
భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ ప్రసారాల విషయంలో జీ - డిస్నీ హాట్ స్టార్ మధ్య 1.4 బిలియన్ల డాలర్ల సబ్ లైసెన్సింగ్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం నుంచి జీ బయటకు వచ్చింది. దీంతో న్యాయ పోరాటం చేసేందుకు డిస్నీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే డిస్నీ మాతృసంస్థ సోనీ గ్రూప్ సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంలో దావా వేసింది.
ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించినందుకు సోనీకి తొలి విడతగా జీ గ్రూప్ 200 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. కానీ చెల్లించడంలో జీ విఫలమైంది.ఒప్పందాన్ని కొనసాగించలేమని తెలిపింది.
దీంతో జీపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సోనీ గ్రూప్ ఉపక్రమించింది. కాగా, ఈ పరిణామాలపై జీ గ్రూప్, సోనీ గ్రూప్‌లు అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment