సుందర్ పిచాయ్ సీఈఓగా పనిచేస్తున్న గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఎట్టకేలకు 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని దాటింది. టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్ నవంబర్ 8న $2 ట్రిలియన్ మార్క్ ను దాటింది. ప్రస్తుతం ప్రతి షేర్ ధర $2,987.03 వద్ద ముగిసింది. ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాప్($1 ట్రిలియన్) జనవరి 2020 నుంచి రెట్టింపు అయింది. గూగుల్ సెర్చ్ 37.9 బిలియన్ డాలర్లు, యూట్యూబ్ 7.2 బిలియన్ డాలర్లు సంపాదించాయి. $2 ట్రిలియన్ క్లబ్‌లో ఉన్న యాపిల్, మైక్రోసాఫ్ట్ సరసన ఇప్పుడు ఆల్ఫాబెట్ చేరింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో $61.9 బిలియన్ల ఆల్-టైమ్ రికార్డ్ ఆదాయాన్ని ఆర్జించింది. అదే స్థాయిలో రికార్డు లాభాలు $18.9 బిలియన్లుకు పెరిగాయి.
గత ఏడాది ఏప్రిల్ నెలలో యాపిల్ ఈ మార్కును తాకగా, మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది జూన్ నెలలో 2 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో అత్యంత మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ గల కంపెనీగా అక్టోబర్ 29న అవతరించింది. అమెజాన్ కూడా 2 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరువలో ఉంది. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు యాపిల్ కంటే ఎక్కువ విలువైనది. సత్య నాదెళ్ల నేతృత్వంలోని క్లౌడ్ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇటీవల 1 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ కంపెనీలు ఇప్పుడు సమిష్టిగా దాదాపు 10 ట్రిలియన్ డాలర్ల విలువైనవి. ఈ మొత్తం ఎస్ అండ్ పీ 500 మొత్తం $41.8 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో దాదాపు పావు వంతు అని సీఎన్ఎన్ నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment