visa debit card
-
రూపే కార్డ్- వీసా కార్డ్ తేడా ఏమిటి? ఏది ఉత్తమం?
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటి. మనదేశంలో ఆన్లైన్ లావాదేవీలతో పాటు డిజిటల్ లావాదేవీలు జరుగుతుంటాయి. నగదు రహిత లావాదేవీల్లో కార్డు చెల్లింపుల ట్రెండ్ ఇటీవలి కాలంలో మరింతగా పెరిగింది. నగదు రహిత విధానంలో కార్డుల సాయంతో పలు రకాల లావాదేవీలు చేయవచ్చు.కార్డుతో లావాదేవీలు జరిపే చాలామందికి రూపే కార్డ్- వీసా కార్డ్ మధ్య తేడాలు ఏమిటో సరిగా తెలియకపోవచ్చు. దీంతో కొత్త కార్డును ఎంపిక చేసుకునే విషయంలో అయోమయానికి గురవుతుంటారు. అందుకే ఈ రెండు కార్డుల మధ్యగల వ్యత్యాసాన్ని గుర్తిస్తూ, ఏ కార్డు ఉత్తమనేది ఇప్పుడు తెలుసుకుందాం.రూపే కార్డ్ భారతదేశంలో విస్తృతంగా ఆమోదం పొందిన కార్డు. దీనిని ఉపయోగించి అంతర్జాతీయ వెబ్సైట్లలో చెల్లింపులు చేయలేం. అయితే వీసా కార్డ్ అనేది దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తృతంగా ఆమోదం పొందింది. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోనూ వీసా కార్డ్ సాయంతో చెల్లింపులు చేయవచ్చు.వీసా కార్డ్ నెట్‌వర్క్‌లతో పోలిస్తే రూపే కార్డ్‌తో చేసే చెల్లింపులకు తక్కువ లావాదేవీ ఛార్జీలు కలిగివుంటాయి. ఈ కార్డ్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ భారతదేశంలోనే ప్రాసెస్ అవుతుంది. ఇక వీసా కార్డ్ అనేది అంతర్జాతీయ చెల్లింపు నెట్వర్క్ అయినందున, లావాదేవీ ప్రక్రియ దేశం వెలుపల జరుగుతుంది. అందుకే రూపేతో పోలిస్తే దీనికి అధికంగా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.రూపే కార్డ్ లావాదేవీలు వీసాతో పాటు ఇతర చెల్లింపు నెట్‌వర్క్‌ల కంటే వేగంగా జరగుతాయి. వీసా కార్డ్‌లో లావాదేవీల వేగం రూపేతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. రూపే కార్డ్ ప్రాథమిక లక్ష్యం ముఖ్యంగా దేశంలోని గ్రామీణులకు ఉపయుక్తం కావడం. భారతదేశంలో వీసా కార్డులు టైర్ వన్, టైర్ టూ నగరాల్లో ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి.రూపే కార్డ్ - వీసా కార్డ్‌లలో ఏ కార్డ్ ఉత్తమం అనే విషయానికొస్తే అది వినియోగదారుని అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా దేశంలోనే లావాదేవీలు జరుపుతున్నట్లయితే వారికి రూపే కార్డ్ ఉత్తమ ఎంపిక. అంతర్జాతీయంగా లావాదేవీలు చేస్తూ లేదా తరచూ విదేశాలకు వెళుతున్నవారికి వీసా కార్డ్ ఉత్తమం. ఈ కార్డును ప్రపంచంలోని ఏ దేశంలోనైనా వినియోగించేందుకు అవకాశం ఉంటుంది. -
వినియోగదారులకు అమెజాన్ భారీ షాక్, క్రెడిట్ కార్డ్‌పై బ్యాన్
Amazon Ban Visa Credit Card.ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి 'యూకే'లో వీసా క్రెడిట్ కార్డ్‌ల వినియోగంపై నిషేదం విధించనుంది. అప్పటి వరకు ఆ క్రెడిట్ కార్డ్‌పై షాపింగ్ చేసుకోవచ్చని తెలిపింది. పర్సంటేజ్ పెరిగింది 'ఇంటర్చేంజ్'(ట్రాన్సాక్షన్‌పై చెల్లించే పర్సంటేజ్) రుసుములపై కొనసాగుతున్న యుద్ధంలో భాగంగా అమెజాన్ యూకేలోని 'వీసా' క్రెడిట్ కార్డ్‌లను బ్లాక్ చేస్తోంది. యురేపియన్ యూనియన్ చట్టాల ప్రకారం..వీసా క్రెడిట్ కార్డ్, లేదంటే డెబిట్ కార్డ్ వినియోగిస్తే.. సంబంధిత సంస్థ ఒక్కో ట్రాన్సాక్షన్‌కు 0.3 శాతం పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు యుకే ఇంటర్ చేంజ్ ఫీజ్ అని పిలిచే 0.3 శాతాన్ని 1.5శాతానికి పెంచడంపై అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంటర్ చేంజ్ ఫీజ్ ఎవరు చెల్లిస్తారు ఇంటర్ చేంజ్ ఫీజ్ అంటే ఏంటో ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఉదాహరణకు యుకేలో నివసించే సుబ్బారావ్ అమెజాన్ వెబ్సైట్లో చలికోటును వీసా క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే.. ఆ కొనుగోలుపై అమెజాన్ వీసా సంస్థకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ చేంజ్ అని పిలిచే ఈ ఫీజు వల్ల సంస్థకు నష్టం కలుగుతుందని అమెజాన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే వచ్చే ఏడాది జనవరి 19 నుంచి వీసా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లపై బ్యాన్ విధించింది. దీంతో అమెజాన్ వెబ్ సైట్లో వీసా కార్డ్‌ల ద్వారా షాపింగ్ చేసే సదుపాయం లేదని స్పష్టం చేసింది. చదవండి: భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసం పోటా పోటీ పడుతున్నారు -
ఆర్బీఎల్ వీసా క్రెడిట్ కార్డుల జారీ ప్రారంభం
ముంబై: వీసా పేమెంట్ నెట్వర్క్ ఆధారిత కార్డుల జారీని ఆర్బీఎల్ బ్యాంకు ప్రారంభించింది. కార్డు డేటాను భారత్‌లోనే నిల్వ చేయాలన్న నిబంధనలను మాస్టర్‌కార్డు ఆచరణలో పెట్టకపోవడంతో కొత్త కార్డుల జారీపై జూలై 14న ఆర్బీఐ నిషేధం విధించింది. అప్పటి వరకు ఆర్బీఎల్ బ్యాంకు మాస్టర్కార్డులనే జారీ చేస్తుండేది. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో వీసా పేమెంట్ నెట్‌వర్క్‌తో జూలై 14నే ఆర్బీఎల్ బ్యాంకు ఒప్పందం చేసుకుంది. డేటా అనుసంధానాన్ని వేగంగా పూర్తి చేసుకోవడంతో వీసా కార్డుల జారీని మొదలు పెట్టినట్టు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12–14 లక్షల కార్డుల జారీ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించింది. క్రెడిట్ కార్డుల్లో ఆర్బీఎల్ బ్యాంకుకు 5 శాతం మార్కెట్ వాటా ఉంది. -
ఇక ఇంటర్నెట్ లేకున్నా డెబిట్ కార్డులు వాడొచ్చు!
డెబిట్ కార్డు వాడేవారికి ఒక తీపికబురు. మనం అత్యవసర సమయాల్లో డబ్బులు డెబిట్ కార్డు ద్వారా చెల్లించాలంటే కచ్చితంగా డెబిట్ కార్డు మెషీన్ లో ఇంటర్నెట్ అవసరం అనే విషయం మన అందరికి తెలుసు. ఒకవేల మన ప్రాంతంలో ఇంటర్నెట్ లేకపోతే ఆ సమయాల్లో మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్త టెక్నాలజీ రాబోతుంది. ఈ టెక్నాలజీ సహాయంతో మనం ఉన్న ప్రాంతంలోనే డెబిట్ కార్డు ద్వారా లావాదేవీలు జరపవచ్చు. ఈ దిశగా వీసా సంస్థ పనిచేస్తుంది. మనకు అందించే చిప్ ఆధారిత వీసా డెబిట్ కార్డు ద్వారా ఇంటర్నెట్ లేకున్నా ప్రతి రోజు రూ.2,000 వరకు లావాదేవీలు జరపవచ్చు. ప్రతి లావాదేవీ పరిమితి రూ.200 ఇప్పటికే పేమెంట్ సొల్యూషన్స్ సంస్థ ఇన్నోవిటి భాగస్వామ్యంతో వీసా ఆఫ్ లైన్ చెల్లింపుల కోసం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్(పీఓసీ) పద్దతిలో ఒక డెబిట్ కార్డు తయారు చేసింది. ఈ పీఓసీ కార్డును యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మార్కెట్లోకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రీపెయిడ్ కార్డుల ఇతర వాటి కంటే భిన్నంగా ఉంటాయి. ఇవి నెట్ వర్క్ క్లౌడ్ ఆధారంగా పనిచేస్తాయి. ఈ కొత్త వీసా చిప్ డెబిట్ కార్డులో రోజువారీ ఖర్చు పరిమితి రూ.2,000, ప్రతి లావాదేవీ పరిమితి కూడా రూ.200 మాత్రమే అని ఆర్బీఐ పేర్కొంది. ఒకవేళ తగిన బ్యాలెన్స్ లేకపోతే లావాదేవీని తిరస్కరిస్తారు.(చదవండి: ఎస్బీఐ డెబిట్ కార్డు ఉంటే? రూ.1,00,000 వరకు బెనిఫిట్) ఈ డెబిట్ కార్డు బ్యాంకు ఖాతాదారులకు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఇంటర్నెట్ లేని సమయాల్లో వర్తకులతో గోడవపడకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. వీసా ఇలాంటి ఒక కొత్త టెక్నాలజీని మొట్టమొదటి సారిగా మనదేశంలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఎక్కువ శాతం డిజిటల్ లావాదేవీలు ఇంటర్నెట్ లేని ఫెయిల్ అవుతున్నట్లు గతంలో ఆర్బీఐ తెలిపింది. ఆ సమస్యకు పరిష్కారంగా ఈ కొత్త టెక్నాలజీ వీసా తీసుకోని వస్తుంది. కోవిడ్ మహమ్మారి రాకతో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. అందుకే, మరింత మందికి ఈ సేవలు అందించేలా బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. -
వీసా ‘డెబిట్ కార్డు’పై ఈఎంఐ సదుపాయం
ముంబై: ప్రపంచ అతిపెద్ద చెల్లింపుల నెట్వర్క్ ‘వీసా’.. ఇక నుంచి తన అన్ని రకాల డెబిట్ కార్డులపై నెలవారీ వాయిదా చెల్లింపు (ఈఎంఐ) సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ–కామర్స్ సంస్థల నుంచి జరిపే ఆన్లైన్ కొనుగోళ్లకు ఈ ప్రయోజనం వర్తిస్తుందని తెలిపింది. దేశీయంగా 4.5 కోట్ల క్రెడిట్ కార్డులు ఉండగా.. 93 కోట్ల డెబిట్ కార్డులు ఉన్నాయి. మొత్తం డెబిట్ కార్డుల వాడకందారుల్లో 22 కోట్ల మందికి క్రెడిట్ సౌలభ్యం ఉంది. బ్యాంకులు, మర్చంట్లను ఒక ప్రత్యేక ప్లాట్‌ఫాం ద్వారా అనుసంధానం చేయడం ద్వారా విస్తృత స్థాయిలో డెబిట్ కార్డుదారులకు కూడా ఈఎంఐ సదుపాయాన్ని అందించనున్నట్లు సంస్థ ప్రొడక్డ్ హెడ్ అరవింద్ రొంటా వివరించారు. -
ఆ కార్డుదారులకు ఫ్లిప్ కార్ట్ తక్షణ రీఫండ్
ముంబై : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఇన్ స్టాంట్ రీఫండ్ సౌకర్యాన్ని ప్రకటించింది. వీసా డెబిట్ కార్డు వాడుతూ కొనుగోలులు చేపట్టే కస్టమర్లకు తక్షణమే రీఫండ్ చేపడతామని ఫ్లిప్ కార్ట్ గురువారం తెలిపింది. ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్ కార్ట్, లీడింగ్ డెబిల్ కార్డు బ్రాండు వీసా కలిసి ఈ సర్వీసులను లాంచ్ చేస్తున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. వినియోగదారులకు ఎలాంటి అవాంతరాలు లేని షాపింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చామని తెలిపాయి. ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూట్స్, మర్చంట్స్, స్టార్టప్‌లు, డెవలపర్లతో కలిసి పనిచేస్తామని, వినూత్న సదుపాయాలతో భారతీయ కస్టమర్లకు ముందుకు వస్తామని ఫ్లిప్ కార్ట్ చెప్పింది. దేశీయ ఈ-కామర్స్ ఇండస్ట్రీకి ఇన్స్టాంట్ రీఫండ్ సొల్యుషన్ అనేది చాలా విభిన్నమైనదని, ఆన్ లైన్ కామర్స్ స్వీకరణ పెంచి వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొంటామని భారత్, దక్షిణాసియా వీసా గ్రూప్ కంట్రీ మేనేజర్ టీఆర్ రామచంద్రన్ అన్నారు. వీసా డెబిట్ కార్డులతో ఏమైనా ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేస్తే, కంపెనీ వెంటనే వారికి రీఫండ్ సౌకర్యాన్ని కల్పించనుందని తెలిపారు. అంతకముందు ఈ ప్రక్రియ 2 నుంచి 7 పనిదినాలు పట్టేది. వీసా డెబిట్ కార్డులను ఆఫర్ చేసే బ్యాంకులు.. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, స్టాండర్డ్ ఛార్టడ్, బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర, ఫెడరల్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, ది సౌత్ ఇండియా బ్యాంకు. ఈ బ్యాంకుల కార్డు హోల్డర్లందరూ ప్రస్తుతం ఈ ఇన్ స్టాంట్ రీఫండ్లను పొందనున్నారు.