విషాదానికి వీసా ఫీజులుండవు!
ఒక్క విషాదం.... దేశాలను కలిపింది. కన్నీరు, కష్టాలు పంచుకునేలా చేసింది. ఒకరి భుజంపై మరొకరు చేయి వేసి ఊరడించేలా చేసింది.
అవును .... మలేషియా ఎయిర్ లైన్స్ విమాన ప్రమాదం విషాదంలో అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా, పాకిస్తాన్ నుంచి భారత్ దాకా, కౌలాలంపూర్ నుంచి బీజింగ్ దాకా అందరినీ కలిసికట్టుగా విమాన శకలాల కోసం అన్వేషించేలా చేసింది. (ఆ విమానం సముద్రంలో కూలింది)
ఆస్ట్రేలియాకు దగ్గర్లో సముద్రసమాధిలో ఎక్కడో ఎవరికీ తెలియకుండా నిద్రిస్తున్న మలేషియన్ విమానంలో అంతిమ యాత్ర చేసిన తమ వారి కోసం వచ్చే బంధువులందరికీ సానుభూతితో స్వాగతం పలుకుతున్నామని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబట్ ప్రకటించారు. (హిందూ మహా సముద్రంలో విమాన శకలాలు) ఈ విషాద సమయంలో మిమ్మల్ని గుండెలకు హత్తుకునేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. వారి నుంచి ఎలాంటి వీసా ఫీజులు వసూలు చేయబోమని కూడా ఆయన ప్రకటించారు. ప్రధానికి విపక్ష నేత బిల్ షార్టెన్ కూడా పూర్తి మద్దతు పలికారు. (వీడిన మలేషియా విమానం మిస్టరీ)