Google Alphabet
-
మరో మైలురాయిని దాటిన గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్!
సుందర్ పిచాయ్ సీఈఓగా పనిచేస్తున్న గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఎట్టకేలకు 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని దాటింది. టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్ నవంబర్ 8న $2 ట్రిలియన్ మార్క్ ను దాటింది. ప్రస్తుతం ప్రతి షేర్ ధర $2,987.03 వద్ద ముగిసింది. ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాప్($1 ట్రిలియన్) జనవరి 2020 నుంచి రెట్టింపు అయింది. గూగుల్ సెర్చ్ 37.9 బిలియన్ డాలర్లు, యూట్యూబ్ 7.2 బిలియన్ డాలర్లు సంపాదించాయి. $2 ట్రిలియన్ క్లబ్లో ఉన్న యాపిల్, మైక్రోసాఫ్ట్ సరసన ఇప్పుడు ఆల్ఫాబెట్ చేరింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో $61.9 బిలియన్ల ఆల్-టైమ్ రికార్డ్ ఆదాయాన్ని ఆర్జించింది. అదే స్థాయిలో రికార్డు లాభాలు $18.9 బిలియన్లుకు పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్ నెలలో యాపిల్ ఈ మార్కును తాకగా, మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది జూన్ నెలలో 2 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో అత్యంత మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ గల కంపెనీగా అక్టోబర్ 29న అవతరించింది. అమెజాన్ కూడా 2 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరువలో ఉంది. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు యాపిల్ కంటే ఎక్కువ విలువైనది. సత్య నాదెళ్ల నేతృత్వంలోని క్లౌడ్ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇటీవల 1 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ కంపెనీలు ఇప్పుడు సమిష్టిగా దాదాపు 10 ట్రిలియన్ డాలర్ల విలువైనవి. ఈ మొత్తం ఎస్ అండ్ పీ 500 మొత్తం $41.8 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో దాదాపు పావు వంతు అని సీఎన్ఎన్ నివేదించింది. (చదవండి: యాపిల్‌పై పిడుగు..! ఇప్పట్లో ఐఫోన్ 13లేనట్లే..!) -
గూగుల్‌కు షాక్: ఫ్రాన్స్ భారీ జరిమానా
సెర్చింగ్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. గూగుల్ న్యూస్ విషయంలో కాపీరైట్ నిబంధనల ఉల్లంఘన కింద భారీ జరిమానా విధించింది ఫ్రాన్స్. ప్యారిస్: ఫ్రాన్స్ కాంపిటీషన్ రెగ్యులేటర్ మంగళవారం గూగుల్(ఆల్ఫాబెట్స్ గూగుల్)కు భారీ జరిమానా విధించింది. ఈయూ కాపీరైట్స్ నిబంధనల ప్రకారం.. స్థానిక మీడియా హౌజ్‌ల కంటెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా గూగుల్‌న్యూస్ వాడుకుంటోందని పేర్కొంటూ 500 మిలియన్ యూరోలను ఫైన్ విధించింది. మన కరెన్సీలో ఆ జరిమానా విలువ రూ.4,415 కోట్లకు పైనే. గూగుల్ న్యూస్‌లో తమ వెబ్సైట్లకు చెందిన కంటెంట్‌ను అనుమతి లేకుండా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని న్యూస్ ఏజెన్సీలు గతంలో ఫ్రాన్స్ కాంపిటీషన్ రెగ్యులేటర్‌ను ఆశ్రయించాయి. ఈ మేరకు మీడియా హౌజ్‌లతో సంప్రదింపులు జరపాలని గూగుల్‌కు తెలిపినప్పటికీ.. గూగుల్ నిర్లక్క్ష్యం వహించడంతో యాంటీట్రస్ట్ రెగ్యులేటర్స్ కింద ఇప్పుడు ఈ భారీ జరిమాను విధించింది. అంతేకాదు కాపీరైటెడ్ కంటెంట్‌ను వాడుకుంటున్నందుకు మీడియా పబ్లిషర్లకు రెమ్యునరేషన్ చెల్లించాలని, లేని పక్షంలో రోజుకు 9 లక్షల యూరోలను అదనంగా ఏజెన్సీలకు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. -
ప్రతి ఉత్పత్తిలో పునరుత్పాదక ప్లాస్టిక్: గూగుల్
శాన్ఫ్రాన్సిస్కో : 2022 నాటికి తమ ప్రతి ఉత్పత్తిలో పునరుత్పాదక (రీసైకిల్డ్) ప్లాస్టిక్‌ను వినియోగించనున్నామని ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్ ప్రతిజ్ఞ చేసింది. వచ్చే ఏడాది నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రయత్నిస్తామని సోమవారం ప్రకటించింది. గూగుల్ కొత్తగా తీసుకొన్న ఈ నిర్ణయంతో పర్యావరణంలో కార్బన్ ఉద్గారాల విడుదలను తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామంటు ఇది వరకే ప్రతిజ్ఞ చేసిన టెక్ కంపెనీల జాబితాలో చేరింది. గూగుల్ నుంచి ఉత్పత్తి అయ్యే మొబైల్ ఫోన్లు, స్పీకర్లు, ల్యాప్‌టాప్‌లను తరలించడానికి విమానాలకు బదులు ఓడలపై ఎక్కువ ఆధారపడటంతో తమ కంపెనీ రవాణాకు సంబంధించిన కార్బన్ ఉద్గారాలు 2017తో పోలిస్తే గత ఏడాది 40 శాతం పడిపోయాయని గూగుల్ పరికరాలు, సేవల విభాగాధిపతి ‘అన్నా మీగన్’ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. గూగుల్ కంపెనీ హార్డ్‌వేర్ వ్యాపారంలో అడుగుపెట్టి కేవలం 3 సంవత్సరాలే అయినప్పటికి, తమ ప్రత్యర్థి ఆపిల్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోందని మీగన్ వెల్లడించారు. తమ సంస్థ ఆన్లైన్లో విక్రయించే గూగుల్ హోమ్ స్పీకర్లు, యూఎస్బీ, పెన్‌డ్రైవ్‌లు ప్రతి తొమ్మిది గూగుల్ ఉత్పత్తులలో మూడింటికి ప్లాస్టిక్‌ను 20 శాతం నుంచి 42శాతం వరకు తిరిగి వినియోగించవచ్చనే అంశాన్ని గూగుల్ వర్గాలు పరిశీలిస్తున్నాయి. అంతేకాక ఒక బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ 2022 నాటికి 100 శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను మార్కెట్లో తీసుకురావడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. -
యాపిల్‌ను దాటిన గూగుల్ ‘ఆల్ఫాబెట్’
570 బిలియన్ డాలర్లకు మార్కెట్ విలువ శాన్ ఫ్రాన్సిస్కో: మెరుగైన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ గల కంపెనీగా టెక్ సంస్థ యాపిల్‌ను అధిగమించింది. సోమవారం మార్కెట్ ముగిసిన తర్వాత జరిగిన లావాదేవీల్లో షేరు ధర ప్రకారం ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ ఏకంగా 570 బిలియన్ డాలర్లకు ఎగిసింది. యాపిల్ మార్కెట్ విలువ 535 బిలియన్ డాలర్లు. సెలవుల సీజన్లో ఆన్లైన్ ప్రకటనల ఆదాయాల ఊతంతో డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆల్ఫాబెట్ లాభాలు 4.92 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇటు పీసీలు, అటు మొబైల్ పరికరాల విభాగాల్లోను ప్రకటనల ఆదాయం గణనీయంగా వచ్చినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.