![Rbl Bank Restarts Visa Credit Cards - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/16/RBL.jpg.webp?itok=AhpdvAT1)
ముంబై: వీసా పేమెంట్ నెట్‌వర్క్ ఆధారిత కార్డుల జారీని ఆర్‌బీఎల్ బ్యాంకు ప్రారంభించింది. కార్డు డేటాను భారత్‌లోనే నిల్వ చేయాలన్న నిబంధనలను మాస్టర్‌కార్డు ఆచరణలో పెట్టకపోవడంతో కొత్త కార్డుల జారీపై జూలై 14న ఆర్‌బీఐ నిషేధం విధించింది.
అప్పటి వరకు ఆర్‌బీఎల్ బ్యాంకు మాస్టర్‌కార్డులనే జారీ చేస్తుండేది. ఆర్‌బీఐ ఆదేశాల నేపథ్యంలో వీసా పేమెంట్ నెట్‌వర్క్‌తో జూలై 14నే ఆర్‌బీఎల్ బ్యాంకు ఒప్పందం చేసుకుంది. డేటా అనుసంధానాన్ని వేగంగా పూర్తి చేసుకోవడంతో వీసా కార్డుల జారీని మొదలు పెట్టినట్టు బ్యాంకు ప్రకటించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12–14 లక్షల కార్డుల జారీ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించింది. క్రెడిట్ కార్డుల్లో ఆర్‌బీఎల్ బ్యాంకుకు 5 శాతం మార్కెట్ వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment