ఏఐకు క్రమంగా పెరుగుతున్న మద్దతు
కంపెనీ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగాల గురించి తెలిసే కొద్దీ, దానిపై సాధారణంగా నెలకొన్న వ్యతిరేకత స్థానంలో క్రమంగా సానుకూల ధోరణి పెరుగుతోందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా విభాగం ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు. తమ ’కోపైలట్’ ఏఐ అసిస్టెంట్ ప్రస్తుతం కృత్రిమ మేథకు దాదాపు పర్యాయపదంగా మారుతోందని పేర్కొన్నారు.
ఇటీవలి అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురు ఏఐ డెవలపర్లలో ఒకరు భారత్ నుంచి ఉంటున్నారని చందోక్ తెలిపారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు అన్ని టెక్ కంపెనీలకు భారత్ అత్యంత కీలకమైన మార్కెట్లలో ఒకటిగా ఉందని ఆయన పేర్కొన్నారు. తమ సంస్థపరంగా చూస్తే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటని చందోక్ చెప్పారు.
పటిష్టంగా డిమాండ్, సరఫరా..
ఇటు డిమాండ్ అటు సరఫరాపరంగా భారత మార్కెట్ పటిష్టంగా ఉందని చందోక్ చెప్పారు. ‘డిమాండ్‌పరంగా చూస్తే భారత్‌లో 7,000 పైగా లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థ ఉంది. సరఫరాపరంగా చూస్తే మైక్రోసాఫ్ట్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫాం ’గిట్‌హబ్’లో అమెరికా తర్వాత అత్యధికంగా భారత్ నుంచి దాదాపు 1.5 కోట్ల మంది డెవలపర్లు ఉన్నారు. మరో రెండు మూడేళ్లలో ఈ సంఖ్య అమెరికాను కూడా దాటిపోతుంది‘ అని
చందోక్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment