ప్రముఖ వ్యాపార వేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరో మీడియా సంస్థను కొనుగోలు చేశారు. ఇప్పటికే పలు మీడియా సంస‍్థల కొనుగోళ్లు,పెట్టుబడులు పెట్టిన ఆయన తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్‌లో మెజారిటీ వాటాని చేజిక్కించుకున్నారు.
ఐఏఎన్‌ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 50.50 శాతం మెజారిటీ వాటాను తమ సబ్సిడరీ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ (ఏఎంఎన్‌ఎల్) కొనుగోలు చేసినట్టు అదానీ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది.
గత ఏడాది మార్చిలో ఫైనాన్షియల్ న్యూస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ బీక్యూ ప్రైమ్‌ను నిర్వహించే క్వింటిల్లియన్ బిజినెస్ మీడియాను టేకోవర్ చేయడం ద్వారా మీడియా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అదే ఏడాది డిసెంబర్‌లో న్యూస్ టెలివిజన్ చానల్ ఎన్‌డీటీవీలో 65 శాతం వాటాను కొన్నది. ఇప్పుడు ఐఏఎన్‌ఎస్‌లో వాటా కొనుగోలు చేసి మీడియా రంగంలో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment