ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఆర్బీఎల్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. లోన్ రికవరీ ఏజెంట్లకు సంబంధించి ఆదేశాలను ఉల్లంఘించినందుకు గానూ రూ. 2.27 కోట్ల జరిమానా విధించింది.
ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన!
లోన్ రికవరీకి సంబంధించి ఆర్బీఎల్ బ్యాంక్‌పై ఆర్బీఐకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఆర్బీఐ.. రికవరీ ఏజెంట్ల విషయంలో ఆదేశాలను ఆర్బీఎల్ బ్యాంక్ ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో ఆ బ్యాంక్ భారీ జరిమానా విధించింది.
ఇదీ చదవండి: టాటాతో కుదరలేదు.. ఇక బిస్లెరీకి బాస్ ఆమే...
లోన్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను బెదిరింపులకు, వేధింపులకు గురిచేయకుండా చూసుకోవడంలో ఆర్బీఎల్ బ్యాంక్ విఫలమైందని కేంద్ర బ్యాంక్ ఆక్షేపించింది. ఏజెంట్లను నియమించుకునే ముందు వారి నేర చరిత్రను పోలీసుల ద్వారా ధ్రువీకరించుకోవాల్సి ఉందని పేర్కొంది.
ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే...
ఈ చర్య 2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాల కాలంలో గుర్తించిన ఉల్లంఘనలపై మాత్రమే తీసుకున్నదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తమ పరిధిలోని బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు రుణాల వసూలు కోసం నియమించుకున్న ఏజెంట్లు కస్టమర్లను బెదిరింపులకు, వేధింపులకు గురిచేయకుండా చూసుకోవాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని 2022లో ఆర్బీఐ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment