huge fine
-
ఆర్బీఎల్ బ్యాంకుకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఆర్బీఐ!
ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఆర్బీఎల్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. లోన్ రికవరీ ఏజెంట్లకు సంబంధించి ఆదేశాలను ఉల్లంఘించినందుకు గానూ రూ. 2.27 కోట్ల జరిమానా విధించింది. ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన! లోన్ రికవరీకి సంబంధించి ఆర్బీఎల్ బ్యాంక్‌పై ఆర్బీఐకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఆర్బీఐ.. రికవరీ ఏజెంట్ల విషయంలో ఆదేశాలను ఆర్బీఎల్ బ్యాంక్ ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో ఆ బ్యాంక్ భారీ జరిమానా విధించింది. ఇదీ చదవండి: టాటాతో కుదరలేదు.. ఇక బిస్లెరీకి బాస్ ఆమే... లోన్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను బెదిరింపులకు, వేధింపులకు గురిచేయకుండా చూసుకోవడంలో ఆర్బీఎల్ బ్యాంక్ విఫలమైందని కేంద్ర బ్యాంక్ ఆక్షేపించింది. ఏజెంట్లను నియమించుకునే ముందు వారి నేర చరిత్రను పోలీసుల ద్వారా ధ్రువీకరించుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... ఈ చర్య 2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాల కాలంలో గుర్తించిన ఉల్లంఘనలపై మాత్రమే తీసుకున్నదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తమ పరిధిలోని బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు రుణాల వసూలు కోసం నియమించుకున్న ఏజెంట్లు కస్టమర్లను బెదిరింపులకు, వేధింపులకు గురిచేయకుండా చూసుకోవాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని 2022లో ఆర్బీఐ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. -
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టారని రూ.900 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. మూడు నెలల్లో చెల్లించాలని చెన్నై ఎన్జీటీ ధర్మాసనం ఆదేశించింది. మొత్తం ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో 1.5 శాతం జరిమానా విధించింది. జరిమానాను కేఆర్ఎంబీ వద్ద జమ చేయాలని ఎన్జీటీ పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన తెలిసిందే. చదవండి: కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ -
గూగుల్‌కు షాక్: ఫ్రాన్స్ భారీ జరిమానా
సెర్చింగ్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. గూగుల్ న్యూస్ విషయంలో కాపీరైట్ నిబంధనల ఉల్లంఘన కింద భారీ జరిమానా విధించింది ఫ్రాన్స్. ప్యారిస్: ఫ్రాన్స్ కాంపిటీషన్ రెగ్యులేటర్ మంగళవారం గూగుల్(ఆల్ఫాబెట్స్ గూగుల్)కు భారీ జరిమానా విధించింది. ఈయూ కాపీరైట్స్ నిబంధనల ప్రకారం.. స్థానిక మీడియా హౌజ్‌ల కంటెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా గూగుల్‌న్యూస్ వాడుకుంటోందని పేర్కొంటూ 500 మిలియన్ యూరోలను ఫైన్ విధించింది. మన కరెన్సీలో ఆ జరిమానా విలువ రూ.4,415 కోట్లకు పైనే. గూగుల్ న్యూస్‌లో తమ వెబ్సైట్లకు చెందిన కంటెంట్‌ను అనుమతి లేకుండా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని న్యూస్ ఏజెన్సీలు గతంలో ఫ్రాన్స్ కాంపిటీషన్ రెగ్యులేటర్‌ను ఆశ్రయించాయి. ఈ మేరకు మీడియా హౌజ్‌లతో సంప్రదింపులు జరపాలని గూగుల్‌కు తెలిపినప్పటికీ.. గూగుల్ నిర్లక్క్ష్యం వహించడంతో యాంటీట్రస్ట్ రెగ్యులేటర్స్ కింద ఇప్పుడు ఈ భారీ జరిమాను విధించింది. అంతేకాదు కాపీరైటెడ్ కంటెంట్‌ను వాడుకుంటున్నందుకు మీడియా పబ్లిషర్లకు రెమ్యునరేషన్ చెల్లించాలని, లేని పక్షంలో రోజుకు 9 లక్షల యూరోలను అదనంగా ఏజెన్సీలకు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. -
విద్యార్థి ఫిర్యాదు: హలో అటవీ అధికారులా..
హైదరాబాద్: ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్టును కూల్చివేయడంపై ఓ 8వ తరగతి విద్యార్థి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రాత్రికి రాత్రే అనుమతి లేకుండా చెట్టును తొలగించి నామరూపాల్లేకుండా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో విచారణ చేసిన అధికారులు సంబంధికులపై భారీగా జరిమానా విధించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో జరిగింది. సైదాబాద్ ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉందని ఒకరు దాదాపు 40 ఏళ్లకు పైగా వయసు ఉన్న భారీ వేపచెట్టును కొట్టేశారు. చెట్టును రాత్రికి రాత్రి కొట్టేయడంతో సమీపంలో ఉండే ఓ 8వ తరగతి పిల్లోడు షాకయ్యాడు. తెల్లవారుజామున కలపను తరలించడం, చెట్టు ఆనవాళ్లు కనిపించకుండా తగులబెట్టడం వంటివి చేయడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 5364కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. తాను పచ్చదన పరిరక్షకుడిగా చెప్పి తన ఇంటి సమీపంలో చెట్టును నరివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాడు. దీంతో అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. అనుమతి లేకుండా చెట్టు కొట్టివేశారని నిర్ధారించుకుని బాధ్యులైన వారికి రూ.62,075 భారీ జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఫిర్యాదు చేసిన బాలుడిని అటవీ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు. -
చెట్టే కదా.. అని నరికితే!
కోల్‌సిటీ (రామగుండం): చెట్టే కదా.. అని ఓ వ్యక్తి నరికాడు. కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్‌సర్క్యూట్ జరిగింది. వీధి మొత్తం అంధకారమైంది. ఫలితంగా అతడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీలోని సంతోష్‌నగర్‌లో పిడుగు సతీశ్ అనే వ్యక్తి తన ఇంటి ముందున్న చెట్టును అనుమతి లేకుండా మూడు రోజుల కిందట నేలకూల్చాడు. కొమ్మలు తెగి విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి నగరపాలక సంస్థకు చెందిన 25 వీధిదీపాలు కాలిపోయాయి. దీంతో మున్సిపల్ చట్టం–2019 ప్రకారం రూ.49,500 జరిమానా చెల్లించాలని కమిషనర్ పి.ఉదయ్‌కుమార్ మంగళవారం సతీశ్‌కు నోటీసు జారీ చేశారు. సతీశ్ జరిమానా చెల్లించి మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తానని హామీనిచ్చాడు. ఈ విధంగా పచ్చదనం పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం విస్తృతంగా చేపడుతూనే ఉన్న చెట్లను కాపాడుకునేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆ చెట్టు తొలగించిన వ్యక్తికి భారీ జరిమానా విధించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలా చోట్ల జరిగాయి. -
ట్రేడ్ లైసెన్సు లేకుంటే భారీ జరిమానా
సాక్షి, హైదరాబాద్: ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారాలపై సర్కారు కొరడా ఝళిపించనుంది. మున్సిపల్ ప్రాంతాల్లో ట్రేడ్ లైసెన్సు తీసుకోకుండా వ్యాపారాలు చేసేవారిపై, గడువు తీరిన లైసెన్సులతో వ్యాపారాలు, పరిశ్రమలు నిర్వహించేవారిపై భారీ జరిమానాలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ట్రేడ్‌లైసెన్సు తీసుకోకపోతే వ్యాపారం ప్రారంభమైన నాటి నుంచి తొలి మూడు నెలల వరకు 25 శాతం, ఆ తర్వాత నుంచి లైసెన్సు తీసుకునే వరకు 50 శాతం లైసెన్సు ఫీజును జరిమానాగా విధించాలని అధికారులను ఆదేశించింది. గడువు తీరిన ట్రేడ్‌లైసెన్సుతో వ్యాపారాలు నిర్వహించేవారికి సంబంధిత ఏడాది జూన్ వరకు 25 శాతం, జూలై 1 నుంచి ట్రేడ్‌లైసెన్సు పునరుద్ధరించుకునే నాటి వరకు 50 శాతం లైసెన్సు ఫీజును జరిమానాగా విధించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ మున్సిపాలిటీల ట్రేడ్ లైసెన్సు నిబంధనలు–2020ను ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ విడుదల చేశారు. వ్యాపారాలను బట్టి లైసెన్సులు వ్యాపారాల స్వభావాన్ని బట్టి డేంజరస్ అండ్ అఫెన్సివ్(ప్రమాదకర, ఉపద్రవ), సాధారణ వ్యాపారాలు/దుకాణాలు/కార్యాలయాలు, పారిశ్రామిక సముదాయాలు, తాత్కాలిక వ్యాపారాలు అనే నాలుగు కేటగిరీలుగా విభజించి ట్రేడ్ లైసెన్సులు జారీ చేయనున్నారు. ట్రేడ్ లైసెన్సు లేకుండా మున్సిపాలిటీల పరిధిలో ఎలాంటి వ్యాపారాలు నిర్వహిం చడానికి వీలులేదని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాపారాలు/పరిశ్రమల నిర్వహణకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులతోపాటు లైసెన్సు ఫీజు చెల్లించిన తర్వాతే లైసెన్సులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. ప్రాంతం ప్రాధాన్యత, విస్తీర్ణం ఆధారంగా లైసెన్సుల జారీకి ప్రభుత్వం రేట్లను నిర్ణయించింది. ప్రమాదకర వ్యాపారాలతోపాటు సాధారణ వ్యాపారాలు/దుకాణాలు/కార్యాలయాలకు సింగిల్ లైన్ రోడ్డు ఉంటే ప్రతి చదరపు అడుగుకు కనీసం రూ.3, డబుల్‌లైన్ ప్రాంతంలో కనీసం రూ.4, మల్టీలైన్ రోడ్డు ఉంటే కనీసం రూ.5 చొప్పున మొత్తం ప్రాంతం విస్తీర్ణానికి లెక్కించి లైసెన్సుఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఐదు నక్షత్రాల హోటళ్లు, కార్పొరేట్ ఆస్పత్రులు చదరపు అడుగుకు కనీసం రూ.6 చొప్పున ఫీజులు చెల్లించాల్సి ఉండనుంది. పరిశ్రమల స్థాయిని బట్టి కనీసం రూ.4 నుంచి రూ.7 వరకు ప్రతి చదరపు అడుగు స్థలానికి చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సిళ్లు నిర్ణయించాలి.. ఇక తాత్కాలిక వ్యాపారాల కోసం వసూలు చేసే లైసెన్సు ఫీజులను స్థానిక మున్సిపల్ కౌన్సిళ్లు నిర్ణయించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రతి మూడేళ్లకోసారి మున్సిపల్ కౌన్సిళ్లు ట్రేడ్‌లైసెన్సు ఫీజులను పెంచాలని, ఒకవేళ మున్సిపల్ కౌన్సిళ్లు పెంచకపోతే జిల్లా కలెక్టర్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. -
కారుకు రూ. 27.68 లక్షల జరిమానా
అహ్మదాబాద్: సరైన పత్రాలు లేవని తన కారును అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పోర్షే 911 స్పోర్ట్స్ కార్ యజమాని పన్నులు, వడ్డీ, జరిమానా కలిపి రూ. 27.68 లక్షలు చెల్లించి తన కారును తీసుకువెళ్లారు. ఈ మొత్తాన్ని అహ్మదాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయం(ఆర్టీవో)లో చెల్లించిన కారు యజమాని రంజిత్ దేశాయ్ సిటీ ట్రాఫిక్ పోలీసుల స్వాధీనంలో ఉన్న తన కారును తీసుకువెళ్లారు. గడిచిన ఏడాది నవంబర్‌లో ఈ కారును ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. నవంబర్ 28న హెల్మెట్ క్రాస్‌రోడ్ వద్ద నెంబర్ ప్లేట్లు లేని కారణంగా కారును ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు ప్రశ్నించగా డ్రైవర్ సరైన పత్రాలు చూపించలేకపోయారని పోలీస్ అధికారులు తెలిపారు. దీంతో తాము కారును సీజ్ చేసి మోటార్ వాహనాల చట్టం ప్రకారం మెమో జారీ చేశామని చెప్పారు. తొలుత రూ. 9.8 లక్షల జరిమానా విధించగా కారు ఓనర్ ఆ మొత్తాన్ని డిపాజిట్ చేశారని, ఆపై పాత రికార్డులను పరిశీలించి భారీ మొత్తం జరిమానా వడ్డించామని తెలిపారు. కాగా రూ. 27.68 లక్షల జరిమానా చెల్లించినట్టు ఇచ్చిన రసీదును ట్విటర్లో పోస్ట్ చేసిన అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు దేశంలో అత్యధిక మొత్తంలో విధించిన జరిమానా ఇదే అని పేర్కొన్నారు. -
ఆటో డ్రైవర్‌కు రూ. 47,500 జరిమానా
భువనేశ్వర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 నిబంధనలు పాటించని వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఈ చట్టం ప్రకారం వాహనదారులకు విధించే జరిమానాలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమంది కొత్త చట్టం ప్రకారం విధించిన జరిమానాలు చూసి షాక్ తిన్నారు. ఆర్టీవో అధికారులు తాజాగా ఓ ఆటో డ్రైవర్‌కు రూ. 47,500 జరిమానా విధించారు. ఈ ఘటన ఒడిశా భువనేశ్వర్‌లో బుధవారం చోటుచేసుకుంది. సరైన పత్రాలు లేకపోవడం, తాగి వాహనం నడపడం, లైసెన్స్ సక్రమంగా లేకపోవడంతో అధికారులు అతనికి భారీ మొత్తంలో జరిమానా విధించారు. బుధవారం నగరంలో వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు మోటార్ వాహన చట్టం నిబంధనలు అతిక్రమించినందుకు ఆటో డ్రైవర్ హరిబంధు కన్హార్కు రూ. 47,500 జరిమానా విధించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త చట్టం ప్రకారం ఈ జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై హరిబంధు మాట్లాడుతూ, తాను ఇంత మొత్తం జరిమానా చెల్లించే పరిస్థితి లేదని తెలిపారు. కావాలంటే అధికారులు తన వాహనాన్ని సీజ్ చేయాలని, లేకుంటే తనను జైలుకు పంపాలని కోరారు. ఇంటి వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్‌కు విధించిన జరిమానా వివరాలు సాధారణ జరిమానా - రూ. 500 డ్రైవింగ్ లైసెన్స్ సరిగా లేనందుకు - రూ. 5,000 పర్మిట్ లేకుండా వాహనం నడిపినందుకు - రూ. 10,000 మద్యం సేవించి వాహనం నడిపినందుకు - రూ. 10,000 పొల్యూషన్ సర్టిఫికేట్ లేనందుకు - రూ. 10,000 వాహనం నడిపేందుకు వేరే వ్యక్తిని అనుమతించినందుకు - రూ. 5,000 ఆటో రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ లేనందుకు - రూ. 5,000 ఇన్సూరెన్స్ లేనందుకు - రూ. 2,000 -
రూ.15 వేల బండికి జరిమానా రూ.23 వేలు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త మోటార్ వాహన చట్టం నిబంధనలు పాటించని వాహనదారులకు చుక్కలు చూపెట్టడం ఖాయం. గుర్‌గ్రామ్‌లో చోటు చేసుకున్న ఉదంతం ఒకటి ఈ విషయాన్ని తేట తెల్లం చేసింది. నాలుగు రాష్ట్రాలు (తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్) మినహా దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 ప్రకారం భారీ జరిమానాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా హెల్మెల్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, కాలుష్య నియంత్రణ.. ఇలా ఏ సర్టిఫికెట్ లేకపోయినా వాహనదారుడు పది రెట్లకు మించి భారీ మూల్యం చెల్లించాల్సిందే. దినేష్ మదన్ తాజా అనుభవం గురించి తెలుసుకుందాం.. దినేష్‌కు కొత్త ట్రాఫిక్ నిబంధనల కింద ఏకంగా రూ.23,000 జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఎందుకంటే.. లైసెన్స్, ఆర్సీ డాక్యుమెంట్స్ లేవు.. దీంతో పాటు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు భారీ జరిమానా విధించారు. హెల్మెట్ లేదని బండి ఆపి, సర్టిఫికెట్లు లేవంటూ భారీ ఫైన్ విధించారని, వాట్సాప్‌లో లెసెన్స్ కాపీని చూపించినా అంగీకరించలేదని దినేష్ వాపోయాడు. హోండా యాక్టివా బైక్‌ను సెకండ్ హ్యాండ్లో రూ.15వేలకు కొన్నాను. ఇపుడు దీనికి రూ. 23 వేల జరిమానా చూసి షాకయ్యానంటున్నాడు దినేష్. బండికి సంబంధించిన కాగితాలన్నీ ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్పాడు. అయితే హెల్మెట్ ధరించనందుకు గాను వెయ్యి రూపాయల ఫీజును తీసుకొని, తన బండి తనకు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నాడు. అంతేకాదు.. ఇక మీదట అన్ని నిబంధనల్ని తు.చ. తప్పకుండా పాటిస్తానని తెలిపాడు. అయితే రూల్ ఈజ్ రూల్ అంటున్నారు అధికారులు. లైసెన్స్ లేని డ్రైవింగ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు, థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేదు, ఎయిర్ పొల్యూషన్ నిబంధనల ఉల్లంఘన, హెల్మెట్ లేని డ్రైవింగ్... ఈ నిబంధనల ఉల్లంఘనల కింద జరిమానా విధించామని వెల్లడించారు. చదవండి : 'ఆ' రాష్ట్రాల్లో పాత చలాన్లే! -
గూగుల్‌కు మరో భారీ షాక్!
సెర్చింజిన్ దిగ్గజం గూగుల్‌కు ఐరోపా సమాఖ్య(ఈయూ) బుధవారం భారీ షాకిచ్చింది. మరోసారి భారీ మొత్తంలో 4.34 బిలియన్ యూరోలు(దాదాపు 5 బిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. పోటీదారులను రానీయకుండా.. స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ యాప్స్‌నే వాడేలా అనుచిత విధానాలను గూగుల్ అనుసరిస్తుందనే ఆరోపణలతో ఈ జరిమానా వేసింది. యూరోపియన్, అమెరికన్ ప్రత్యర్థుల ఫిర్యాదులపై 2015 నుంచి విచారణ చేపట్టిన యూరప్, నేడు తన నిర్ణయాన్ని వెలువరించింది. గతేడాది కూడా గూగుల్ భారీ మొత్తంలో 2.8 బిలియన్ డాలర్ల( రూ.17,478 కోట్లకు పైగా) జరిమానాను ఎదుర్కొంది. అప్పుడు తన షాపింగ్ సర్వీసులకు అనుకూలంగా యాంటీ ట్రస్ట్ నిబంధనలను అది ఉల్లంఘించడంతో, జరిమానా పడింది. ఈ సెర్చింజిన్ దిగ్గజం గూగుల్‌తో పాటు, ఆపిల్, అమెజాన్, ఫేస్బుక్ లకు కూడా యూరోపియన్ రెగ్యులేటర్లు జరిమానాలు విధించాయి. గూగుల్ ప్రస్తుతం యాంటీ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించి, డివైజ్ విక్రయించడాని కంటే ముందస్తుగా స్మార్ట్ఫోన్లలో తన యాప్స్‌ను ఇన్స్టాల్ చేస్తుందని కమిషన్ ఆరోపించింది. తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రత్యామ్నాయాలను వాడకుండా నిరోధించేలా తయారీదారులతో ముందస్తుగానే గూగుల్ సంప్రదింపులు జరిపిందని రెగ్యులేటర్లు ఆరోపిస్తున్నాయి. తన వ్యాపార ధోరణిని మార్చుకోవాలని గూగుల్‌ను యూరోపియన్ యూనియన్ ఆదేశించింది. -
రియల్టీ దిగ్గజానికి భారీ జరిమానా
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం యూనిటెక్ కు మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగ దారులుకు కేటాయించాల్సిన ఫ్లాట్స్ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న డిల్లీ ఆధారిత నిర్మాణ సంస్థ యూనిటెక్కు సుప్రీంకోర్టు భారీ జరిమానా విధించింది. యూనిటెక్ ప్రకటించినట్టుగా ఆరునెలలో ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంపై సుప్రీం సీరియస్‌గా స్పందించింది. ఈ నేపథ్యంలో సంస్థ ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు భారీ జరిమానా విధించింది. 2010, జనవరి 1 నుంచి 39 మంది ఫ్లాట్ కొనుగోలు దారులకు సం.రానికి 14 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని సోమవారం ఆదేశించింది. ఫ్లాట్ కొనుగోలు కోసం 39మంది కొనుగోలుదారులు చెల్లించిన రూ. 16.55 కోట్లపై ఈ వడ్డీ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అలాగే ఈ మొత్తంలో 90 శాతం నగదును ఎనిమిది వారాల్లోపు చెల్లించాలని హర్యానాలోని గుర్గాం యూనిటెక్ విస్టాస్ ప్రాజెక్ట్ యజమానులను ఆదేశించింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ ఎం ఖాన్ మిల్కర్, జస్టిస్ మోహన్ ఎం శంతన్ గౌడర్ ఆధర్వంలో సుప్రీం ఈ తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా ప్రజల సొంత ఇంటి కలలతో ఆడుకోవద్దంటూ రియల్టీ సంస్థలను సుప్రీం బెంచ్ హెచ్చరించింది. ఒప్పంద నిబద్ధత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదని పేర్కొంది. నమ్మకగా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందడం చాలా అవసరమని సూచించింది. అంతేకాదు ఏ ఆర్థిక వ్యవస్థకైనా పునాది విశ్వాసమనీ.. ఆ విశ్వాసం కోల్పోతే, సర్వం కోల్పోయినట్టేనని ధర్మాసనం పేర్కొంది. కాగా గత అక్టోబర్‌లో విస్తా ప్రాజెక్టులోఫ్లాట్స్ కొనుగోలుచేసిన వారికి ఫ్లాట్స్ కేటాయించడంలో విఫలమైన యూనిటెక్ కు చెందిన రియల్టర్లు రూ.16.55 కోట్ల మొత్తాన్ని 39మంది కొనుగోలుదారులకు తిరిగి చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. అయితే ఆ సందర్భంగా యూనిటెక్ ప్రాజెక్టు పూర్తికి ఆరెనెలలు గడువు కావాలని కోరిన సంగతి తెలిసిందే. -
డాయిష్ బ్యాంక్‌కు అమెరికా భారీ జరిమానా
14 బిలియన్ డాలర్ల డిమాండ్... ఫ్రాంక్ఫర్ట్: జర్మనీ దిగ్గజం డాయిష్ బ్యాంక్ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసే పెద్ద చిక్కు వచ్చి పడింది. వివరాల్లోకి వెళితే... 2008కి ముందు రెసిడెంట్ తనఖా ఆధారిత బాండ్లను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించడం ద్వారా ఆర్థిక సంక్షోభానికి తన వంతు కారణమయ్యిందన్న అంశంపై అమెరికా న్యాయశాఖ డాయిష్ బ్యాంకు నుంచి 14 బిలియన్ డాలర్లను తాజాగా డిమాండ్ చేసింది. నిజానికి గత కొంత కాలంలో ఈ అంశానికి సంబంధించి అమెరికా న్యాయశాఖ - బ్యాంక్ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇంత భారీ మొత్తంలో జరిమానా పడుతుందని డాయిష్ ఊహించకపోవడం తాజా బ్యాంక్ సంక్షోభానికి కారణమయ్యింది. కేవలం 3.4 బిలియన్ డాలర్ల మేర మాత్రమే డిమాండ్ ఉంటుందని మొదటి నుంచీ డాయిష్ భావిస్తూ వచ్చింది. అయితే ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తామని, ఆందోళన అక్కర్లేదని డాయిష్ బ్యాంక్ ప్రకటించింది. షేర్ డౌన్...: తాజా పరిణామం బ్యాంక్ షేర్ ధరపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఇప్పటికే ఈ ఏడాది దాదాపు సగం నష్టపోయిన డాయిష్ బ్యాంక్ షేర్ తాజాగా శుక్రవారం 7.6. శాతం పడిపోయింది. తాజా సంక్షోభాన్ని ఎదుర్కొనే దిశలో తన క్యాపిటల్ రేషియో బ్యాలెన్సింగ్ కోసం బ్యాంక్ ఇన్వెస్టర్ల నుంచి మరింత నిధులు సేకరించాల్సి రావచ్చనీ లేదా ఆస్తులూ అమ్మాల్సి రావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అమెరికా న్యాయశాఖ తన డిమాండ్‌ను సగానికి తగ్గించినా... ఇది దాదాపు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్న బ్యాంకుకు భారంగానే ఉంటుందన్నది నిపుణుల ఉద్దేశం. ఈ సమస్య జర్మనీకి కూడా ఇబ్బందిగా పరిణమించింది. పరస్పర చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని జర్మనీ ఆర్థిక మంత్రి వోల్ప్గాంగ్ వ్యక్తం చేశారు. -
విమానంలో జోక్.. రూ. 54 లక్షల ఫైన్
మియామి: విమానంలో పరిహాసమాడినందుకు ఓ ప్రయాణికుడికి అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. జోక్ చేసి విమాన రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు వెనిజులా వైద్యుడు మాన్యుల్ అల్బర్టో ఆల్వారాడో(60) అనే వ్యక్తికి మియామి కోర్టు 89,000 డాలర్ల (సుమారు రూ.5429000) జరిమానా వేసింది. గత అక్టోబర్ లో మియామి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కిన తర్వాత ఆల్వారాడో తన లగేజీలో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ పరిహాసమాడాడు. ఇది నిజమని నమ్మిన అధికారులు సెక్యురిటీ అలర్ట్ జారీ చేశారు. ఫలితంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. పరిహాసమాడాడని తర్వాత అతడు వెల్లడించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముందు అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. చేసిన పనికి సిగ్గుపడుతూ క్షమాపణ చెప్పడంతో చివరకు జరిమానాతో సరిపెట్టారు.