న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ యూరప్‌లో వారంపాటు పర్యటించనున్నారు. మంగళవారమే ఆయన భారత్ నుంచి బయల్దేరారు. సెప్టెంబర్ ఏడున బ్రస్సెల్స్‌లో యురోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్లతో రాహుల్ భేటీ అవుతారు. ఆ తర్వాత అక్కడే కొందరు ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. తర్వాతి రోజు ఉదయం కొందరు భారతీయ పారిశ్రామికవేత్తలతో భేటీ జరగనుంది. మధ్యా హ్నం పత్రికా సమావేశంలో పాల్గొంటారు.
తర్వాత ఆయన పారిస్‌కు చేరుకుని సెపె్టంబర్ ఎనిమిదో తేదీన మరో పత్రికా సమావేశంలో పాల్గొంటారు. సెపె్టంబర్ తొమ్మిదో తేదీన ఫ్రాన్స్ పార్లమెంటేరియన్లతో ముచ్చటిస్తారు. తర్వాత అక్కడి సైన్స్ పొ విశ్వవిద్యాలయం విద్యార్థులతో మాట్లాడతారు. సెపె్టంబర్ పదో తేదీన రాహుల్ నెదర్లాండ్స్‌కు వెళ్తారు. 400 ఏళ్ల నాటి లీడెన్ యూనివర్సిటీలో పర్యటించి అక్కడి విద్యార్థులతో మాట్లాడతారు. సెప్టెంబర్ 11వ తేదీన నార్వేకు వెళ్తారు. ఓస్లోలో ఆ దేశ పార్లమెంటేరియన్లతో సమావేశమవుతారు. తర్వాత అక్కడి ప్రవాస భారతీయులతో, ఓస్లో వర్సిటీ విద్యార్థులతోనూ మాట్లాడతారు. సెప్టెంబర్ 12వ తేదీన రాత్రి రాహుల్ భారత్‌కు తిరుగుపయనమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment