న్యూఢిల్లీ: యూరప్‌లోని 26 దేశాల్లో పర్యటించడానికి అవసరమయ్యే షెంగన్ వీసా ఫీజును యూరోపియన్ యూనియన్ (ఈయూ) పెంచింది. ఇన్నాళ్లూ 60 యూరోలుగా (సుమారు రూ.4,750) ఉన్న ఫీజును 80 యూరోలకు (రూ.6,350) పెంచినట్టు ఈయూ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి ఈ కొత్త ఫీజులు అమల్లోకి వచ్చాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, స్విట్జర్లాండ్, స్పెయిన్ వంటి దేశాల పర్యటనకు షెంగన్ వీసా అవసరం. ఆర్థిక మాంద్యం కారణంగానే వీసా ఫీజుల్ని పెంచాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. వీసా ఫీజు పెంపుతో ఆయా దేశాలు వీసా ప్రక్రియను మరింత వేగవంతంగా, సులభంగా జారీ చేయడానికి అవసరమయ్యే సదుపాయాలు కల్పిస్తాయని వెల్లడించారు. యూరప్ పర్యాటకులు ఇప్పుడు ఆరు నెలల ముందుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2018లో షెంగన్ వీసా కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలింది.
Comments
Please login to add a commentAdd a comment