అమెరికా బాటలో ఆస్ట్రేలియా.. భారమవుతున్న విదేశీ విద్య | Australia Foreign Student Visa Policy Changes Full Details | Sakshi
Sakshi News home page

అమెరికా బాటలో ఆస్ట్రేలియా.. భారమవుతున్న విదేశీ విద్య

Jul 1 2024 9:35 PM | Updated on Jul 1 2024 9:39 PM

Australia Foreign Student Visa Policy Changes Full Details

విదేశీ విద్యార్థులు వలసలను తగ్గించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ విద్యార్థుల వీసా ఫీజును భారీగా పెంచుతూ ప్రకటించింది. 710 ఆస్ట్రేలియా డాలర్లుగా ఉండే వీసా ఫీజు.. ఇప్పుడు ఇది 1600 ఆస్ట్రేలియన్ డాలర్లకు పెరిగింది. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 40వేలు నుంచి రూ. 89వేలుకు పెరిగిందన్నమాట.

వీసా ఫీజులను పెంచడమే కాకుండా విజిటర్ వీసా హోల్డర్లు, తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాలు కలిగిన విద్యార్థులు ఇప్పుడు దేశంలో ఉన్నప్పుడు స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేయడం కూడా నిషేదించారు. రికార్డు స్థాయిలో విదేశీ విద్యార్థులు రాకను నియంత్రించడంలో భాగంగానే ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఆస్ట్రేలియా కొత్త వీసా ఫీజుల పెంపు ఈ రోజు (జూలై 1) నుంచి అమల్లోకి వస్తుంది. ఈరోజు అమల్లోకి వస్తున్న మార్పులు మన అంతర్జాతీయ విద్యా వ్యవస్థ సమగ్రతను పునరుద్ధరించడంలో సహాయపడతాయి. స్వేచ్ఛగా.. ఆస్ట్రేలియాకు మెరుగైన సేవలందించేలా ఉండేలా మైగ్రేషన్ వ్యవస్థను సృష్టిస్తామని.. హోం వ్యవహారాల మంత్రి క్లేర్ ఓ నీల్ పేర్కొన్నారు.

విదేశీ విద్యకోసం వెళ్లే విద్యార్థులు ప్రారంభంలో అమెరికా, కెనడా దేశాలకు వెళ్లేవారు. ఆ రెండు దేశాలు వీసా ఫీజులను దాదాపు 185 డాలర్లు, 110 డాలర్లు పెంచడంతో.. విద్యార్థులు ఈ రెండు దేశాలకు ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియాను ఎంచుకున్నారు. దీంతో సుమారు 30 శాతం మంది విద్యార్థులు ఆస్ట్రేలియా బాట పట్టారు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా వీసా ఫీజులను భారీగా పెంచేసింది.

కొన్ని గణాంకాల ప్రకారం, విదేశీ విద్యకోసం 2022-23లో ఏకంగా 1.50 లక్షలమంది ఆస్ట్రేలియాకు వెళ్లారు. విదేశీ విద్యార్థులు రాకను నియంత్రించడానికి 2022 చివరలో విదేశీ విద్యార్థులు వీసా ఫీజుల పాలసీలలో మార్పులు వచ్చాయి. దీంతో నియమాలు మరింత కఠినతరమయ్యాయి. ప్రారంభంలో ఇంగ్లీష్ భాష అవసరాన్ని మరింత కఠినతరం చేశారు. ఆ తరువాత వీసా ఫీజులను పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement