![UK Finance Minister Rishi Sunak Makes Visas More Expensive Budget - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/13/uk.jpg.webp?itok=geDw4Dlx)
లండన్: బ్రిటన్‌కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇది చేదువార్తే. ఎందుకంటే వీసా ఫీజులతోపాటు తప్పనిసరిగా చెల్లించాల్సిన ఆరోగ్య సేవల సర్‌చార్జి భారీగా పెరగనుంది. ఈ మేరకు బ్రిటన్ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ తన బడ్జెట్‌లో ప్రకటించారు. ఇప్పటివరకూ ఈ ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జి (ఐహెచ్‌ఎస్) ఏడాదికి 400 పౌండ్లు (రూ.38 వేలు) మాత్రమే ఉండగా.. తాజా బడ్జెట్ ప్రకారం ఇది 624 పౌండ్లు (సుమారు రూ.60 వేలు)కు చేరుకోనుంది. వలసదారులందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకే రుసుము పెంచుతున్నట్లు రిషి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బుధవారం బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం 18 ఏళ్లలోపు వారికి ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్ 470 (రూ.45 వేలు) పౌండ్లుగా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment