ప్రముఖ మీడియా దిగ్గజం సోనీ గ్రూప్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకోనుంది. భారత్‌కు చెందిన జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (జీల్)తో కుదుర్చుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
జపాన్‌కి చెందిన డైవర్సిఫైడ్ దిగ్గజం సోనీ గ్రూప్.. జీతో పెట్టుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనుందని, అందుకు ఆ సంస్థ ఫౌండర్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర, కుమారుడు సీఈఓ పునిత్ గోయెంక్ కారణమని తెలుస్తోంది.
2021లో ఒప్పందం
2021లో ఇరు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. సోనీ - జీ విలీనం తర్వాత ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తారు. దానికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా పునిత్ గోయెంకా బాధ్యతలు చేపట్టాలి. ఆయన నియామకాన్ని సోనీ గ్రూప్‌తో పాటు సోనీ పిక్చర్ నెట్ వర్క్ ఇండియా సీఈఓ ఎన్‌పీసింగ్‌తో పాటు ఇతర డైరెక్టర్లు ఆమోదం పొందాల్సి ఉంది.
సెబీ మధ్యంతర ఉత్వరులు
అయితే ఈ రెండు సంస్థల మధ్య విలీన ప్రక్రియ చివరి దశలో ఉందనగా.. గత ఏడాదిలో జీ మీడియా సంస్థ నుంచి నిధులు మళ్లించారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సెబీ జీ మీడియా యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించింది. జీ వ్యవస్థాకుడు సుభాష్ చంద్ర, సీఈఓ పునీత్ గోయెంకాపై సెబీ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది.
పునీత్ గోయెంకాకు సెబీ ఆదేశాలు
అందులో గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర, ఆయన తనయుడు పునీత్ గోయెంకా ఏ నమోదిత సంస్థలోనూ డైరెక్టర్ లేదా ఇతర ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది. దీంతో సుభాష్, గోయెంకాలు సెబీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎస్‌ఏటీ)ని ఆశ్రయించారు. అక్కడ వారికి చుక్కెదురైంది. దీంతో జీ, సోనీ విలీనం సందిగ్ధం నెలకొంది.
పునిత్ నాయకత్వంపై నీలినీడలు
తాజాగా పరిణామాలతో జీ సీఈఓ పునిత్ గోయెంకా విలీన సంస్థకు నాయకత్వం వహిస్తారా? లేదా? అనే అంశంపై ప్రతిష్టంభన కారణంగా సోనీ, జీ మీడియాతో పెట్టుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని చూస్తోంది.కొత్త కంపెనీకి గోయెంకా నేతృత్వం వహిస్తారని 2021లో సంతకం చేసిన ఒప్పందం కాగా, సెబీ ఉత్వర్వులతో సోనీ ఆయనను సీఈఓ ఉండేందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది.
విలీనానికి అవసరమైన కొన్ని షరతులు నెరవేరలేదని పేర్కొంటూ, ఒప్పందాన్ని ముగించడానికి జనవరి 20 పొడిగించిన గడువులోపు రద్దు నోటీసును దాఖలు చేయాలని సోనీ యోచిస్తోంది. ఇరుపక్షాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. గడువులోపు ఇంకా స్పష్టత రావొచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment