news agency
-
మరో మీడియా సంస్థను కొనుగోలు చేసిన గౌతమ్ అదానీ
ప్రముఖ వ్యాపార వేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరో మీడియా సంస్థను కొనుగోలు చేశారు. ఇప్పటికే పలు మీడియా సంస్థల కొనుగోళ్లు,పెట్టుబడులు పెట్టిన ఆయన తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటాని చేజిక్కించుకున్నారు. ఐఏఎన్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 50.50 శాతం మెజారిటీ వాటాను తమ సబ్సిడరీ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ (ఏఎంఎన్ఎల్) కొనుగోలు చేసినట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. గత ఏడాది మార్చిలో ఫైనాన్షియల్ న్యూస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ బీక్యూ ప్రైమ్‌ను నిర్వహించే క్వింటిల్లియన్ బిజినెస్ మీడియాను టేకోవర్ చేయడం ద్వారా మీడియా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అదే ఏడాది డిసెంబర్లో న్యూస్ టెలివిజన్ చానల్ ఎన్డీటీవీలో 65 శాతం వాటాను కొన్నది. ఇప్పుడు ఐఏఎన్ఎస్లో వాటా కొనుగోలు చేసి మీడియా రంగంలో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఖాతాను లాక్ చేసిన ట్విటర్.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..!
మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ - ఏఎన్ఐ (ANI) ఖాతాను లాక్ చేసింది. కనీస వయసు ప్రమాణాలను పాటించనందుకు తమ ఖాతాను ట్విటర్ లాక్ చేసిందని ఏఎన్ఐ ఎడిటర్ స్మితా ప్రకాష్ తాజాగా తెలిపారు. ఈ వార్తా సంస్థకు ట్విటర్ హ్యాండిల్‌ను క్లిక్ చేయడానికి ప్రయత్నించగా 'ఈ ఖాతా ఉనికిలో లేదు' అని చూపుతోంది. ఇదీ చదవండి: ఏటీఎం చార్జీలు.. జీఎస్టీ కొత్తరూల్! మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే.. ఏఎన్ఐ ట్విటర్ ఖాతా లాక్ అయిన కొన్ని నిమిషాల తర్వాత స్మితా ప్రకాష్ ఏఎన్ఐ హ్యాండిల్ లాక్ చేసినట్లు తెలియజేస్తూ ట్విటర్ పంపిన ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను తన వ్యక్తిగత ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. మొదట మా ఖాతాకున్న గోల్డ్ టిక్ తీసేసి బ్లూటిక్ ఇచ్చారు. ఇప్పుడు లాక్ చేశారు అంటూ ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు. ‘ట్విటర్ ఖాతాను సృష్టించడానికి, మీకు కనీసం 13 సంవత్సరాలు ఉండాలి. మీరు ఈ వయసు నిబంధనకు అనుగుణంగా లేరని ట్విటర్ నిర్ధారించింది. కాబట్టి మీ ఖాతాను లాక్ చేశాం’ అని ఈ-మెయిల్లో ట్విటర్ పేర్కొంది. ఇదీ చదవండి: Google Play Store: గూగుల్ సంచలనం! 3500 యాప్‌ల తొలగింపు.. ఏఎన్ఐ వెబ్సైట్ ప్రకారం.. దక్షిణాసియా ప్రముఖ మల్టీమీడియా వార్తా సంస్థ అయిన ఏఎన్ఐకి భారతదేశం, దక్షిణ ఆసియా సహా ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ బ్యూరో సెంటర్లు ఉన్నాయి. ఇక ఏఎన్ఐ ట్విటర్ ఖాతాకు 7.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎన్డీటీవీ ఖాతా కూడా.. మరోవైపు ఎన్డీటీవీ ఖాతాను కూడా ట్విటర్ లాక్ చేసింది. ఎన్డీటీవీ ట్విటర్ హ్యాండిల్‌ను ఓపెన్ చేయగా అకౌంట్ ఉనికిలో లేనట్లు చూపిస్తోంది. అయితే ఎన్డీటీవీ ట్విటర్ అకౌంట్ ఎందుకు నిలిచిపోయిందన్నది తెలియరాలేదు. -
గూగుల్‌కు భారత్‌లో భారీ ఝలక్!
టెక్ దిగ్గజం గూగుల్‌కు భారత్‌లో మరో ఝలక్ తగిలింది. చెల్లింపులు లేకుండా గూగుల్ సెర్చ్ ఫలితాల్లో వార్తలను ప్రచురించడంపై వార్తా సంస్థల అభ్యంతరాలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు గూగుల్‌కి వ్యతిరేకంగా వార్త ప్రచురణ సంస్థలు చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆండ్రాయిడ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడంతో పాటు థర్డ్ పార్టీగా ఉంటూ యాప్ డెవలపర్స్‌ను కమిషన్ పేరుతో ఇబ్బంది పెడుతోందన్న ఆరోపణలపై గూగుల్‌పై ఇదివరకే సీసీఐ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే యాంటీ ట్రస్ట్ చట్టాల్ని గూగుల్ ఉల్లంఘిస్తోందంటూ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోషియేషన్(డీఎన్‌పీఏ) తాజాగా సీసీఐని ఆశ్రయించాయి. దేశంలో కొన్ని మీడియా కంపెనీలకు సంబంధించిన డిజిటల్ విభాగాల్లో ఒకటైన డీఎన్‌పీఏ.. తమ సభ్యులకు ప్రకటనల ఆదాయాన్ని పారదర్శకంగా చెల్లించేందుకు గూగుల్ విముఖత వ్యక్తం చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టింది సీసీఐ. దేశంలోని నిర్దిష్ట ఆన్లైన్ సెర్చ్ సేవలపై Google ఆధిపత్యం చెలాయిస్తోందని, వార్తా ప్రచురణకర్తలపై అన్యాయమైన షరతులు విధిస్తోందని పేర్కొంటూ దర్యాప్తునకు ఆదేశించింది సీసీఐ. ప్రజాస్వామ్యంలో కీలకంగా వ్యవహరిస్తున్న న్యూస్ మీడియాను అణగదొక్కడమే అవుతుందని కీలక వ్యాఖ్యలు చేస్తూ దర్యాప్తునకు ఆదేశించింది సీసీఐ. ఇదిలా ఉంటే Google వంటి ఆన్లైన్ అగ్రిగేటర్లకు ప్రకటనల ఆదాయాన్ని కోల్పోతున్నాయి వార్తా సంస్థలు. టెక్ కంపెనీలు తమ సెర్చ్ ఫలితాలలో కథనాలను, చెల్లింపు లేకుండా ఇతర ఫీచర్లను ఉపయోగిస్తాయంటూ కొన్నేళ్లుగా వార్త సంస్థలు గళం వినిపిస్తున్నా ఇన్నాళ్లూ ప్రయోజనం లేకుండా పోయింది. ఒక్క భారత్‌లోనే కాదు.. మరికొన్ని దేశాల్లో సైతం ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటుండగా.. భారీ భారీ జరిమానాలు విధిస్తున్నాయి ఆయా దేశాల విచారణ సంస్థలు. ఈ నేపథ్యంలో భారత్‌లో తాజాగా ఎదురైన పరిణామం గూగుల్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్లయ్యింది. సంబంధిత వార్త: గూగుల్‌న్యూస్.. గూగుల్‌కు ఫ్రాన్స్ రూ.4,415 కోట్ల ఫైన్ -
గూగుల్‌కు షాక్: ఫ్రాన్స్ భారీ జరిమానా
సెర్చింగ్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. గూగుల్ న్యూస్ విషయంలో కాపీరైట్ నిబంధనల ఉల్లంఘన కింద భారీ జరిమానా విధించింది ఫ్రాన్స్. ప్యారిస్: ఫ్రాన్స్ కాంపిటీషన్ రెగ్యులేటర్ మంగళవారం గూగుల్(ఆల్ఫాబెట్స్ గూగుల్)కు భారీ జరిమానా విధించింది. ఈయూ కాపీరైట్స్ నిబంధనల ప్రకారం.. స్థానిక మీడియా హౌజ్‌ల కంటెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా గూగుల్‌న్యూస్ వాడుకుంటోందని పేర్కొంటూ 500 మిలియన్ యూరోలను ఫైన్ విధించింది. మన కరెన్సీలో ఆ జరిమానా విలువ రూ.4,415 కోట్లకు పైనే. గూగుల్ న్యూస్‌లో తమ వెబ్సైట్లకు చెందిన కంటెంట్‌ను అనుమతి లేకుండా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని న్యూస్ ఏజెన్సీలు గతంలో ఫ్రాన్స్ కాంపిటీషన్ రెగ్యులేటర్‌ను ఆశ్రయించాయి. ఈ మేరకు మీడియా హౌజ్‌లతో సంప్రదింపులు జరపాలని గూగుల్‌కు తెలిపినప్పటికీ.. గూగుల్ నిర్లక్క్ష్యం వహించడంతో యాంటీట్రస్ట్ రెగ్యులేటర్స్ కింద ఇప్పుడు ఈ భారీ జరిమాను విధించింది. అంతేకాదు కాపీరైటెడ్ కంటెంట్‌ను వాడుకుంటున్నందుకు మీడియా పబ్లిషర్లకు రెమ్యునరేషన్ చెల్లించాలని, లేని పక్షంలో రోజుకు 9 లక్షల యూరోలను అదనంగా ఏజెన్సీలకు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. -
గల్వాన్ ఘర్షణపై సంచలన విషయాలు బహిర్గతం..
మాస్కో: భారత్, చైనా దేశాల మధ్య తూర్పు లద్ధాక్‌లోని గల్వాన్ లోయలో గతేడాది జరిగిన ఘర్షణలో చైనాకే ఎక్కువ ప్రాణ నష్టం వాటిల్లిందని రష్యా న్యూస్ ఏజన్సీ టీఏఎస్ఎస్ సంచలన విషయాలను వెల్లడించింది. ఆ ఘర్షణలో చైనాకు చెందిన 45 మంది సైనికులు మరణించినట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది. 2020 జూన్ 15న ఎల్ఏసీ వద్ద భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దుస్సాహసం చేయగా, 16వ బీహార్ బెటాలియన్‌కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత సైనికులు చైనా దళాలకు ధీటుగా జవాబిచ్చారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులయనట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. అయితే చైనా మాత్రం వారికి జరిగిన ప్రాణనష్టంపై ప్రకటన విడుదల చేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనలో చైనాకు చెందిన 40 మందికిపైగా సైనికులు మరణించి ఉంటారని విదేశీ మీడియా కథనాలు వెలువరించినప్పటికీ, చైనా మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేదు. కాగా, ఈ ఘర్షణ అనంతరం భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు పోటాపోటిగా సైనిక దళాలను సరిహద్దుల్లో మోహరించాయి. సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సైనిక, దౌత్య చర్చలు పలు దశల్లో కొనసాగాయి. ఘర్షణ జరిగిన పది నెలల అనంతరం బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఇరు దేశాల మధ్య స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం బుధవారం అధికారికంగా వెల్లడించగా, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంట్లో ప్రస్తావించారు. -
ఉత్తరఖండ్‌లో పలుచోట్ల భూ ప్రకంపనలు
ఉత్తరఖండ్: ఉత్తరఖండ్‌లో పలుచోట్ల గురువారం రాత్రి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు న్యూస్ ఏజెన్సీ నివేదిక ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉత్తరఖండ్ తోపాటు సమీప ప్రాంతాలైన నయినైతల్, చామౌలి, భిమతాల్, పిథోఘడ్ లలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు జియోలాజికల్ విభాగ కేంద్రం పేర్కొంది.