
UK Student Visa యునైటెడ్ కింగ్‌డమ్ సర్కార్ భారతీయ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది. విద్యార్థి , పర్యాటక వీసాల ధరలను ఏకంగా 200 శాతం పెంచేసింది. ఈమేరకు బ్రిటన్‌ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. పార్లమెంటరీ ఆమోదం తరువాత పెంచిన ఫీజులు అక్టోబర్ 4వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ పెంపుతో ప్రభుత్వ పథకాలకు ఎక్కువ నిధుల ప్రాధాన్యతకు అవకాశం లభిస్తుందని యూఏ హోం ఆఫీస్ పేర్కొంది. దీంతో లక్షలాదిమంది భారతీయ విద్యార్థులపై భారం పడనుంది.
UK హోమ్ ఆఫీస్ ప్రకటన ప్రకారం, ఆరు నెలల కంటే తక్కువ కాలానికి విజిట్ వీసా ధర 15 నుండి 115 పౌండ్లకు చేరింది. విదేశీ విద్యార్థుల నుంచి వసూల్ చేసే స్టడీ వీసా(Study Visa) ఫీజు దాదాపు 127 పౌండ్లనుంచి 490 చేరింది. అలాగే పర్యాటకులకు ఇచ్చే విజిట్ వీసా ఫీజు కూడాపెరగనుంది.
హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ డేటా ప్రకారం, 2021-2022లో 120,000 కంటే ఎక్కువ మందే భారతీయ విద్యార్థులు యూకేలో చదువుతున్నారు. కాగా జూలైలో అక్కడి ప్రభుత్వం వర్క్, విజిట్ వీసాల ధరలో 15 శాతం పెరుగుదలను ప్రకటించింది. ప్రయార్టీ, స్టడీ వీసాలు, స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్‌ల ఫీజును 20 శాతం పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment