
బిగ్‌బాస్ ఛాన్స్ వస్తే ఎగిరి గంతేయడం కాదు, హౌస్‌లో కనీసం కొన్నివారాలైనా నెట్టుకువచ్చే విధంగా ఉండాలి. కానీ కొందరు దురదృష్టవశాత్తూ వారి ప్రతిభ చూపేలోపే వారం, రెండు వారాలకే ఎలిమినేట్ అవుతూ ఉంటారు. అయితే బిగ్‌బాస్ చరిత్రలో ఓ కంటెస్టెంట్ మాత్రం షో ప్రారంభమైన 24 గంటల్లోనే ఎలిమినేట్ అయ్యాడు. అతడే పునీత్ సూపర్ స్టార్.
సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్ ఓటీటీ రెండో సీజన్‌లో ఇతడు కూడా పాల్గొన్నాడు. చిత్రవిచిత్ర వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన ఇతడు బిగ్‌బాస్ హౌస్‌లో కెమెరాలతో ఆడుకునేందుకు ప్రయత్నించాడు. క్రిమిసంహారక డబ్బా కనిపించగానే దాన్ని ఓపెన్ చేసి మీద పోసుకున్నాడు. ఇతడి చర్యకు బిత్తరపోయిన బిగ్‌బాస్ వెంటనే అతడిని బయటకు పంపించేశాడు. బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయిన అతడు తన పిచ్చి చేష్టలనే వీడియోగా చిత్రీకరిస్తున్నాడు.
ఈ క్రమంలో ఢిల్లీలో నడి రోడ్డుపై మందు తాగిన పునీత్ అక్కడున్న మురికి గుంతలో పడి దొర్లాడు. ఏదో ఘనకార్యం చేశానన్నట్లుగా చిరునవ్వుతో పైకి లేచాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఛీ.. అలా మురికిగుంటలో పడితే ఆరోగ్యం దెబ్బ తింటుందన్న సోయి కూడా లేదు. ఈ దరిద్రపు పనులు కాకుండా బయట ఇంకేదైనా పని చేసి సంపాదించొచ్చు కదా', 'ఈ చెత్తంతా మాకెందుకు?', 'నిన్ను హౌస్ నుంచి పంపించేసి మంచి పని చేశారు', 'మురికి కాలువలో పంది బొర్లినట్లు బొర్లుతున్నాడేంటి' అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే బిగ్‌బాస్ షోలో తన రీఎంట్రీ గురించి మాట్లాడుతూ.. మరింత ఎక్కువ డబ్బులిస్తేనే తిరిగి హౌస్‌లో అడుగుపెడతానని చెప్పుకొస్తున్నాడు.
చదవండి: ఆ సంఘటనతో నిద్రలేని రాత్రులు.. దుల్కర్ సల్మాన్‌కు ఏమైంది?
Comments
Please login to add a commentAdd a comment