‘అంతా దైవ నిర్ణయమే’..83 వేల కోట్ల డీల్‌ రద్దుపై జీ సీఈఓ | Zee Ceo Punit Goenka Posts After Sony Terminates Deal | Sakshi
Sakshi News home page

‘అంతా దైవ నిర్ణయమే’..83 వేల కోట్ల డీల్‌ రద్దుపై జీ సీఈఓ

Published Mon, Jan 22 2024 9:06 PM | Last Updated on Mon, Jan 22 2024 9:10 PM

Zee Ceo Punit Goenka Posts After Sony Terminates Deal - Sakshi

జీ-సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియాల మధ్య కుదుర్చుకున్న భారీ ఒప్పందం రద‍్దయింది. అయితే, దీనిపై జీ సీఈఓ పునీత్‌ గోయెంకా తనదైన శైలిలో స్పందించారు. 

అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముఖ్య అతిదిగా హాజరయ్యారు. అనంతరం ఎక్స్‌.కామ్‌లో అయోద్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుక ఫోటోల్ని జత చేస్తూ.. ఈ రోజు ఉదయం ఎంతో ముఖ్యమైన అయోద్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యాను. 

గత రెండేళ్లుగా నేను ఎంతగానో అత్యంత నిజాయితీగా ప్రయత్నించినప్పటికీ సోనీ పిక్చర్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం రద్దయినట్లు మెసేజ్‌ వచ్చింది. ఈ విలీన ప్రక్రియ ఆగిపోవడం దైవ నిర్ణయంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నేను సానుకూలంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. భారత్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థ వాటాదారులందరిని  బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement