Puneet
-
మైక్రోసాఫ్ట్‌కు భారత్ కీలకం
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగాల గురించి తెలిసే కొద్దీ, దానిపై సాధారణంగా నెలకొన్న వ్యతిరేకత స్థానంలో క్రమంగా సానుకూల ధోరణి పెరుగుతోందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా విభాగం ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు. తమ ’కోపైలట్’ ఏఐ అసిస్టెంట్ ప్రస్తుతం కృత్రిమ మేథకు దాదాపు పర్యాయపదంగా మారుతోందని పేర్కొన్నారు. ఇటీవలి అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురు ఏఐ డెవలపర్లలో ఒకరు భారత్ నుంచి ఉంటున్నారని చందోక్ తెలిపారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు అన్ని టెక్ కంపెనీలకు భారత్ అత్యంత కీలకమైన మార్కెట్లలో ఒకటిగా ఉందని ఆయన పేర్కొన్నారు. తమ సంస్థపరంగా చూస్తే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటని చందోక్ చెప్పారు. పటిష్టంగా డిమాండ్, సరఫరా.. ఇటు డిమాండ్ అటు సరఫరాపరంగా భారత మార్కెట్ పటిష్టంగా ఉందని చందోక్ చెప్పారు. ‘డిమాండ్‌పరంగా చూస్తే భారత్‌లో 7,000 పైగా లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థ ఉంది. సరఫరాపరంగా చూస్తే మైక్రోసాఫ్ట్‌కి చెందిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్లాట్‌ఫాం ’గిట్‌హబ్’లో అమెరికా తర్వాత అత్యధికంగా భారత్ నుంచి దాదాపు 1.5 కోట్ల మంది డెవలపర్లు ఉన్నారు. మరో రెండు మూడేళ్లలో ఈ సంఖ్య అమెరికాను కూడా దాటిపోతుంది‘ అని చందోక్ పేర్కొన్నారు. -
‘జీ’కి మరో ఎదురు దెబ్బ.. న్యాయ పోరాటం చేయనున్న సోనీ
భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ ప్రసారాల విషయంలో జీ - డిస్నీ హాట్ స్టార్ మధ్య 1.4 బిలియన్ల డాలర్ల సబ్ లైసెన్సింగ్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం నుంచి జీ బయటకు వచ్చింది. దీంతో న్యాయ పోరాటం చేసేందుకు డిస్నీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే డిస్నీ మాతృసంస్థ సోనీ గ్రూప్ సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంలో దావా వేసింది. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించినందుకు సోనీకి తొలి విడతగా జీ గ్రూప్ 200 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. కానీ చెల్లించడంలో జీ విఫలమైంది.ఒప్పందాన్ని కొనసాగించలేమని తెలిపింది. దీంతో జీపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సోనీ గ్రూప్ ఉపక్రమించింది. కాగా, ఈ పరిణామాలపై జీ గ్రూప్, సోనీ గ్రూప్‌లు అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. -
నారాయణ సంస్థలు, భూములకు లబ్ది చేకూరేలా అలైన్మెంట్ మార్పులు
-
రెండో రోజు నారాయణ అల్లుడు పునీత్ సీఐడీ విచారణ
-
నారాయణ అల్లుడిని విచారిస్తున్న సీఐడీ
-
నడిరోడ్డుపై మందు తాగుతూ బురదలో దొర్లిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
బిగ్‌బాస్ ఛాన్స్ వస్తే ఎగిరి గంతేయడం కాదు, హౌస్‌లో కనీసం కొన్నివారాలైనా నెట్టుకువచ్చే విధంగా ఉండాలి. కానీ కొందరు దురదృష్టవశాత్తూ వారి ప్రతిభ చూపేలోపే వారం, రెండు వారాలకే ఎలిమినేట్ అవుతూ ఉంటారు. అయితే బిగ్‌బాస్ చరిత్రలో ఓ కంటెస్టెంట్ మాత్రం షో ప్రారంభమైన 24 గంటల్లోనే ఎలిమినేట్ అయ్యాడు. అతడే పునీత్ సూపర్ స్టార్. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్ ఓటీటీ రెండో సీజన్లో ఇతడు కూడా పాల్గొన్నాడు. చిత్రవిచిత్ర వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన ఇతడు బిగ్‌బాస్ హౌస్‌లో కెమెరాలతో ఆడుకునేందుకు ప్రయత్నించాడు. క్రిమిసంహారక డబ్బా కనిపించగానే దాన్ని ఓపెన్ చేసి మీద పోసుకున్నాడు. ఇతడి చర్యకు బిత్తరపోయిన బిగ్‌బాస్ వెంటనే అతడిని బయటకు పంపించేశాడు. బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయిన అతడు తన పిచ్చి చేష్టలనే వీడియోగా చిత్రీకరిస్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీలో నడి రోడ్డుపై మందు తాగిన పునీత్ అక్కడున్న మురికి గుంతలో పడి దొర్లాడు. ఏదో ఘనకార్యం చేశానన్నట్లుగా చిరునవ్వుతో పైకి లేచాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఛీ.. అలా మురికిగుంటలో పడితే ఆరోగ్యం దెబ్బ తింటుందన్న సోయి కూడా లేదు. ఈ దరిద్రపు పనులు కాకుండా బయట ఇంకేదైనా పని చేసి సంపాదించొచ్చు కదా', 'ఈ చెత్తంతా మాకెందుకు?', 'నిన్ను హౌస్ నుంచి పంపించేసి మంచి పని చేశారు', 'మురికి కాలువలో పంది బొర్లినట్లు బొర్లుతున్నాడేంటి' అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే బిగ్‌బాస్ షోలో తన రీఎంట్రీ గురించి మాట్లాడుతూ.. మరింత ఎక్కువ డబ్బులిస్తేనే తిరిగి హౌస్‌లో అడుగుపెడతానని చెప్పుకొస్తున్నాడు. View this post on Instagram A post shared by prakash kumar (@puneetsuper_starrrr) View this post on Instagram A post shared by prakash kumar (@puneetsuper_starrrr) చదవండి: ఆ సంఘటనతో నిద్రలేని రాత్రులు.. దుల్కర్ సల్మాన్‌కు ఏమైంది? -
జింజర్..పవర్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఇంజినీరింగ్ టీమ్
‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు?’ అని అడిగితే చెప్పడం కష్టం కావచ్చుగానీ ‘జింజర్’ నిర్మాణానికి మేధోశక్తిని ఇచ్చిన వారు ఎవరు? అని అడిగితే జవాబు చెప్పడం మాత్రం సులభం! ఏమిటి జింజర్? ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(ఐహెచ్సిఎల్), టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ముంబైలోని శాంతక్రూజ్లో శ్రీకారం చుట్టిన జింజర్ హోటల్‌కు ఆల్–ఉమెన్ ఇంజినీరింగ్ టీమ్ నిర్మాణ సారథ్యం వహిస్తుంది. నిర్మాణరంగంలో స్త్రీల ఉన్నతావకాశాలకు సంబంధించి ఇది గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు. ‘అనేక రంగాలలో స్త్రీలు తమను తాము నిరూపించుకుంటున్నారు. తమ ప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ టీమ్ విజయం వారి వ్యక్తిగత విజయానికి మాత్రమే పరిమితం కాదు. నిర్మాణం, ఇంజినీరింగ్ రంగాలలో ఉన్నత అవకాశాలు వెదుక్కోవడానికి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నారు ఐహెచ్సిఎల్ సీయివో పునీత్ చత్వాల్. ఆల్–ఉమెన్ టీమ్ ఏమిటి? మగవాళ్లు పనిచేయడానికి సుముఖంగా లేరా!...అంటూ అమాయకంగానో, అతి తెలివితోనో ఆశ్చర్యపోయేవాళ్లు ఉండొచ్చునేమో. అయితే అలాంటి అకారణ ఆశ్చర్యాలు స్త్రీల ప్రతిభ, శక్తిసామర్థ్యాల ముందు తలవంచుతాయని, వేనోళ్ల పొగుడుతాయని చరిత్ర చెబుతూనే ఉంది. కొన్నిసార్లు కట్టడాలు కట్టడాలుగానే ఉండవు. అందులో ప్రతి ఇటుక ఒక కథ చెబుతుంది. స్ఫూర్తిని ఇస్తుంది. శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. 371 గదులతో నిర్మాణం కానున్న జింజర్ ఇలాంటి కట్టడమే అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. -
జీ పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్(జీల్) పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా తాజాగా వెల్లడించారు. బోర్డు మార్గదర్శకత్వంలో కంపెనీ భవిష్యత్‌కు అనువైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. నెల రోజుల మౌనాన్ని వీడుతూ గోయెంకా.. గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో ప్రతిపాదించిన డీల్ అంశాన్ని ఇన్వెస్కో పబ్లిక్కు వెల్లడించకపోవడాన్ని ప్రశ్నించారు. జీలో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తున్న ఇన్వెస్కో కొద్ది రోజులుగా అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఏజీఎం)కి పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తద్వారా పునీత్ గోయెంకాసహా బోర్డులో ఇతర నామినీలను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పునీత్ గోయెంకా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇంతక్రితం వేసిన ప్రణాళికలను పబ్లిక్కు ఎందుకు తెలియజేయలేదని ఇన్వెస్కోను వేలెత్తి చూపారు. కార్పొరేట్ సుపరిపాలన అనేది కార్పొరేట్లకు మాత్రమేకాదని, కంపెనీలో వాటా కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకూ వర్తిస్తుందని ఇన్వెస్కోనుద్ధేశించి పేర్కొన్నారు. జీల్లో.. ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ ఎల్‌ఎల్‌సీతోపాటు ఇన్వెస్కో 17.88 శాతం వాటాను కలిగి ఉంది. జీ భవిష్యత్‌ను ప్రభావితం చేసేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా పెంచుకుంటూ వస్తున్న వాటాదారుల విలువకు దెబ్బతగలనీయబోమని వ్యాఖ్యానించారు. ఇన్వెస్కోతో వివాదం నేపథ్యంలో జీ మరిన్ని వృద్ధి అవకాశాలను అందుకుంటుందని, మరింత పటిష్టపడుతుందని తెలియజేశారు. తద్వారా మీడియా, వినోద రంగాలలో దిగ్గజ కంపెనీగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ భవిష్యత్ కోసం మాత్రమే పోరాడుతున్నానని, తన స్థానాన్ని కాపాడుకునేందుకు కాదని గోయెంకా ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. రిలయన్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయతి్నంచిన ఇన్వెస్కో విఫలమైందని, ఈ విషయాన్ని దాచిపెట్టిందని వివరించారు. వాటాదారుల ప్రయోజనార్ధమే ఈ నిజాలను బోర్డు ముందుంచినట్లు పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో క్లెన్స్టా ప్లాంట్!
హైదరాబాద్, సాక్షి బిజినెస్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో తమ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేస్తామని పర్సనల్ హెల్త్‌కేర్ సంస్థ క్లెన్స్టా వ్యవస్థాపకుడు పునీత్ గుప్తా చెప్పారు. దాదాపు రూ.35 కోట్లతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తామని, దీని ఉత్పత్తి సామర్ధ్యం రోజుకు రెండు లక్షల బాటిళ్లని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు పూర్తి చేశామన్నారు. కంపెనీ తాజాగా మార్కెట్లోకి వాటర్‌లెస్ బాడీ బాత్, వాటర్‌లెస్ షాంపూలను తెచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలరహిత వైయుక్తిక శుభ్రత ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోందని చెప్పారు. రక్షణ, హాస్పిటల్స్, లాంగ్టూర్స్ చేసేవాళ్లు, అంతరిక్ష ప్రయాణాల్లో వాటర్‌లెస్ హెల్త్‌కేర్ ఉత్పత్తుల అవసరం చాలా ఉందన్నారు. త్వరలో వాటర్‌లెస్ టూత్‌పేస్ట్, మస్కుటో రిపెల్లెంట్‌ను సైతం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నామన్నారు. తమ 100 ఎంఎల్ బాటిల్‌తో దాదాపు 350 లీటర్ల నీరు ఆదా అవుతుందన్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమ విలువ 11వేల కోట్ల రూపాయలని, ఇందులో మెజార్టీ వాటా సంపాదించేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. నీటి ఆదాకు ప్రాధాన్యం రాబోయే రోజుల్లో 70 కోట్ల రూపాయల రెవెన్యూ లకి‡్ష్యస్తున్నట్లు తెలిపారు. త్వరలో 30– 70 కోట్ల రూపాయల నిధుల సమీకరణ చేయబోతున్నట్లు తెలిపారు. దేశంలోని ఎయిమ్స్, ఎస్కేఎం, యశోదా లాంటి పెద్ద హాస్పిటల్స్‌తో ఒప్పందాలున్నాయని చెప్పారు. ఇటీవలే తమ ఉత్పత్తులను ఇకామ్ సైట్లలో విక్రయించేందుకు ఉంచామని, వీటికి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. రన్‌వేల్లో పేరుకుపోయే రబ్బర్‌ను నీటి వినియోగం లేకుండా తొలగించే ద్రావకాన్ని తయారు చేయబోతున్నామని, ఈ విధంగా కేవలం వైయుక్తిక పరిశుభ్రతా ఉత్పత్తుల రంగంలోనే కాకుండా జలసంరక్షణకు వీలున్న అన్ని రంగాల్లో తమ ఉత్పత్తులు తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. -
విద్యార్థి ప్రాణం బలిగొన్న కరెంటు తీగ
కంకిపాడు : పాఠశాల క్రీడా మైదానంలో సహచరుడితో ఆడుకుంటున్న ఓ విద్యార్థి ఆదమరుపుగా ఉండి కిందకు వేలాడుతున్న విద్యుత్ తీ గను తాకి ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక సెయింట్ మేరీస్ పాఠశాలలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రా మానికి చెందిన దండు పునీత్(15) కంకిపాడు సెయిట్ మేరీస్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇతడి తల్లి అరుణకుమారి తీవ్ర అనారోగ్యంతో 20 రోజుల కిందటే మృతి చెందింది. తండ్రి ప్రసాద్ కుటుంబానికి దూ రంగా ఉంటున్నారు. దీంతో పునీత్ తన మేనమామ వర్రె చిట్టి వెంకటేశ్వరరావు వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. శనివారం ఉదయం పాఠశాలకు వచ్చిన పునీత్.. ట్యూషన్ అయ్యాక టిఫి న్ చేసే సమయంలో ఆట స్థలంలో క్రికెట్ బం తితో సహ విద్యార్థి ఎన్.అరవింద్‌తో కలిసి క్యాచ్‌లు ఆడుతున్నాడు. ఆటస్థలం, పంట పొ లానికి మధ్యగా వెళ్తున్న విద్యుత్ లైను తీగల్లో ఒకటి నేలకు కేవలం మూడు అడుగుల ఎత్తులో వేలాడుతోంది. పునీత్ ఆట ధ్యాసలో ఉండి పొరపాటున దానిని తాకాడు. అతడు షాక్‌కు గురై కొట్టుకోవడాన్ని సహ విద్యార్థి అరవింద్ చూసి కర్రతో కొట్టి కాపాడేందుకు యత్నించినా ఫలితం దక్కలేదు. పాఠశాల నిర్వాహకులు పునీత్‌ను సమీపంలోని ఆరోగ్యమాత ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మృతదేహాన్ని సందర్శించిన నేతలు విద్యార్థి మృతి గురించి సమాచారం అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, డీఈవో డి.దేవానందరెడ్డి, ఎంపీపీ దేవినేని రాజా వెంకటేశ్వర ప్రసా ద్ ఘటనాస్థలికి వచ్చారు. ఈ ప్రమాదం గురిం చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ, పాఠశాల యాజమాన్యం, ఆస్పత్రి సిబ్బం ది నిర్లక్ష్యంపై పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్, పీఈటీ సస్పెన్షన్ పాఠశాలలో జరిగిన ఘటనకు బాధ్యులను చేస్తూ ప్రిన్సిపాల్ సిస్టర్ గ్రేస్లెట్, పీఈటీ మాణిక్యంను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో దేవానందరెడ్డి ప్రకటించారు. పాఠశాల గుర్తింపును రద్దు చేసే విషయమై షోకాజ్ నోటీసు జారీ చేస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించి పాఠశాల యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని డీఈవో తెలిపారు. కంకిపాడు సీఐ రవికుమార్, ఎస్ఐ శ్రీనివాస్ ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లి చనిపోయిన నెలరోజుల లోపే కుమారుడు ఆమె చెంతకు చేరుకున్నాడంటూ స్థానికులు కంట తడి పెట్టారు.