Amazon Ban Visa Credit Card.ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి 'యూకే'లో వీసా క్రెడిట్ కార్డ్‌ల వినియోగంపై నిషేదం విధించనుంది. అప్పటి వరకు ఆ క్రెడిట్ కార్డ్‌పై షాపింగ్ చేసుకోవచ్చని తెలిపింది.
పర్సంటేజ్ పెరిగింది
'ఇంటర్‌చేంజ్'(ట్రాన్సాక్షన్‌పై చెల్లించే పర్సంటేజ్) రుసుములపై కొనసాగుతున్న యుద్ధంలో భాగంగా అమెజాన్ యూకేలోని 'వీసా' క్రెడిట్ కార్డ్‌లను బ్లాక్ చేస్తోంది. యురేపియన్ యూనియన్ చట్టాల ప్రకారం..వీసా క్రెడిట్ కార్డ్, లేదంటే డెబిట్ కార్డ్ వినియోగిస్తే.. సంబంధిత సంస్థ ఒక్కో ట్రాన్సాక్షన్‌కు 0.3 శాతం పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు యుకే ఇంటర్ చేంజ్ ఫీజ్ అని పిలిచే 0.3 శాతాన్ని 1.5శాతానికి పెంచడంపై అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇంటర్ చేంజ్ ఫీజ్ ఎవరు చెల్లిస్తారు
ఇంటర్ చేంజ్ ఫీజ్ అంటే ఏంటో ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఉదాహరణకు యుకేలో నివసించే సుబ్బారావ్ అమెజాన్ వెబ్‌సైట్‌లో చలికోటును వీసా క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే.. ఆ కొనుగోలుపై అమెజాన్ వీసా సంస్థకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ చేంజ్ అని పిలిచే ఈ ఫీజు వల్ల సంస్థకు నష్టం కలుగుతుందని అమెజాన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే వచ్చే ఏడాది జనవరి 19 నుంచి వీసా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లపై బ్యాన్ విధించింది. దీంతో అమెజాన్ వెబ్ సైట్‌లో వీసా కార్డ్‌ల ద్వారా షాపింగ్ చేసే సదుపాయం లేదని స్పష్టం చేసింది.
చదవండి: భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసం పోటా పోటీ పడుతున్నారు
Comments
Please login to add a commentAdd a comment