యూరప్ పర్యటనకు రాహుల్
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. కొన్ని రోజుల పాటు యూరప్లో పర్యటించనున్నట్టు సోమవారం రాహుల్ ట్వీట్ చేశారు. కాగా రాహుల్ గాంధీ యూరప్ ఎప్పుడు బయల్దేరేది, ఏ దేశానికి వెళ్తారన్న విషయాలు వెల్లడించలేదు.
రాహుల్ ముందస్తుగా మూడు రోజుల ముందే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని రాహుల్ ఆకాంక్షించారు. రాహుల్ ముందస్తుగా శుభాకాంక్షలు తెలపడాన్ని బట్టి కొత్త సంవత్సర వేడుకలను యూరప్లో చేసుకునే అవకాశముంది.