France Fines Google 500 Million Euros For Copyright Content Issue - Sakshi
Sakshi News home page

Google: గూగుల్‌ న్యూస్‌లో ‘కాపీ రైట్‌’ వివాదం! న్యూస్‌ ఏజెన్సీల ఫిర్యాదుతో..

Published Tue, Jul 13 2021 1:45 PM | Last Updated on Tue, Jul 13 2021 4:22 PM

France Fines Google 500 Million Euros Over News Copyright Issue - Sakshi

సెర్చింగ్‌ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్‌ తగిలింది. గూగుల్‌ న్యూస్‌ విషయంలో కాపీరైట్‌ నిబంధనల ఉల్లంఘన కింద భారీ జరిమానా విధించింది ఫ్రాన్స్‌. 

ప్యారిస్‌: ఫ్రాన్స్‌ కాంపిటీషన్‌ రెగ్యులేటర్‌ మంగళవారం గూగుల్‌(ఆల్ఫాబెట్స్‌ గూగుల్‌)కు భారీ జరిమానా విధించింది. ఈయూ కాపీరైట్స్‌ నిబంధనల ప్రకారం.. స్థానిక మీడియా హౌజ్‌ల కంటెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా గూగుల్‌న్యూస్‌ వాడుకుంటోందని పేర్కొంటూ 500 మిలియన్‌ యూరోలను ఫైన్‌ విధించింది. మన కరెన్సీలో ఆ జరిమానా విలువ రూ.4,415 కోట్లకు పైనే.

గూగుల్‌ న్యూస్‌లో తమ వెబ్‌సైట్లకు చెందిన కంటెంట్‌ను అనుమతి లేకుండా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని న్యూస్‌ ఏజెన్సీలు గతంలో ఫ్రాన్స్‌ కాంపిటీషన్‌ రెగ్యులేటర్‌ను ఆశ్రయించాయి. ఈ మేరకు మీడియా హౌజ్‌లతో సంప్రదింపులు జరపాలని గూగుల్‌కు తెలిపినప్పటికీ.. గూగుల్‌ నిర్లక్క్ష్యం వహించడంతో యాంటీట్రస్ట్‌ రెగ్యులేటర్స్‌ కింద ఇప్పుడు ఈ భారీ జరిమాను విధించింది. అంతేకాదు కాపీరైటెడ్‌ కంటెంట్‌ను వాడుకుంటున్నందుకు మీడియా పబ్లిషర్లకు రెమ్యునరేషన్‌ చెల్లించాలని, లేని పక్షంలో రోజుకు 9 లక్షల యూరోలను అదనంగా ఏజెన్సీలకు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement