europe tour
-
వినూత్న విదేశాంగ విధానం
నలుగురు నడిచిన బాటలో నడవటం, సంప్రదాయంగా వస్తున్న విధానాలను అనుసరించటం శ్రేయస్కరమని చాలామంది అనుకొనేదే. కొత్త ప్రయోగాలకు దిగితే ఏం వికటిస్తుందోనన్న సంశయమే ఇందుకు కారణం. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించిన తాజా యూరోప్ పర్యటన మన విదేశాంగ విధానం కొత్త మలుపు తిరిగిన వైనాన్ని వెల్లడించింది. ఇది మంచిదా, కాదా అన్నది మున్ముందు తేలుతుంది. అయితే తాము ఎవరికీ దగ్గరా కాదు... దూరమూ కాదని అటు రష్యాకూ, ఇటు పాశ్చాత్య దేశాలకూ మనం చెప్పినట్టయింది. ఒక రకంగా ఇది ప్రచ్ఛన్న యుద్ధ దశలో మన దేశం అనుసరించిన అలీన విధానాన్ని గుర్తుకుతెస్తుంది. మోదీ రెండు రోజులు పోలెండ్‌లో పర్యటించారు. అధ్యక్షుడు ఆంద్రెజ్ దుదాతో సమావేశమయ్యారు శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపారు. ఇవి రివాజులో భాగంగా సాగిన పర్యటనలు కాదు. మన దేశ ప్రధాని ఒకరు పోలెండ్‌ను సందర్శించటం గత నలభై అయిదేళ్లలో ఇదే తొలిసారి. 1955లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, 1967లో ఇందిరా గాంధీ, 1979లో మొరార్జీ దేశాయ్ ఆ దేశంలో పర్యటించారు. కానీ అప్పటికది సోవియెట్ యూనియన్ ఛత్రచ్ఛాయలో ఏర్పడ్డ వార్సా సైనిక కూటమిలో భాగం. అయితే, 1991లో సోవియెట్ యూనియన్ కుప్పకూలడానికి చాలా ముందే పోలెండ్ బాట మార్చింది. సోవియెట్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన నాటో కూటమి దేశాలకు చేరువైంది. 1999లో నాటోలో చేరింది. 2004లో యూరొపియన్ యూనియన్ (ఈయూ)లో భాగమైంది. ఆ తర్వాత మరెప్పుడూ మన ప్రధానులు ఆ దేశాన్ని సందర్శించ లేదు. ఇక సోవియెట్‌లో ఒకప్పుడు భాగమైన ఉక్రెయిన్ 26 ఏళ్ల క్రితం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. పాశ్చాత్య దేశాల సలహాతో తన అణ్వస్త్రాలను స్వచ్ఛందంగా వదులుకుంది. భిన్న సందర్భాల్లో వాటి మనోభావాలకు తగినట్టు తన విధానాలను తీర్చిదిద్దుకుంది. వాజపేయి హయాంలో మన దేశం నిర్వహించిన అణు పరీక్షలను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేసింది. మన కశ్మీర్ విధానాన్ని ఖండిస్తూ వచ్చింది. పాకిస్తాన్‌కు శతఘ్నులు విక్రయించింది. రెండు దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలు మూడో దేశానికి వ్యతిరేకమని భావించటం మూర్ఖత్వమే అవుతుంది. అలాంటి మూర్ఖత్వాన్ని ఈమధ్య అమెరికాతో పాటు ఉక్రెయిన్ కూడా ప్రదర్శించింది. జూలై రెండో వారంలో మోదీ రష్యాలో పర్యటించినప్పుడు జెలెన్స్కీ ట్విటర్ వేదికగా భారత్‌ను విమర్శించారు. నెత్తురంటిన పుతిన్‌తో ఎలా కరచాలనం చేస్తారని మోదీని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నేరగాడిని హత్తుకోవటం విచారకరమన్నారు. ఆ సమయంలో మోదీ తమ దేశంలో ఉన్నారన్న సంగతిని కూడా విస్మరించి కియూవ్‌లో పిల్లల ఆస్పత్రిపై రష్యా బలగాలు దాడి చేసిన మాట వాస్తవమే. అయితే ఆ ఉదంతాన్ని పుతిన్ సమక్షంలోనే మోదీ ఖండించారు. అయినా జెలెన్స్కీకి అది సరిపోలేదు. తాము రష్యాతో యుద్ధం చేస్తున్నాం గనుక ప్రపంచమంతా దాన్ని దూరం పెట్టాలన్న వైఖరిని ప్రదర్శించారు. ఇది తెలివితక్కువతనం. భారత్–రష్యా సంబంధాల సంగతే తీసుకుంటే రష్యా అనేక కారణాల వల్ల పాకిస్తాన్‌కు ఆయుధ విక్రయంపై ఉన్న ఆంక్షలను పదేళ్లక్రితం సడలించింది. దూరశ్రేణి క్షిపణులు, ఇతర రక్షణ పరికరాలు అందజేసింది. ఎంఐ–26 సైనిక రవాణా హెలికాప్టర్లను సమకూర్చుకోవటానికి సాయం అందజేసింది. మనకు ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాలు విక్రయించినప్పుడల్లా సమతూకం పాటించే నెపంతో పాకిస్తాన్‌కు కూడా అమ్మకాలు సాగించటం రష్యా నేర్చుకుంది. చైనాతో దాని సంబంధాలు సరేసరి. ఇలా మనకు బద్ధ వ్యతిరేకమైన రెండు దేశాలతో రష్యా సంబంధాలు నెరపుతున్నప్పుడు మనం మాత్రం తమతోనే ఉండాలని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ కోరుకోవటం అర్థరహితం.రష్యా – ఉక్రెయిన్ల మధ్య మూడేళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ఆపటానికి ఒక తటస్థ దేశంగా భారత్ కృషి చేయాలని చాలా దేశాలు ఆశపడుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను మన దేశం ఖండించలేదు. రష్యాను విమర్శిస్తూ తీసుకొచ్చిన తీర్మానాలపై వోటింగ్ సమయంలో మన దేశం గైర్హాజరైంది. అయితే యుద్ధ క్షేత్రంలో కాక చర్చలతో, దౌత్యంతో మాత్రమే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని వివిధ అంతర్జాతీయ వేదికలపై మోదీ ఈ మూడేళ్లుగా చెబుతూ వచ్చారు. ఇరు దేశాలూ చర్చలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. సరిగ్గా నాటో 75 యేళ్ల ఉత్సవాల సందర్భంలో రష్యా పర్యటనను ఎంచుకున్నందుకు అమెరికా ఆగ్రహించింది. అయితే ఎడతెగకుండా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకడమెలా అన్నది దానికి బోధపడటం లేదు. తన మద్దతుతో, పాశ్చాత్య దేశాల సహకారంతో 3, 4 నెలల్లో రష్యాను ఉక్రెయిన్ అవలీలగా జయిస్తుందన్న భ్రమ మొదట్లో అమెరికాకు ఉంది. కానీ రోజులు గడిచేకొద్దీ అది కొడిగట్టింది. నిరుడు ఫిబ్రవరిలో శాంతి సాధన పేరుతో చైనా ఒక ప్రతిపాదన చేసింది. కానీ అందులో రష్యావైపే మొగ్గు కనబడుతోందన్న విమర్శలొచ్చాయి. పైపెచ్చు చైనా అధికారిక మీడియా మొదటి నుంచీ రష్యాను వెనకేసుకొస్తోంది. ఇలాంటి సమయంలో భారత్ దౌత్యంపై ఆశలేర్పడటం సహజం. అయితే పరస్పరం తలపడుతున్న వైరి పక్షాలు మానసికంగా చర్చలకు సిద్ధపడితే తప్ప ఎవరి ప్రయత్నాలైనా ఫలించే అవకాశాలుండవు. ముఖ్యంగా ఈ యుద్ధంలోని నిరర్థకతను రష్యాతో పాటు అమెరికా, యూరొప్ దేశాలు గుర్తించాల్సివుంది. ఆ తర్వాతే ఉక్రెయిన్ దూకుడు తగ్గుతుంది. ఆ మాటెలావున్నా మోదీ పర్యటన మన విదేశాంగ విధానానికి కొత్త బాట పరిచింది. -
యూరప్ పర్యటనలో రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ యూరప్‌లో వారంపాటు పర్యటించనున్నారు. మంగళవారమే ఆయన భారత్ నుంచి బయల్దేరారు. సెప్టెంబర్ ఏడున బ్రస్సెల్స్‌లో యురోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్లతో రాహుల్ భేటీ అవుతారు. ఆ తర్వాత అక్కడే కొందరు ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. తర్వాతి రోజు ఉదయం కొందరు భారతీయ పారిశ్రామికవేత్తలతో భేటీ జరగనుంది. మధ్యా హ్నం పత్రికా సమావేశంలో పాల్గొంటారు. తర్వాత ఆయన పారిస్‌కు చేరుకుని సెపె్టంబర్ ఎనిమిదో తేదీన మరో పత్రికా సమావేశంలో పాల్గొంటారు. సెపె్టంబర్ తొమ్మిదో తేదీన ఫ్రాన్స్ పార్లమెంటేరియన్లతో ముచ్చటిస్తారు. తర్వాత అక్కడి సైన్స్ పొ విశ్వవిద్యాలయం విద్యార్థులతో మాట్లాడతారు. సెపె్టంబర్ పదో తేదీన రాహుల్ నెదర్లాండ్స్‌కు వెళ్తారు. 400 ఏళ్ల నాటి లీడెన్ యూనివర్సిటీలో పర్యటించి అక్కడి విద్యార్థులతో మాట్లాడతారు. సెప్టెంబర్ 11వ తేదీన నార్వేకు వెళ్తారు. ఓస్లోలో ఆ దేశ పార్లమెంటేరియన్లతో సమావేశమవుతారు. తర్వాత అక్కడి ప్రవాస భారతీయులతో, ఓస్లో వర్సిటీ విద్యార్థులతోనూ మాట్లాడతారు. సెప్టెంబర్ 12వ తేదీన రాత్రి రాహుల్ భారత్‌కు తిరుగుపయనమవుతారు. -
టూర్లకు డిమాండ్.. హైదరాబాద్ నుంచి పారిస్, లండన్, స్విట్జర్లాండ్‌కు
సాక్షి, హైదరాబాద్: వేసవి టూర్లకు డిమాండ్ పెరిగింది. సాధారణంగా వేసవి సెలవుల్లో దుబాయ్, శ్రీలంక, థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపే నగరవాసులు ఈ ఏడాది యూరప్‌కు ఎక్కువగా తరలి వెళ్తున్నారు. గత రెండు నెలలుగా హైదరాబాద్ నుంచి యూరప్ దేశాలకు వెళ్తున్న పర్యాటకుల సంఖ్య పెరిగినట్లు పర్యాటక సంస్థల నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా నిలిచిపోయిన అంతర్జాతీయ రాకపోకలు ఈ సారి గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్ నుంచి పలు దేశాలకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో నగరవాసులకు ఊరట లభించింది. వివిధ దేశాలకు వెళ్లే పర్యాటకుల రద్దీ పెరగడంతో టూర్ ఆపరేటర్లు, పర్యాటకసంస్థలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న పర్యాటకులు అక్కడి నుంచి పారిస్, స్విట్జర్లాండ్, వెనీస్, ఆస్ట్రియా, ఇటలీ, జర్మనీ, తదితర దేశాలను సందర్శిస్తున్నారు. ఒకే పాస్‌పోర్టుపైన ఎక్కువ దేశాల్లో పర్యటించేందుకు అవకాశం లభించడం వల్ల కూడా నగరవాసులు యూరప్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. అద్భుతమైన పర్యాటక నగరంగా పేరొందిన పారిస్‌కు ఈ ఏడాది అనూహ్యమైన డిమాండ్ ఉన్నట్లు టూర్ ఆపరేట్లు చెబుతున్నారు. మరోవైపు ఇటలీలోని పురాతన నగరాలు, చారిత్రక కట్టడాలను సందర్శించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ‘పర్యాటకుల డిమాండ్ పెరగడంతో వీసాలు లభించడం కూడా కష్టంగా మారింది. కనీసం నెల రోజులు ముందే స్లాట్ బుక్ చేసుకొవలసి వస్తుంది.’ అని ప్రముఖ సంస్థకు చెందిన నిర్వాహకులు ఒకరు తెలిపారు. చదవండి: Photo Feature: సినిమా చూపిస్త మామా! చార్జీలకు రెక్కలు... రెండేళ్ల నష్టాలను పూడ్చుకొనేందుకు ఎయిర్‌లైన్స్ బారులు తీరాయి. కోవిడ్ నిబంధనల సడలింపుతో మొదట పరిమితంగా సర్వీసులను ఏర్పాటు చేసిన సంస్థలు క్రమంగా వివిధ ప్రాంతాల నుంచి విమాన సర్వీసులను పెంచాయి. ప్రయాణికుల రద్దీ పెరగడంతో విమాన చార్జీలకు సైతం రెక్కలొచ్చాయి. యూరప్ దేశాలకు సర్వీసులను నడుపుతున్న పలు ఎయిర్‌లైన్స్ 20 శాతం నుంచి 22 శాతం వరకు చార్జీలు పెంచాయి.అలాగే హోటళ్లు, స్థానిక రవాణా చార్జీలు కూడా కోవిడ్ అనంతరం పెరిగాయి. దీంతో నగరానికి చెందిన టూర్ ఆపరేటర్లు సైతం ప్యాకేజీ చార్జీలను అమాంతంగా పెంచారు. గతంలో రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ప్యాకేజీ ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.1.5 లక్షల వరకు పెరిగింది. కోవిడ్ అనంతరం అన్ని ధరలు పెరగడమే ఇందుకు కారణమని ప్రముఖ పర్యాటక సంస్థ నిర్వాహకులు అన్సారీ పేర్కొన్నారు. నకిలీ ఏజెంట్లను నమ్మొద్దు టూర్ ప్యాకేజీల ఎంపిక సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్లో కనిపించే ప్యాకేజీలను నమ్మరాదు. తెలిసిన సంస్థల వద్దకు స్వయంగా వెళ్లి అన్ని వివరాలు తెలుసుకొని సంతృప్తి చెందిన తరువాత మాత్రమే ప్యాకేజీలు బుక్ చేసుకోవాలి. – వాల్మీకి హరికిషన్, ప్రముఖ టూర్ ఆపరేటర్ -
భారత్‌లో అవకాశాలు అపారం
కోపెన్హగెన్/పారిస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్ పర్యటన బుధవారం మూడోరోజుకు చేరుకుంది. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగెన్‌లో నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్‌ల్యాండ్ దేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్–ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని నార్డిక్ దేశాల పెట్టుబడిదారులను కోరారు. భారత కంపెనీలతో జట్టుకట్టాలన్నారు. ప్రధానంగా టెలికాం, డిజిటల్ రంగాల్లో అద్భుత అవకాశాలు ఎదురు చూస్తున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ తొలుత నార్వే ప్రధాని జోనాస్ గాహ్ర్‌స్టోర్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తొలిభేటీ ఇదే కావడం విశేషం. బ్లూ ఎకానమీ, క్లీన్ ఎనర్జీ, స్పేస్ హెల్త్‌కేర్ తదితర కీలక అంశాలపై జోనాస్‌తో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు మోదీ ట్వీట్ చేశారు. భారత్ ఇటీవల ప్రకటించిన ఆర్కిటిక్ పాలసీలో నార్వే ఒక మూలస్తంభం అని కొనియాడారు. స్వీడన్ ప్రధానమంత్రి మాగ్డలినా ఆండర్సన్, ఐస్‌ల్యాండ్ ప్రధానమంత్రి కాట్రిన్ జాకబ్స్‌డాటిర్, ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్‌తోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాలుగు దేశాల ప్రధానులతో సంతృప్తికరమైన చర్చలు జరిగినట్లు మోదీ వెల్లడించారు. రెండో ఇండియా–నార్డిక్ సదస్సు కోపెన్‌హగెన్‌లో బుధవారం నిర్వహించిన రెండో ఇండియా–నార్డిక్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఫిన్లాండ్, ఐస్‌ల్యాండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్ ప్రధానమంత్రులు పాల్గొన్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, పరిణామాలు, ప్రపంచంపై దాని ప్రతికూల ప్రభావాలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఉక్రెయిన్‌లో కొనసాగతున్న సంక్షోభం, సామాన్య ప్రజల అగచాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల మరణాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పౌరులు క్షేమంగా బయటకు వెళ్లేందుకు, సురక్షిత ప్రాంతాలకు చేరుకొనేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్, రష్యాను కోరారు. ప్రపంచంలో చాలాదేశాలు ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం నడుచుకోవడం లేదని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం లేదని ప్రధానమంత్రులు ఆక్షేపించారు. ఉక్రెయిన్‌పై చట్టవిరుద్ధంగా రష్యా సేనలు సాగిస్తున్న దాడులను నిరసిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటనలో వెల్లడించారు. నిబంధనల ఆధారిత ఇంటర్నేషనల్ ఆర్డర్‌కు తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం సంస్కరణలు చేపట్టాలని కోరారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లోనూ సంస్కరణలు అవసరమన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని, అందుకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని నార్డిక్ దేశాల అధినేతలు ఉద్ఘాటించారు. పారిస్‌లో మాక్రాన్‌తో భేటీ ప్రధాని బుధవారం సాయంత్రం ఫ్రాన్స్ చేరుకున్నారు. పారిస్‌లో ల్యాండయ్యానంటూ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక, వ్యూహాత్మక అంశాలపై చర్చించుకున్నారు. -
మీ రక్షణ మా బాధ్యత
వార్సా: ‘‘మీ రక్షణ మా బాధ్యత. రష్యా ఒకవేళ దాడికి దిగితే మేం రక్షిస్తాం. మీ స్వేచ్ఛకు మాది పూచీ’’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్‌కు హామీ ఇచ్చారు. నాలుగు రోజుల యూరప్ పర్యటన ముగింపు సందర్భంగా పోలండ్ అధ్యక్షుడు ఆంద్రె డూడాతో ఆయన భేటీ అయ్యారు. నాటో కూటమిని విడదీయాలన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలలు కల్లలుగానే మిగిలాయని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ శరణార్థులకు భారీ సంఖ్యలో ఆశ్రయమిచ్చిందంటూ పోలండ్‌ను కొనియాడారు. శరణార్థులను ఆదుకుంటున్న పోలండ్‌కు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అదనంగా లక్ష మంది ఉక్రెయిన్ వాసులకు తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తామని ఉద్ఘాటించారు. పుతిన్ ఓ నరహంతకుడు వార్సాలో ఉక్రెయిన్ శరణార్థుల శిబిరాన్ని బైడెన్ సందర్శించారు. గంటపాటు శరణార్థులతో మాట్లాడారు. వారి కష్టాలు విని చలించిపోయారు. పుతిన్ నరహంతకుడంటూ మండిపడ్డారు. పుతిన్ దాష్టీకాల వల్ల వేలాది మంది మహిళలు, పిల్లలు పొరుగు దేశాల్లో తలదాచుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శిబిరాల్లో చిన్నారులను చూస్తే మనసు ద్రవిస్తోందన్నారు. పోలండ్‌కు 20 లక్షల మంది ఉక్రెయిన్‌తో పోలండ్ దేశం 300 మైళ్ల సరిహద్దును పంచుకుంటోంది. 35 లక్షల మంది ఉక్రెయిన్ శరణార్థుల్లో 20 లక్షల మంది పోలండ్‌కు చేరుకున్నారు. వారికి స్వచ్ఛంద సంస్థలు, పలు దేశాలు నిత్యావసరాలు పంపిస్తున్నాయి. -
ఈయూతో బంధం పదిలం
రోమ్: యూరోపియన్ యూనియన్(ఈయూ), భారత్ మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. జి–20 సదస్సులో పాల్గొనడానికి యూరప్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇటలీలోని రోమ్‌లో ఈయూ అత్యున్నత అధికారులతో సమావేశమై చర్చలు జరిపారు. కోవిడ్–19 మహమ్మారి విసురుతున్న సవాళ్లు, ఈయూ–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం, అఫ్గానిస్తాన్, ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్యం, వాణిజ్యం, సంస్కృతి, పర్యాటకం తదితర రంగాల్లో భారత్, ఈయూ మధ్య బంధాన్ని మరింత సుదృఢం చేసుకోవాలని నిర్ణయించారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిషెల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లెయన్‌తో లోతైన చర్చలు జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది. ఆర్థిక రంగంలో సహకారంతో పాటు, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలను పెంచి, మెరుగైన సమాజాన్ని స్థాపించడానికి కృషి చేయాలని ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చినట్టుగా పేర్కొంది. మరోవైపు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ పచ్చదనం నెలకొల్పడంలో భారత్ కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో పట్టు కోసం చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ అభిప్రాయాలను గౌరవిస్తామని ఈయూ హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ శనివారం నుంచి జి–20 భేటీకి రానున్నారు. మోదీకి ఈయూ అభినందనలు భారత్‌లో తక్కువ వ్యవధిలోనే 100 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినందుకు గాను ప్రధాని మోదీని ఈయూ అధికారులు అభినందించారు. ఆయనను కలుసుకోవడం ఆనందంగా ఉందని, ఇరుపక్షాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం సరైన పట్టాలు ఎక్కిందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు లెయెన్ పేర్కొన్నారు. జాతిపితకు ప్రధాని నివాళులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోమ్‌లో శుక్రవారం భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘‘ఎవరి ఆదర్శాలైతే ప్రజల్లో ధైర్య సాహసాలను నింపుతాయో, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తాయో అలాంటి మహాత్ముడికి రోమ్‌లో నివాళులర్పించే అరుదైన అవకాశం నాకు లభించింది’’ అని మోదీ అనంతరం ట్విట్టర్లో పేర్కొన్నారు. అనంతరం ప్రధాని రోమ్‌లో ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు మోదీకి డ్రాఘీ ఘన స్వాగతం పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. -
షెంగన్ వీసా రుసుం పెంచిన ఈయూ
న్యూఢిల్లీ: యూరప్‌లోని 26 దేశాల్లో పర్యటించడానికి అవసరమయ్యే షెంగన్ వీసా ఫీజును యూరోపియన్ యూనియన్ (ఈయూ) పెంచింది. ఇన్నాళ్లూ 60 యూరోలుగా (సుమారు రూ.4,750) ఉన్న ఫీజును 80 యూరోలకు (రూ.6,350) పెంచినట్టు ఈయూ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి ఈ కొత్త ఫీజులు అమల్లోకి వచ్చాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, స్విట్జర్లాండ్, స్పెయిన్ వంటి దేశాల పర్యటనకు షెంగన్ వీసా అవసరం. ఆర్థిక మాంద్యం కారణంగానే వీసా ఫీజుల్ని పెంచాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. వీసా ఫీజు పెంపుతో ఆయా దేశాలు వీసా ప్రక్రియను మరింత వేగవంతంగా, సులభంగా జారీ చేయడానికి అవసరమయ్యే సదుపాయాలు కల్పిస్తాయని వెల్లడించారు. యూరప్ పర్యాటకులు ఇప్పుడు ఆరు నెలల ముందుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2018లో షెంగన్ వీసా కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలింది. -
బానిసనయ్యాను అందుకే దూరంగా ఉంటున్నాను
ప్రతి విషయం గురించి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే నటి, బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ స్వర భాస్కర్ కొద్ది రోజులుగా కనిపించడం లేదు.. అంటే ట్విటర్లో కనిపించడం లేదని. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. నిఖచ్చిగా మాట్లాడుతూ.. నెటిజన్ల విమర్శలు ఎదుర్కొనే స్వర భాస్కర్ కొద్ది రోజులుగా ట్విటర్లో కనిపించడం లేదు. దాంతో ట్రోలర్స్‌కి భయపడి స్వర తన ట్విటర్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేసిందనే వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై స్వయంగా స్పందించారు స్వర భాస్కర్. ‘ప్రస్తుతం నేను యూరోప్ టూర్లో ఉన్నాను. వచ్చేవారం ఇండియాకు తిరిగి వస్తాను. ఈ సెలవులను ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. అంతేకాక ఈ మధ్య నేను ట్విటర్‌కు బాగా అడిక్ట్ అయినట్లు అన్పిస్తోంది.అందుకే ట్విటర్‌కు దూరంగా ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని తెలిపారు. కానీ గాసిప్ రాయుళ్లు మాత్రం ‘ఈ 30 ఏళ్ల నటి నోటికి అడ్డు అదుపూ లేకుండా మాట్లాడ్తది. దాంతో స్వరకు, ఆమె హేటర్స్‌కు మధ్య ఇప్పటికే చాలాసార్లు గొడవలు జరిగాయి. వీటన్నింటి దృష్టిలోపెట్టుకునే స్వర ప్రస్తుతం ట్విటర్‌కు దూరంగా ఉంటుందనే’ వార్తలను ప్రచారం చేస్తున్నారు. కానీ స్వర మాత్రం ఈ వార్తలు వాస్తవం కాదంటున్నారు. ప్రస్తుతం స్వర ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్లలో యాక్టీవ్‌గానే ఉన్నారు. -
‘ఇన్నేళ్ల తరువాత ఒప్పుకుంది’
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కుటుంబంతో కలిసి యూరప్ టూర్లో ఉన్నారు. టూర్‌కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు షారూఖ్. ఇటీవలలో ఆర్యన్, అబ్రామ్లు దిగిన ఫోటో, స్పెయిన్‌లో సుహానా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఆసక్తికర ఫోటోను ట్వీట్ చేశాడు షారూఖ్. తన భార్య గౌరీఖాన్‌తో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసిన షారూఖ్ ‘ఇన్నేళ్ల తరువాత నేను తీసిన ఫోటోను పోస్ట్ చేసేందుకు ఒప్పుకుంది’ అంటూ కామెంట్ చేశారు. జీరో షూటింగ్ పూర్తి చేసిన షారూఖ్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. After years the wife has allowed me to post a pic I have taken...she’s @gaurikhan all heart! pic.twitter.com/QfAJajRlim — Shah Rukh Khan (@iamsrk) 7 July 2018 -
విజయంతో ముగించారు
ఆస్ట్రియాపై 4–3తో నెగ్గిన భారత్ అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): తమ యూరోప్ పర్యటనను భారత హాకీ జట్టు విజయవంతంగా ముగించింది. గురువారం ఆస్ట్రియాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో టీమిండియా 4–3తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ (25వ, 32వ నిమిషాల్లో), చింగ్లెన్సన సింగ్ (37వ, 60వ నిమిషాల్లో) రెండేసి గోల్స్‌తో చెలరేగారు. టూర్ ఆరంభంలో బెల్జియం చేతిలో వరుసగా రెండు పరాజయాలు ఎదురైనా... ఆ తర్వాత ప్రపంచ నాలుగో ర్యాంకర్ నెదర్లాండ్స్‌పై భారత్ రెండు విజయాలు సాధించి సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
యూరప్ పర్యటనకు రాహుల్
-
యూరప్ పర్యటనకు రాహుల్
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. కొన్ని రోజుల పాటు యూరప్‌లో పర్యటించనున్నట్టు సోమవారం రాహుల్ ట్వీట్ చేశారు. కాగా రాహుల్ గాంధీ యూరప్ ఎప్పుడు బయల్దేరేది, ఏ దేశానికి వెళ్తారన్న విషయాలు వెల్లడించలేదు. రాహుల్ ముందస్తుగా మూడు రోజుల ముందే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని రాహుల్ ఆకాంక్షించారు. రాహుల్ ముందస్తుగా శుభాకాంక్షలు తెలపడాన్ని బట్టి కొత్త సంవత్సర వేడుకలను యూరప్‌లో చేసుకునే అవకాశముంది. -
భారత్ క్లీన్‌స్వీప్
వాటిగినెస్ (ఫ్రాన్స్) : యూరోప్ పర్యటనలో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు ఫ్రాన్స్ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలి మ్యాచ్‌లో 2-0తో నెగ్గిన సర్దార్ సింగ్ బృందం... బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 4-1తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున గుర్జిందర్ (14వ, 44వ ని.లో) రెండు గోల్స్ చేయగా... మొహమ్మద్ ఆమిర్ ఖాన్ (30వ ని.లో), రూపిందర్ పాల్ సింగ్ (52వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఫ్రాన్స్ జట్టుకు బౌమ్‌గార్టెన్ (21వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. భారత్ ఈనెల 10న స్పెయిన్‌తో మ్యాచ్ ఆడుతుంది. -
యూరప్ పర్యటనకు భారత హాకీ జట్టు
న్యూఢిల్లీ: కొత్త కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్ ఆధ్వర్యంలో భారత హాకీ జట్టు ఈనెల 31న యూరప్ పర్యటనకు వెళ్లనుంది. సర్దార్ సింగ్ నేతృత్వంలోని 21 మంది సభ్యుల బృందం 15 రోజులపాటు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో పర్యటిస్తుంది. ఆగస్టు 14న టూర్ ముగిసేలోపు ఓవరాల్‌గా ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ ఏడాది చివర్లో భారత్‌లోనే జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ కోసం ఈ మ్యాచ్‌లను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. వివాదాస్పద పరిస్థితిలో కోచ్‌గా ఉన్న పాల్ వాన్ యాస్పై హాకీ ఇండియా (హెచ్ఐ) వేటు వేసిన విషయం తెలిసిందే. మరో ఏడాదిలో రియో ఒలింపిక్స్ ఉన్న నేపథ్యంలో కొత్త కోచ్‌ను కాకుండా జట్టులో హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్‌గా ఉన్న ఓల్ట్‌మన్స్‌కు బాధ్యతలు అప్పగించారు. -
ఐరోపా దేశాల్లో మోదీ పర్యటన
-
శ్రీజకు ఖాయమైన పతకం
స్లొవేకియా ఓపెన్ టీటీ ఫైనల్లో భారత్ సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ)కి చెందిన హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ.. యూరప్ పర్యటనలో పతకం ఖాయం చేసుకుంది. శ్రీజతోపాటు ప్రియదర్శిని దాస్, ఐహికా ముఖర్జీలతో కూడిన భారత జట్టు స్లొవేకియా ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో టోర్నీలో భారత్ కనీసం రజతం దక్కించుకోనుంది. స్లొవేకియాలోని సెనెక్‌లో జరుగుతున్న ఈ ప్రపంచ స్థాయి జూనియర్ పోటీల్లో టాప్ సీడ్ భారత్ సెమీఫైనల్లో 3-1తో బల్గేరియా-ఉరుగ్వే (మిక్స్డ్) జట్టుపై నెగ్గింది. ఈ పోటీలో సింగిల్స్‌లో శ్రీజ 4-11, 11-6, 11-7, 11-7తో మిహెలా దిమోవాను ఓడిం చింది. అంతకుముందు జరిగిన క్వార్టర్ఫైనల్లో భారత్ 3-0తో స్లొవేకియాపై గెలుపొందింది. స్లొవేకియాపై తొలి గేమ్‌లో ప్రియదర్శిని దాస్ 3-0 తేడాతో మిరియామేను ఓడించగా, రెండో గేమ్‌లో ఐహికా 3-0తో కరోలినాపై, మూడో గేమ్‌లో శ్రీజ 3-0తో అనోవా లూసియాపై గెలుపొందారు. -
సందీప్ సింగ్‌కు నిరాశ
యూరప్ పర్యటనకు భారత హాకీ జట్టు న్యూఢిల్లీ: ప్రపంచకప్ హాకీ టోర్నీకి ముందు సన్నాహకంగా భారత జట్టు యూరప్‌లో ఆడే మ్యాచ్‌ల కోసం సీనియర్ ఆటగాళ్లు గుర్బాజ్ సింగ్, డానిష్ ముజ్తబాలకు పిలుపు అందింది. మరోవైపు హెచ్ఐఎల్లో టాప్ గోల్ స్కోరర్‌గా నిలిచిన ‘డ్రాగ్ ఫ్లికర్’ సందీప్ సింగ్‌కు మొండిచేయి ఎదురైంది. 21 మందితో కూడిన బృందం ఈ పర్యటనకు వెళ్లనుంది. ఈనెల 9 నుంచి 19 వరకు ది హేగ్‌లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. సర్దార్ సింగ్ జట్టుకు నేతృత్వం వహించనున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ అనంతరం గుర్బాజ్ జట్టు తరఫున బరిలోకి దిగలేదు. ఈ ఏడాది హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) రెండో సీజన్ విజేత ఢిల్లీ వేవ్‌రైడర్స్ తరఫున ఆడిన తను అద్భుత ఆటతీరుతో అదరగొట్టి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇక కుడి మోకాలుకు గాయం కారణంగా గత పది నెలలుగా ఆటకు దూరంగా ఉన్న మిడ్‌ఫీల్డర్ డానిష్ సత్తా చాటేందుకు సిద్ధపడుతున్నాడు. జనవరిలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్‌లో ఆడని ఫార్వర్డ్స్ రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్ యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు.