుతో ఏటా రూ. 10 వేల కోట్లకు పైగా కట్టాల్సిరావచ్చు. -
విషాదానికి వీసా ఫీజులుండవు!
ఒక్క విషాదం.... దేశాలను కలిపింది. కన్నీరు, కష్టాలు పంచుకునేలా చేసింది. ఒకరి భుజంపై మరొకరు చేయి వేసి ఊరడించేలా చేసింది. అవును .... మలేషియా ఎయిర్ లైన్స్ విమాన ప్రమాదం విషాదంలో అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా, పాకిస్తాన్ నుంచి భారత్ దాకా, కౌలాలంపూర్ నుంచి బీజింగ్ దాకా అందరినీ కలిసికట్టుగా విమాన శకలాల కోసం అన్వేషించేలా చేసింది. (ఆ విమానం సముద్రంలో కూలింది) ఆస్ట్రేలియాకు దగ్గర్లో సముద్రసమాధిలో ఎక్కడో ఎవరికీ తెలియకుండా నిద్రిస్తున్న మలేషియన్ విమానంలో అంతిమ యాత్ర చేసిన తమ వారి కోసం వచ్చే బంధువులందరికీ సానుభూతితో స్వాగతం పలుకుతున్నామని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబట్ ప్రకటించారు. (హిందూ మహా సముద్రంలో విమాన శకలాలు) ఈ విషాద సమయంలో మిమ్మల్ని గుండెలకు హత్తుకునేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. వారి నుంచి ఎలాంటి వీసా ఫీజులు వసూలు చేయబోమని కూడా ఆయన ప్రకటించారు. ప్రధానికి విపక్ష నేత బిల్ షార్టెన్ కూడా పూర్తి మద్దతు పలికారు. (వీడిన మలేషియా విమానం మిస్టరీ) -
16 నుంచి ఆన్లైన్లోనే బ్రిటన్ వీసా ఫీజు
న్యూఢిల్లీ: బ్రిటన్ వీసా పొందాలనుకునే భారతీయులు ఈనెల 16 నుంచి వీసా ఫీజును ఆన్లైన్లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారానే చెల్లించాల్సి ఉం టుంది. వీసా లేదా మాస్టర్‌కార్డ్ చిహ్నం ఉన్న డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా లేదా ఈ-వాలెట్ (స్క్రిల్) ద్వారా ఈ చెల్లింపులు జరపాలి. వీసా దరఖాస్తు కేంద్రాల్లో ఇప్పటివరకూ అమల్లో ఉన్న నగదు లేదా డీడీలు తీసుకొనే విధానానికి స్వస్తి పలకాలని బ్రిటన్ నిర్ణయించడమే ఇందుకు కారణం. వీసా దరఖాస్తుల విధానాన్ని క్రమబద్దీకరించే చర్యల్లో భాగంగానే ఈ చర్య చేపట్టారు.