economic shutdown
-
షెంగన్ వీసా రుసుం పెంచిన ఈయూ
న్యూఢిల్లీ: యూరప్‌లోని 26 దేశాల్లో పర్యటించడానికి అవసరమయ్యే షెంగన్ వీసా ఫీజును యూరోపియన్ యూనియన్ (ఈయూ) పెంచింది. ఇన్నాళ్లూ 60 యూరోలుగా (సుమారు రూ.4,750) ఉన్న ఫీజును 80 యూరోలకు (రూ.6,350) పెంచినట్టు ఈయూ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి ఈ కొత్త ఫీజులు అమల్లోకి వచ్చాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, స్విట్జర్లాండ్, స్పెయిన్ వంటి దేశాల పర్యటనకు షెంగన్ వీసా అవసరం. ఆర్థిక మాంద్యం కారణంగానే వీసా ఫీజుల్ని పెంచాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. వీసా ఫీజు పెంపుతో ఆయా దేశాలు వీసా ప్రక్రియను మరింత వేగవంతంగా, సులభంగా జారీ చేయడానికి అవసరమయ్యే సదుపాయాలు కల్పిస్తాయని వెల్లడించారు. యూరప్ పర్యాటకులు ఇప్పుడు ఆరు నెలల ముందుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2018లో షెంగన్ వీసా కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలింది. -
బిజినెస్ బేకార్
-
ఆర్థిక షట్‌డౌన్ పొంచి ఉంది: ఒబామా హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా బడ్జెట్ ఆమోదంలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించకపోతే ఆర్థిక వ్యవస్థ కూడా స్తంభించిపోయే (ఎకనామిక్ షట్‌డౌన్) ప్రమాదం పొంచి ఉందని అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. దానిని తప్పించాలని, బడ్జెట్ ఆమోదానికి రిపబ్లికన్లను ఒప్పించాలని వారాంతపు సందేశంలో కాంగ్రెస్ సభ్యుల్ని కోరారు. ఒబామాకేర్ ఆరోగ్యబిల్లుపై ఏర్పడిన సంక్షోభంతో మొదలైన ప్రభుత్వ షట్‌డౌన్ 12వ రోజుకు చేరుకుంది. రుణపరిమితి పెంపు గడువు అక్టోబర్ 17 కూడా సమీపిస్తోంది. అయినా అధికార, ప్రతిపక్షాల మధ్య సంక్షోభ నివారణపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీనిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఒబామా తన సందేశంలో పేర్కొన్నారు. మరోపక్క షట్‌డౌన్‌తో మూతపడిన జాతీయ పార్కులు, పర్యాటక స్థలాలను రాష్ట్రాల ఆర్థిక సాయంతో తాత్కాలికంగా తిరిగి తెరవనున్నారు.